అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Supreme

Telugu Movie Review & Rating

FIRST HALF BORING, SECOND HALF INTERESTING ..FINAL OUTPUT OK...

కథలోకి వెళితే :

దిల్ రాజు సమర్పించే సినిమా అంటే మినిమం గ్యారంటి. ఇక పటాస్ సినిమాతో హిట్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వం, సాయి ధరం తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రంపై సినిప్రేమికులలో పక్కా హిట్ మూవీ అనే అంచనాలు వున్నాయి. నేడే విడుదలైన ఈ  చిత్రం ఆ అంచనాలను చేరిందో లేదో చూద్దాం.

ఓపెనింగ్ సీన్ జాగృతి ట్రస్ట్ అధినేత నారాయణరావుని(సాయికుమార్) మోసం చేసి విక్రమ్ సర్కార్( కభీర్ సింగ్) ట్రస్ట్ భూముల్ని లాక్కుంటాడు.కోర్టు కూడా సర్కార్ సాక్షాలనే నమ్ముతుంది. చివరి అవకాశంగా ఫిబ్రవరి 5 తారీఖు వరకు గడువిస్తుంది. ఇక్కడనుంచే కథలో సంఘర్షణ మొదలై  ట్రస్ట్ ని కాపాడుకోవడానికి నారాయణ రావు ట్రస్ట్ కి  నిజమైన వారసులకోసం వెతికే పనిలో పడతాడు. ఇక మనందరం ఎదురు చూసే హీరో బాలు( సాయి ధరం) ఎంట్రన్స్ ఒక కామెడీ ఫైట్తో మొదలవుతుంది. తానో టాక్సీ డ్రైవర్ ,తన టాక్సీ పేరు సుప్రీం. కారు వెనుక dont sound horn అని రాసుంటుంది. బాలు కార్ కి సైడ్ ఇమ్మని హార్న్ మోగిస్తే ఆ కార్ ని చిత్తు చిత్తు చేస్తాడు. అతనికో తాగుబోతు తండ్రి రాజేంద్రప్రసాద్.ఇది టూకీగా మన బాలు గురించి.
బెల్లం శ్రీదేవి(రాశీ ఖన్నా) ఆ ఏరియా కి కొత్తగా వచ్చిన ఎస్. ఐ. మార్కెట్లో చూసి వెంటనే ప్రేమలో పడతాడు బాలు. కథకి సంబంధం లేని రాజన్ అనే ఓ అనాధ NRI బాబుకి, బాలుకి పరిచయం పెరుగుతుంది. ఇంటికి తెచ్చి తనతో పాటే పెంచుకుంటాడు. ఇక కథలో కామెడీ విషయానికొస్తే పాతిక లక్షలు పెట్టి శ్రీదేవి కి ఎస్.ఐ పోస్ట్ కొన్న తండ్రి రఘుబాబు తిరిగి ఆ డబ్బులు సంపాయించి పెట్టమని కూతురిని విసిగించడం, వాలెట్ పార్కింగ్ పేరుతో పృథ్వి, ప్రభాస్ శ్రీనులు( జింగ్ బ్రదర్స్) సిటీలో ఖరీదయిన కార్లు కొట్టేయడం. కానిస్టేబుల్ వెన్నెల కిషోర్, బాలు ప్రేమకి అడ్డుపడటంలాంటి సన్నివేశాల ఆడియన్స్ కి నవ్వుతెప్పిస్తాయి. కొన్ని చోట్ల అక్కర్లేని నవ్వుకూడా బలవంతంగా తెప్పించినట్టుంటుంది కథకు సెంటర్ పాయింట్ అయిన జాగృతి ట్రస్ట్ విషయాన్ని పక్కన పెడుతూ. సినిమా ఇంటర్వల్ కి చేరుకునే సమయానికి విక్రమ్ సర్కార్ మనుషులు, నారాయణరావులు  వారసుడికోసం సీరియస్ గా వేట మొదలెడతారు.ఇక్కడే కథలో కీలక మలుపు సర్కార్ మనుషులు బాలుని గాయపరిచి రాజన్ ని ఎత్తుకుపోతారు. ఆడియన్స్ కి సస్పెన్స్  క్రియేట్ చేస్తూ ఓ ఇంటర్వల్.

సెకండ్ హాఫ్ నుంచి కథ ఆశక్తిగా సాగుతుంది. ఆక్షన్  సన్నివేశాలు, చక్కటి కథనంతో ఎక్కడా బోర్ కొట్టదు. దర్శకుడు కాసేపు కథని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళతాడు. ట్రస్ట్ వారసులు లండన్ లో ఉన్నారని తెలుసుకుని నారాయణరావు లండన్ వెళ్ళేటప్పటికి సర్కార్ ముందుగానే రాజారామ్ ఫామిలీని చంపేస్తాడు. మిగిలిన రాజన్ ని, డాక్యుమెంట్స్ తీసుకుని సర్కార్ గ్యాంగ్ కి దొరకకుండా ఇండియా వచ్చేస్తాడు నారాయణరావు. అనూహ్యంగా సర్కార్ మనుషుల దాడిలో తప్పిపోయి బాలుకి దొరుకుతాడు రాజన్. కథ ఫ్లాష్ బాక్లోంచి బయటకుబవచ్చి  ఒరిస్సాలో పీకు(రవి కిషన్) దగ్గర బంధీగా వున్న రాజన్ ని విడిపించుకుని కథని ప్రీ క్లైమాక్స్ కి తీసుకొస్తాడు బాలు. సెకండ్ హాఫ్ లో కామెడీ భాగంగా సంగీత విద్వాంసులు శ్రీనివాస్ రెడ్డి , పోసానీల సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ఇక్కడే మెగాస్టార్ హిట్ సాంగ్ అందం హిందోళం తో స్టెప్పులేసి అదరగొడతాడు బాలు. కథ క్లైమాక్స్ కి చేరి అనంతపురం వచ్చే క్రమంలో సర్కార్ మనుషులతో బాలు పోరాట దృశ్యాలు, చివరగా అనుకున్న గడువులోపల రాజన్ ని ట్రస్ట్ కి చేర్చి , రాజన్ దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పించి, జాగృతి ట్రస్ట్ ని ప్రజలకే సొంతమయ్యేలా చేస్తాడు బాలు.  

మొత్తానికి ఆశక్తి కరమైన సెకండ్ హాఫ్ కథనం, ఆక్షన్, కామెడీ లతో సినిమా బావుందనే టాక్ ప్రేక్షకుడికి కచ్చితంగా కలుగుతుంది.

టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

సంగీత దర్శకుడు సాయికార్తీక్ గురించి. పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందం హిందోళం అనే పాత తప్ప.

సినిమాటోగ్రఫి సాయి శ్రీరాం పనితనం చాలా బావుంది. ముఖ్యంగా ఆక్షన్ సన్నివేశాలలో. సెకండ్ హాఫ్ ట్రక్స కార్ చేసింగ్ సీన్.
 
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి. విలువైన కథని తీసుకున్నాడు , తన చెప్పదలుచుకున్నది మొదటి పదినిముషాలలో, చక్కటి కథనాన్ని సెకండ్ హాఫ్ లో చూపించి, ఫస్ట్ హాఫ్ అంతా అక్కర్లేని కామెడీకే పరిమితం చేసాడు. తనదైన కోణంలో హాస్యాన్ని చూపించే సన్నివేశాలు చాలా బావున్నాయి. ముఖ్యంగా జింగ్ బ్రదర్స్ కామెడీ, సెకండ్ హాఫ్ అన్నయ్య, సీనయ్య ల బ్యాండ్ మేళం కామెడీ. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో రాజన్ తో చేయించిన నటన. సాయిధారమ్ చేయించిన ఆక్షన్ సన్నివేశాలు. 


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

సాయి ధరమ్ తేజ్ నటన సుప్రీం అనే టైటిల్ కి తగ్గట్టుగానే వుంది. కామెడీ అండ్ ఆక్షన్ రెండింటిలోనూ పరిణితి వున్నా నటన ప్రదర్శించాడనడంలో సందేశం లేదు.

రాశీ ఖన్నా పోలీస్ డ్రెస్ లో సైతం చాలా క్యూట్ గా కనిపించింది. నటనకి ప్రాధాన్యత వున్నా ప్రాత్ర కాకపోయినా కాస్త గ్లామర్ ఒలకపోసింది.
పృథ్వి- ప్రభాస్ శ్రీను, పోసాని- శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల నటన చక్కటి హాస్యాన్ని పండించింది.

కామెడీ విలనిజం చేసిన రవి కిషన్, ప్రధాన విలన్ కబీర్ లు తమ పాత్రలకు న్యాయంచేసారు.

సాయికుమార్, మాస్టర్ గాంధీల నటన చాలాబాగుంది.

బెస్ట్ డైలాగ్స్:

నా దేశప్రజలు ఇబ్బంది పడుతూవుంటే నేను చూస్తూ ఉండలేను.( రాజన్)

ప్లస్ పాయింట్స్:

పృథ్వి- ప్రభాస్ ల వాలెట్ పార్కింగ్ కామెడీ.


పోసాని-శ్రీనివాస్ రెడ్డిల బ్యాండ్ మేళం కామెడీ 

సాయిధరమ్ ఆక్షన్

మాస్ట గాంధీ సూపర్ ఆక్టింగ్.

అందం హిందోళం పాటలో సాయిధరం వేసిన మెగా స్టెప్స్.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ బోరింగ్ కామెడీ అండ్ స్క్రీన్ ప్లే.
తెలుగు వేదిక రేటింగ్

బాగాలేదు

ఫరవాలేదు

బాగుంది

చాలా బాగుంది 

Genre :Action & comedy.
Target: All mega fans.

Story line: తండ్రి మాట కోసం ఓ పసివాడు, పసివాడి లక్ష్యం కోసం ఓ పోరాట యోధుడు. ఇదే సుప్రీం కథ. 

Rating :2/4 (ఫరవాలేదు).

Banner             : శ్రీ వెంకటేశ్వరరా క్రియేషన్స్ 
Presented by   :దిల్ రాజు 
Producer          : శిరీష్
Screen play &Direction : అనిల్ రావిపూడి.

సాయి ధరం తేజ్, రాశి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, కబీర్ దుహన్ సింగ్, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి,జయ ప్రకాష్ రెడ్డి, రవి కిషన్, పోసాని , రఘు బాబు, పృథ్వి,వెన్నెల కిశోర్, సురేఖ వాణి, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీనులు ముఖ్య తారాగణంగా నటించిన సుప్రీమ్ సినిమా సంగతులు మీకోసం.


Release Date : 5th May,2016.