అక్షర తోరణం ప్రత్యేక సంచిక

కలుసుకుందాం రండీ
ప్రాణమనే పాస్పోర్టుతో
పిడికేడు ఆశల వీజాతో
దరణిపై  పడ్డాము
దోసేడు తీపి జ్ఞాపకాలను  
తోడు తీసుకెల్దాం రండీ
కమ్మగా కలుసుకుందాం రండీ


రక్త సంబందికులతో ఆప్యాయతతో
ఇరుగు పొరుగుతో అనురాగంతో
స్నేహితులతో అనందంగా
కలుసుకుందాం రండీ


కలుసుకున్న ప్రతిసారి
మన జ్ఞాపకాల పువ్వు ఓ కొత్త రేకు తొడగాలి
ప్రతి కలయికా అలసిన కళ్ళకు
కలల విసనకర్రలు కానుకగా ఇవ్వాలి
అందకే కలుసుకుందాం రండీ


మళ్ళీమళ్ళీ కలుసుకోవడం నిజానికి
ఒకరినొకరు మళ్ళీమళ్ళీ తెలుసుకోవడానికే
అందకే కలుసుకుందాం రండీ


లాభ నష్టాల క్యాలిక్యులేషన్ కాకుండ
కష్టసుఖాల కాంబినేషన్గా
కలుసుకుందాం రండీ


ఎలాగూ వచ్చాం
వెళ్ళడంకూడా తప్పదు
కలుసుకోవడానికే వచ్చాము కాబట్టి
అందుకే కలుసుకుందాం రండీ

జీవితాన్ని ఉత్సవంగా జరుపుకుందాం రండీ
నలుగురి నవ్వుల్లో మనబొమ్మను చూసుకుందాం రండీ

గుప్పెడంత గుండె

రచన:  సిరి లాబాల

రచన:  బాటసారి

రచన:  కట్టా అశోక్

లోకరీతి
కాళ్ళు చేతులు సరిగ్గా వున్నంతకాలం
ఈ జీవుడికి పక్కవాడిగురించి అనవసరం
కనీసం అమ్మని కూడా
తలుచుకోని మహానుభావులెంతమందో !
 
కాస్త ఏ జ్వరమో ,

ప్రమాదమో వచ్చి
రెండు రోజులు మంచాన పడితే
అమ్మ కావాలి

కొన్ని వేలసార్లు అమ్మ అమ్మ అంటూ పిలవాలి
మన చిరాకులు పరాకులు
దగ్గరుండి ఓపిగ్గా భరించటానికి

నా అనే మనిషి కావాలి !

అందుకే నేస్తం!


మనిషి సంఘజీవిగా బ్రతకాలి
మన అనే నిజమైన తోడు మనకి కావాలి
సాటి వ్యక్తికి చేయగలిగినంత
మాటసాయమో చేతసాయమో చేయాలి


ఆస్తులూ రావు

అంతస్తులూ రావు
ఈ కొద్దిపాటి పుణ్యం
నా అనే మనిషే చివరి వరకూ తోడుండేవి !

అమ్మ కడుపులో పడ్డది ఆడపిండమని తెలిసి

అమ్మ గర్భాలయంలోనే సమాధిచేసి
అమ్మతనాన్నే హత్యచేస్తున్నారని తెలిసి
మనసంతా తల్లడిల్లిపోయి బాధతో రగిలిపోయినా
గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంది .

కామ క్రీడలకు ప్రతీకగా కుంతీ పుత్రులై ,
పేదరికాన్ని అనుభవించే చిన్నారులుగా మారి 
జీవచ్చవాలుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ
గుప్పెడు మెతుకులకోసమై
గుడిమెట్లపైనో ,బస్టాండు, రోడ్లపైనో
బిక్షమెత్తుకొనే చిట్టిపొట్టి చిన్నారులను చూస్తూ  
గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంది .

కులమతాల తారతమ్యాల కుమ్ములాటలో
రిజర్వేషన్ల పేరుతో జరిగే తికమకలతో
తల్లడిల్లిపోతున్న తెలివైన వ్విధ్యార్దిని చూసి కూడా
గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంటుంది

మనుషులకు మనుషులకు మధ్య
మానవత్వం మరుగున పడి
డాబుదర్పాల బేరిజులో
రాత్రి పగలు రగిలే రాగద్వేషాలకు బలైపోయి
ఓ మనిషి హృదయ ఘోష గాలిలో కలిసిపోయినా
గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంది

అడుగడుగునా కామరక్కసి కోరల్లో చిక్కిన
అతివ  ఆర్తనాదాలు పెట్టి పెట్టి అలసిపోయినా
మధమెక్కిన మనిషి చేతిలో పడి మానం మంటగలిసి
అవమానభారంతో రగిలిపోయినా  
గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంది .

రోజురోజుకి పెరుగుతున్న విజ్ఞానం పేరుతో
అజ్ఞానంతో చేసే విద్వంసకాండలో  
మాడి మసైన మానవ దేహాల ధూళి చూసి కూడా

గుప్పెడంత గుండె కొట్టుకుంటూనే ఉంది 

 రచన:  బాటసారి

రచన:  కట్టా అశోక్

రచన:  సిరి లాబాల