అక్షర తోరణం ప్రత్యేక సంచిక


​కథలోకి వెళితే :


కథలోకి తొంగి చూస్తే పాతబస్తీ డాన్ లాలా చేసే అవినీతి పనుల మీద కేస్ ఫైల్ చేస్తాడు సామాజిక కార్యకర్త సత్యదేవ్. 


సినిమా ఆదినించి మన హీరో కార్తీక్ ( మాస్ మహారాజా ) కి పెళ్లి పాట్లు. ఫామిలీ అంతా కార్తీక్ పెళ్ళికొసమే తిండి తిప్పలు మాని సంబంధాలు వెతుకుతుంటారు. మరోవైపు కార్తీక్  ప్రేమకోసం తన పెళ్లి సంబంధాన్ని చెడకొట్టి మరీ  తన ప్రేమలో పడేటట్టు చేసుకుంటుంది కథానాయకి పుష్ప (రాశి ఖన్నా ).


కథ ఇలా సరదాగా సాగుతుంటే రవితేజ కంపెనీలో మిషనిరిపై దాడి జరుగుతుంది. ఈ సంఘటన ఎందుకు జరుగుతుందో తెలీకముందే సత్యదేవ్ అనే సామాజిక కార్యకర్తని హత్యచేయడం రవితేజ చెల్లి చూడటంతో కథ లో అనుకోని మలుపు చోటు చేసుకుంటుంది.


తన ఫ్యామిలీని ఎదిరించి చెల్లితో సామాజిక బాధ్యతగా సాక్ష్యం చెప్పడానికి రెడి అవుతాడు కార్తీక్. తన చెల్లెలు గుర్తుపట్టిన వ్యక్తి 5 సంవత్సరాల క్రితమే చనిపోయాడని చెప్పడంతో హత్య చేసిన ఇర్ఫాన్ కళ్ళముందే కనపడినా ఏమీ చేయలేని పొజిషన్లో ఉంటాడు కార్తీక్. ఏదో జరగబోతోంది అనే టెన్షన్ లో ఆడియన్స్ కి ఇంటర్వల్ బాంగ్. 


మన మాస్ మహారాజా గతంలో ఒక పోలీసు. సామాజిక కార్యకర్త సత్యదేవ్ హత్య నించి ఇంటర్వల్ వరకు జరిగిన ప్రతి ఎమోషన్ సీన్ ఆడియన్స్ కి ఇంటర్వల్ తరువాత ఏం జరగబోతోందనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రతి సెకండ్ రవితేజ ఎంటర్టైన్ చేశాడని చెప్పచ్చు.


 కట్ చేస్తే 4 సంవత్సరాల క్రితం తన ఆవేశపూరిత ప్రవర్తనతో సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ కార్తీక్. కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. కొత్తగా పోస్టింగ్ రావడంతో వాడు వీడని చూడకుండా సొసైటీలో యాంటీ ఎలెమెంట్స్ని ఏరిపారేసే పనిలో పడతాడు. మళ్లీ ఓ ప్రేమ కథ. తనని ఇష్టపడిన దివ్యతో(సీరత్) పెళ్లి ఫిక్స్ చేస్తారు ఫామిలీ. ఫామిలీని కూడా పక్కన పెట్టి డ్యూటీ లో డే అండ్ నైట్ గడుపుతుంటాడు మాస్ మహరాజ్. పాత బస్తీ MLA లాల,కొడుకు ఇర్ఫాన్ గ్యాంగ్ ని ఎదిరించి CM పర్యటన జరిగేలా చేస్తాడు. ఆఖరికి పాతబస్తీలో జరిగే ఎలక్షన్ పోలింగ్ లో పడి దివ్యతో జరిగే ఎంగేజ్మెంట్ విషయం కూడా మర్చిపోతాడు. లాలా కొడుకు ఇర్ఫాన్ ఎలక్షన్స్ లో ఓడిపోతాడు. ఆ కోపంతో హోమ్ మినిస్టర్ కొడుకు పార్టీలో  తన ఫ్రెండ్ షాలినిని షూట్ చేస్తాడు ఇర్ఫాన్. హోమ్ మినిస్టర్  కూడా లాలకి భయపడి ఏం చేయలేకపోవడంతో కేస్ కార్తీక్ దగ్గరకి వస్తుంది. పెళ్లి పనులు కూడా మర్చిపోయి డ్యూటీ లో పడిపోతాడు కార్తీక్. ఎంతలా అంటే తన పెళ్లి  క్యాన్సల్ అయిన విషయం కూడా తెలీనంతగా. ఇర్ఫాన్ వేటాడే పనిలో కార్తీక్ గాయపడతాడు. కొడుకు చనిపోయినట్టుగా నమ్మిస్తాడు లాలా. కార్తీక్ సస్పెండ్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ తో పోలీస్ కారెక్టర్ లో ఇరగదీసాడని చెప్పచ్చు రవితేజ. 


ఇర్ఫాన్ బ్రతికేవున్నాడన్న విషయం తెలిసి మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. కార్తీక్ కి పెండింగ్ కేస్ ఒకే ఒక్కటి ఇర్ఫాన్ ని చంపడం. ఎలాగూ రికార్డ్స్ లో చనిపోయిన ఇర్ఫాన్ కథ ముగుంచి పుష్పతో పెళ్లికి రెడీ అవుతాడు మన మాస్ మహారాజా.


కథ సమాప్తం.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


రవితేజ తన బ్రీత్ టేకింగ్ నటనతో ఓ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నే చూపించాడు. ప్రతి సీన్, ప్రతీ షాట్ లో తన ఎనర్జిటిక్


పెర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపాడని చెప్పచ్చు. 


ఇక కథానాయికలు రాశీ ఖన్నా, సీరత్ లు ఏక్షన్ లేని చోట తమ అందాలతో  ఎంటర్టైన్ చేశారు. 


అజయ్, మురళి శర్మ, సుహాశిని, వెన్నెల కిషోర్  పాత్రలు ఆకట్టుకున్నాయి.బెస్ట్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్ :
Touch chesi chudu

Telugu Movie Review & Rating

Genre : Action entertainer.
Target : 
అల్ మాస్ మహారాజా ఫాన్స్.

Story line:
ఎమోషన్స్ తప్ప సెంటిమెంట్స్ తెలీని ఓ యాంగ్రీ కాప్ కథే ఈ టచ్ చేసి చూడు.

Rating :
2/4 (ఫరవాలేదు)

Banner      :
Sri Lakshmi Narasimha Productions
Producer  :
Nallamalupu Bujji & Vallabhaneni Vamshi Mohan
Director    :
Vikram Sirikonda


గతంలో విక్రమార్కుడు సినిమాలో పోలీస్ కారెక్టర్ లో అదరగొట్టిన మన మాస్ మహరాజ్, ఈ రోజు రిలీజ్ అయిన టచ్ చేసి చూడు లోకూడా ఏ మాత్రం సందేహం లేకుండా యాక్షన్ పరంగా టచ్ చేశాడనే చెప్పచ్చు. కాకపోతే కథే టచ్ చేసేంతగా లేకపోయినా ఫరావాలేదనిపించేలా టచ్ చేసి చేయనట్టుంది. 
    

Release Date : 2nd Feb, 2018. 

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్