అక్షర తోరణం ప్రత్యేక సంచిక

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది


బాబాయ్ పరువు నిలబెట్టిన అబ్బాయ్. తొలిప్రేమ A feel good love story.


​కథలోకి వెళితే :


ఆదిత్య(వరుణ్ తేజ్ )అర్థరాత్రి వణికె చలిలో ఎవరికోసమో నిరీక్షణ, అందరిని అడుగుతూ జ్ఞాపకాల ప్రేమ కథని మన కళ్ళకి చూపెడతాడు.


కట్ చేస్తే కాలేజ్ లాస్ట్ డే ప్రిన్సిపాల్ ని ఏడిపించి వైజాగ్ కి గుడ్ బై చెప్పి తన ప్రేమ కథకి ట్రైన్ లో మొదటి పేజీ ఓపెన్ చేస్తాడు. వర్షా (రాశి ఖన్నా) ని ట్రైన్ లో చూడగానే ఫాల్ ఇన్ లవ్. కొన్ని ట్విస్ట్స్ లేనిదే ప్రేమకథ ముందుకు నడవదు కదా!!


అనుకోకుండా ఇద్దరు ట్రైన్ మిస్ అయ్యి, వర్షాని రౌడిలనుంచి కాపాడి, ఓ నైట్ స్టేషన్లో గడపాల్సొస్తుంది. మనసులో మాట ఐ లవ్ యూ చెప్పేస్తాడు. పనిలో పని  వర్షాతో ఓ వర్షపు పాట. అన్ని లవ్ స్టోరీస్ లాగానే వర్షాని మిస్ అయ్యి, మూడు నెలలు గాలించి చేసేదిలేక ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతాడు.


తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు వర్షా కూడా అదే కాలేజ్ లో జాయిన్ అవుతుంది. ఫ్రెండ్ రవి(ప్రియదర్శి) తో సరదా కబుర్లు, వర్షతో ప్రేమ కబుర్లు, సీనియర్స్ తో గొడవలు ఇలా ఆడియన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఈ ప్రేమ పక్షుల కథ సరదాగా సాగుతుంది. ఇక వర్షాతో ఐ లవ్ యు చెప్పించుకునే సీన్ అదరహో. మూవీకె హైలెట్ సీన్ ఇది. ఇక సమస్యల్లా ఆది కొచ్చే షార్ట్ టెంపర్. ఇష్టం లేనిది టచ్ చేయడు, వద్దు అనుకుంటే మొహం చూడడు.


 ఈ కోపంతోనే వర్షని టీజ్ చేస్తున్న సీనియర్ తో గొడవపడి, ప్రిన్సిపాల్ వరకు వెళ్లి, ఇద్దరు ఇగోస్ హార్ట్ అయ్య, బర్త్ డే గిఫ్ట్ గా తెచ్చిన రింగ్ ని బ్రేక్ అప్ తో ముగిస్తాడు ఆదిత్య. మూవీ చూస్తున్న ఆడియన్స్ కి ఇద్దరూ కరెక్టే అనే ఫీల్ కలుగుతుంది. ప్రేమ, ఈగోలలో ఎవరివైపు తప్పుందో తేల్చుకునేలోపే ఈ బ్రీత్ టేకింగ్ లవ్ సస్పెన్స్ కి ఓ ఇంట్రవల్.

 ఈ టైంలో ఆదిత్య  వర్షా మీద కోపంతో లండన్ వెళ్లి అక్కడే స్టడీస్ పూర్తి చేయడం, సరదాగా ప్రియదర్శి, కులం ఫీలింగ్ తో నరేష్  చేసే కామెడీ,హైపర్ ఆది బెట్టింగ్ లతో కాలం 6 సంవత్సరాలు  గడిచిపోతుంది. ఎంతమంది అమ్మాయిల్ని చూసినా కనెక్ట్ అవ్వడు. వర్షా మీద ప్రేమ కోపం రెండూ పెరుగుతూనే ఉంటాయి. ఆదిత్యగా వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ చాలా బాగుంది. అచ్చు లండన్ దొరలా ఉన్నాడు.అనుకోని వర్షంలా ఆదిత్యకి మళ్లీ వర్ష లండన్ లో ఎదురవుతుంది. ఇద్దరూ కలిసే వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఆదిత్య ఈగో ఇంకా తగ్గదు, వర్ష మాట్లాడదామన్నా దూరం పెడతాడు. చాలా సందర్భాలు కలిసొచ్చినా దగ్గరవ్వలేక, ప్రేమని చంపుకోలేక చివరకు వర్ష బర్త్ డే, రవి పెళ్లి ఇద్దరిని దగ్గర చేస్తుంది. కాని అది  మనసులో ప్రేమని పుట్టించదు.  కాలేజ్ డేస్ లో బ్రేక్ అప్ ని, తనని కాదన్న వర్షామీద కోపాన్ని పైకి చూపెడుతూ వర్షాని దూరం పెడతాడు. 
కానీ ఈ ప్రేమ కథకి ఏదో ఒక ఎండింగ్ ఉండాలి ఇద్దరు కలవడానికి ఓ మనిషి కావాలి. అలా ఈ మూవీలో ముఖ్యమైన కారెక్టర్ వరుణ్ తేజ్ ఇగోని కరిగించి వర్షకి దగ్గర చేస్తుంది. తొలిప్రేమ సుఖాంతమవుతుంది.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :సినిమాటోగ్రఫీ జార్జ్ విలియమ్స్ గురించి. ప్రతి ఫ్రేమ్ వెన్నెల్లో ఆడపిల్లలా ఉంది. వరుణ్ ని చాలా బాగా చూపెట్టాడు. 


ఈ మధ్య కాలంలో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీస్తున్నాడు. ఈ మూవీలో పాటలు కూడా. అల్లసాని వారి పద్యమంతా అనే పాట చాలా బాగుంది.


ఇక మన తొలి సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి. కథ, కథనం, కారెక్టర్, కారెక్టరైజేషన్, లాగ్స్ లేకుండా మూవీని క్లైమాక్స్ వరకు నడపడం అంతా సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి పాత ఫార్ములా ఉపయోగించిన ఫీల్ మిస్సవ్వకుండా చేయడం వల్ల ఎక్కడా బోర్ కొట్టలేదు.


ఓ కొత్త కథ చూసినట్టుంది. మొత్తానికి తొలిప్రేమ విజయాన్ని అందరికి పంచాడు

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

మెగా అభిమానులు అనుకున్నట్టే బాబయ్ పరువు నిలబెట్టేలా అబ్బాయ్ వరుణ్ తేజ్ తన నటనతో యూత్ ని ఆకట్టుకున్నాడు. లవ్ అండ్ ఈగో ఈ రెండు భావాల్ని తన పాత్రతో పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్ లో లండన్ కాలేజ్ లో వరుణ్ లుక్, డ్రెస్ సెన్స్ ఇంచు మించు బ్రిటిషర్ ని పొలినట్టు ఉంది. 

ఇక రాశి ఖన్నా గురించి, ఈ అమ్మాయికి పెద్దగా నటన రాదు అనుకున్న వాళ్ళు ఈ మూవీ తప్పక చూడాలి. 

ఇంటర్వల్ కి ముందు కాలేజ్ సీన్, తొలి పరిచయంలో ట్రైన్ ఎపిసోడ్ లలో వరుణ్ ని మించి నటన కనపరిచింది.

ప్రియదర్శి, హైపర్ ఆది,నరేష్, విద్యుల్లతా మూవీకి ప్లస్ పాయింట్.
​​

TOLI PREMA

Telugu Movie Review & Rating

Genre : Pure Love story with youth Entertainer
 

Artists: Varun Tej, Rashi kanna, viva Harsha, Naresh, Suhasini, Hyper Adi, priyadarshi, Vidhya lekha


Story line:
ఈగో, ప్రేమలు మధ్య నలిగే ప్రేమ జంట కథే ఈ తొలిప్రేమ.
Rating :
3/4(బాగుంది)

Producer: BVSN Prasad

Director    : Venky Atluri​
Music:
S Taman

Banner: Sri venkateswara cini chitra
Cinematography: George C Williams
Release Date :
10th Feb, 2018. 

తెలుగు వేదిక రేటింగ్