అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Tuntari

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

కథాబలం లేని కామెడీ పీస్. రోహిత్ రాంగ్ సెలక్షన్.


​కథలోకి వెళితే :

ఓపెనింగ్ సీన్ వెన్నెల కిషోర్ తన సాఫ్ట్వేర్ టీం తో ఆనంతగిరి హిల్ స్టేషన్ కి వెళతాడు వీకెండ్ టూర్ కి. అక్కడ  నీటిలో తపస్సు చేసుకుంటున్న సాధువుని చూసి వెంబడించి, నిజమైన సాధువో కాదో కనుక్కోవడానికి వచ్చే దసరా రోజు తరువాత వచ్చే న్యూస్ పేపర్ ని అడుగుతాడు కిషోర్. వీళ్లందరికి షాక్ ఇస్తూ సాధువు గాలిలో పేపర్ ని సృష్టిస్తాడు. పేపర్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు పని చేసే సత్వమ్  కంప్యూటర్స్ మూత పడిందని వ్రాసుంటుంది. నవ్వుకుని వెళ్ళిపోతారు కిషోర్ గ్యాంగ్. ఇక్కడ నుంచే కథ సస్పెన్స్  ట్రాక్ లోకి వెళ్లి  నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళిన వీళ్ళందరికీ  మొదటి ట్విస్ట్ ఇస్తుంది, సత్వం కంప్యూటర్స్ ఆపరేషన్స్ తాత్కాలికంగా మూత పడిందని. అదే పేపర్లో ఇంకో షాకింగ్ న్యూస్ దసరా తరువాత వీళ్ళందరూ బి స్ ఎన్ ల్ ఉద్యోగి  కొడుకైన రాజు(నారా రోహిత్) అనే స్నేహితుడి వల్ల బాక్సింగ్ చాంపియన్ షిప్ గెలిచి కోటీశ్వరులు అయ్యారని ఉంటుంది.
వైజాగ్ అంతా గాలించి రాజుని కలుస్తారు. రాజు, షకలక శంకర్ తో కలిసి అవారాలా తిరుగుతూ ఉంటాడు. కాని పేపర్లో రాజు బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ గెలుచుకుంటాడాని ఉంటుంది.సో వీళ్ళు పధకం ప్రకారం రాజుని బాక్సింగ్ కోచింగ్ లో జాయిన్ చేసి, తను ప్రేమిస్తున్న సిరి(లతా హెగ్డే) ని కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో సిరి ఇంటి ఎదురుకుండా ఫ్లాట్ లో దిగడం, సిరితో పరిచయం, తను బాక్సర్ నని అబద్దం చెప్పుకోవడం, ప్రేమ లాంటి సీన్స్ ప్రేక్షకులకి కొద్దిసేపు నవ్వుల కాలక్షేపం.కథలో బరువైన ట్విస్ట్ కిల్లర్ రాజు( కభీర్ సింగ్) అనే వేరే పేరుగల వ్యక్తి కూడా కోచింగ్ లో జాయిన్ అవుతాడు. ఈ రాజు కూడా బి స్ న్ ల్ ఆఫీస్ లో పనిచేసే ఇంకో ఆనందరావు కొడుకు. వెన్నెల కిషోర్ బ్యాచ్ మెత్తం టెన్షన్ లో పడుతుంది ఛాంపియన్ షిప్ ఏ రాజు గెలుచుకుంటాడని? ఆడియన్స్ ని సస్పెన్స్ లో పెడుతూ ఓ ఇంటర్వల్.

సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ విత్ కామెడీ ట్రాక్ మొదలవుతుంది. ఓ పక్క సిరితో ప్రేమాయణం, ఇంకో వైపు ప్రాక్టీసు సగిగ్గా చేయకుండా వెన్నెల కిషోర్ బ్యాచ్ ని ఏడిపిస్తూ ఉంటాడు మన రాజు.  ఆడియన్స్ ఎదురు చూస్తున్న ఛాంపియన్ షిప్ మొదలవుతుంది. లీగ్ మ్యాచ్ లో సునాయాసంగా గెలిచి ఫైనల్ కి సెలెక్ట్ అవుతాడు మన రాజు. మ్యాచ్ రిఫరీగా అలీ కామెడీ మధ్య మధ్య లో నవ్విస్తుంది. మరో పక్క కిల్లర్ రాజు కూడా ఫైనల్‌కి సెలెక్ట్ అవుతాడు. కిల్లర్ రాజు పై  గెలవడని తెలిసిన రాజు తప్పించుకోబోయే ప్రయత్నం చేస్తాడు. సిరి ప్రేమని వదులు కోలేక  ఏకంగా కిల్లర్ రాజు ఇంటికి వెళ్లి బ్రతిమాలతాడు. ఈ ప్రయత్నాలేమి ఫలించవ్. కిల్లర్ రాజు చేతిలో అవమానం ఎదురవుతుంది మన రాజుకి. కథ ప్రీ క్లైమాక్స్ లో రాజుకి కసిపుట్టి ప్రాక్టిస్ మొదలుపెడతాడు. కిషోర్ టీం కూడా కిల్లర్ రాజు వైపే వెళ్ళిపోతారు. తెలుగు సినిమాలో హీరో ఒంటరిగానే గెలుస్తాడు. తన లవర్ సిరి కోసం  రింగ్‌లో  కిల్లర్ రాజు మీదే గెలిచి తుంటరి టైటిల్ కార్డ్ కి శుభం సిగ్నల్ ఇస్తాడు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సాయి కార్తీక్ సంగీతం ఓ మోస్తరుగా వుంది.

దర్శకుడు నాగేంద్ర గురించి, నారా రోహిత్ ని ఒక యాక్షన్ హీరోగా చూపించే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ అంటా థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ గా తన కథనాన్ని సెకండ్ హాఫ్ వచ్చే తప్పటికే కామెడీ అండ్ ఆక్షన్ జోనర్ లోకే మార్చి తను ఒక కమర్షియల్ దర్శకుదిగా మారాలన్న ప్రయత్నం అభినందనీయం.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

నారా రోహిత్ హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి పాత్రలో ఒదిగిపోయే నటుడు. ఆయన నటన బాగుంది. 

మిగతా వారందరూ దర్శకుడి ఆలోచనలకి తగ్గట్టే చేసారు. 


మైనస్ పాయింట్స్ :

నారా రోహిత్ హీరోయిజం కన్నా కథకే ప్రాధాన్యమిచ్చే మంచి నటుడు. ఈ పట్టు కమర్షియల్ ఫార్మాట్‌కి వెళదామని తప్పటడుగు వేసాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంటా ఫాంటసితో మొదలై సుస్పెస్సు క్రియేట్ చేస్తూ ఆశక్తిగా సాగిన కథనం, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సీరియస్‌నెస్ కి కామెడీ కి మధ్యలో తేలిపోయింది. ఏ మాత్రం బాక్సింగ్ రాని హీరో ఒక బాక్సర్ కి పై గెలవడం, సగటు ప్రేక్షకుడు నమ్మేలా దర్శకుడు తీయలేకపోయేడనే చెప్పచ్చు
Genre : Love & Comedy
Target : All Nara Rohit fans 

Story line: ఒక సాధువు మాట విని బాక్సర్ కాని ఆవారా ని బాక్సర్‌ని చేసి చాంపియన్ ని చేస్తే..ఇదే తుంటరి. 


Rating..2/4 (ఫరవాలేదు)
 
Banner : Sree keerthi films.
Producer  :Askok, Nagarjun.
Director    :kumar Nagendra 


నారా రోహిత్, లతా హెగ్డే, వెన్నెల కిషోర్, ఆలి, కభీర్ సింగ్, శకలక శంకర్ లు ముక్య తారాగణంగా నటించిన తుంటరి సంగతులు. 


Release Date : 11th Mar 2016. 

తెలుగు వేదిక రేటింగ్