అక్షర తోరణం ప్రత్యేక సంచిక

ప్రారంభమహోత్సవము 

ముంబై మహానగరంలో మహారాష్ట్ర కవులందరూ కలిసి నిర్వహించుకున్న అక్షర తోరణం . దిగ్విజయంగా జరిగింది. కవిత్వానికి కవులకు పెద్ద పీఠ వేసి, ఇంకా మెరుగైన కవితలు, సంకలనాలు, పుస్తకాలు వెలువడాలని, తెలుగేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కవులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో మరియు, నెక్స్ జెన్ సాంకేతికతతో  ప్రపంచ పటంపై తెలుగు కవితను  ఆవిష్కరించాలని, కవులకు సినిమా, రచన, గేయం, కంటెంట్ మానేజ్మెంట్ వంటి వాటిల్లో అవకాశాలను కల్పించాలన్న సంకల్పంతో "అక్షర తోరణం" కవన పండుగ మహారాష్ట్ర కవులచే ఆగష్టు 26న వాషిలో తెలుగు కళా సమితి హాల్ లో శాస్త్రోక్తంగా ఆవిష్కరించబడింది. 


ఏ స్పాన్సర్స్ లేకుండా కవులంతాకలిసి వారే క్రౌడ్ ఫండింగ్ చేసుకొని, అక్షర తోరణమే సభా అధ్యక్షతగా, కవిత్వమే ముఖ్య అతిథిగా, కవి గౌరవ అథితిగా రంగ రంగ వైభవంగా జరిగింది. 


మహారాష్ట్రలోని కవులందరూ ఆర్ధిక, శ్రమ బలంతో ఈ అక్షర యాగానికి పూనుకున్నారు. ప్రాంగణం అంతా ఫిలిం మేకర్ వజ్రనాభ నటరాజ మహర్షి గారి పెద్ద ఫ్లెక్సీ కటింగ్ ల క్రియేటివ్ ఫొటోగ్రఫీతో అంతర్జాతీయ కవితా పండుగలాగా అలంకరించబడింది. ప్రతి ఫ్లెక్సీలో కవిత్వం ఉట్టిపడే కొటేషన్స్  దర్శనమిచ్చాయి. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న మోడల్స్ కూడా భాష రాకున్నా ఉత్సాహంగా పాలుపంచుకోవడం విశేషం. వేదిక అక్షర తోరణం బనెర్ తో అలంకరించబడటమే కాక, వేదిక ముందు అక్షర యాగం తలపించేల యజ్ఞ గుండం ఆ పైన కలం శంఖంతో ఓ పవిత్ర కావ్య ప్రాంగణంగా తయారు అయ్యింది. విశేషమేమిటంటే వచ్చిన వారంతా ఆ మహత్తర కవిసమ్మేళనంలో విసుగులేకుండా ఉదయం10:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ముంబై, భివాండీ, అంబర్నాథ్, పూణే. షోలాపూర్ నుండి సుమారు 50 మంది కవులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మహిళలు మా తెలుగు తల్లికి పాట పాడి అక్షర తోరణానికి తెర తీసారు. 


ముందుగా నటరాజు మహర్షి స్వాగతోపన్యాసం అనంతరం, అక్షర తోరణం, కవిత్వం, నేటి కవుల పోకడ , తదితర అంశాలపై రవీంద్ర సంగెవేని ప్రసంగించగా, రవీనా చవాన్ కవిత పర్యాప్తి గురించి చెప్పారు. అనంతరం తాను రచించి స్వరపరిచిన  అక్షరతోరణం పాటని మహారాష్ట్ర కవులకి నటరాజ మహర్షి అంకితమిచ్చారు. 


​రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆడపడుచులు కవులకు విచ్చేసిన సోదర సమానులందరికి రాఖీ కట్టి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. 

PHOTO GALLERY-1