అక్షర తోరణం ప్రత్యేక సంచిక

జగన్నాథ రధచక్రాలు
జగన్నాథ రధచక్రాలు
పతితులార!
భ్రష్టులార
బాధాసర్ప దష్టులార!
బ్రతుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రధచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడు లేని, గూడు లేని
పక్షులార!భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్క్రుతులు,
సంఘానికి బహిష్క్రుతులు
జితాసువులు,
చ్యుతాశయులు,
హ్రుతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి!
మీ రక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం ఏడవకండి!
ఓ వ్యధా నినిష్టులార!
ఓ కధా వశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!

వస్తున్నా యొస్తున్నయి…
జగన్నాధ,
జగన్నాధ,
జగన్నాధ రధచక్రాల్!
జగన్నాధుని రధచక్రాల్!
రధచక్రాల్,
రధచక్రాల్,
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తునాయి!

పతితులార!
భ్రష్టులార!
మొయిల్దారిని
బయల్దేరిన
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తున్నాయి!

సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది -
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం…
మహానగా లెగురుతున్నాయి!
మహారధం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘార్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిర గిర గిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!

ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ -
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును..
. వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార!
బ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుదిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాధుని రధచక్రాల్,
రధచక్ర ప్రలయఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!

నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని!
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!

అరె ఝాం! ఝాం!
ఝుటక్, ఫటక్ …

హింసనచణ
ధ్వంసరచన
ధ్వంసనచణ
హింస రచన!
విషవాయువు, మర ఫిరంగి,
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెరిగిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట-
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచి పెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జనవాళికి శుభం పూచి -
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!

నిద్రకువెలిఐ
నేనొంటరినై
నాగదిలోపల చీకటిలో
చీకటిలోపలనాగదిలో
నాగదిలో
చీకటిలో

నేనొక్కడినై
నిద్రకువీలియై
కన్నులనిండినకావీరితో
కావీరినిండి కన్నులతో
కన్నులలో
కావీరితో

నిద్రకువెలిఐ
నేనొక్కడనై
గుండెళకప్పినగుండెలతో
కుంపటికప్పినగుండెలతో
గుండెలలో
కుంపటితో

నాకనుగోనల
నాయెధగోడల,
నాలుగుదిక్కుల బాకులతో
బాకులతోటల బాటలతో
బాటలలో
బాకూలతో
భగభగ భుగ భుగ
భగభగ మండే
నాగది చీకటి నాలుకతో
నాలుకచీలిన నాగులతో

నాగదిలో
నాగులతో
ఇరవైకోరల,
అరవైకొమ్ముల,
క్రూరాఘోర కార్కోటకులో?
ధారుణమరణ ధానావభాషలు
షెరవభైరవ భీకారఘోషలు
ఘోషలభాషల,
ఘంటలమంటలు
కంటకకంటపు గణగణాలో?
చిటేకెలమొటికెల చిటపటలో?నేనొంటరినై
నిద్రకువెలివై...
చీకటిలోపల నా గదిలో
నాగదిలోపల చీకటిలో
చీకటిలో....
ఆకటితో.....

ఓ మహాత్మా ఓ మహర్షి
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితాం ఏది మృత్యు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏది అసత్యం
ఏది అనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏది అనేకం
ఏది కారణమేదీ కార్యం
ఓ మహాత్మా
ఓ మహర్షి
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖెదమ్ రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతిo
ఓ మహర్షి
ఓ మహాత్మా

 ***దేశ చరిత్రలు***

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం.

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

భీభత్సరస ప్రధానం,
పిశాచగణ సమవాకారం!
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం

బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు..
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి

రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో

చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి

వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు
మాయలతో, మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించినవి

జెంఘిజ్ ఖాన్, తామర్లేనూ
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహంతకుడు

వైకింగులు, శ్వేతహూణులూ,
సిధియన్లూ, పారశీకులూ,
పిండారులూ, ధగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన

అగ్నానపు టంధయుగంలో,
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడచి మనుష్యులు-

అంతా తమ ప్రయోజకత్వం,
తామే భువి కధినాధులమని,
స్ధాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన క్రుత్రిమ చట్టాల్

ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై!
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను

చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు

చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ -

హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్ధతత్వం
చాటిస్తా రొక గొంతుకతో

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం

ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకతికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం

నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీలెవ్వరు?

తక్షశిలా, పాటలీపుత్రం,
మధ్యధరా సముద్రతీరం,
హరప్పా, మొహేంజదారో,
క్రో - మాన్యాన్ గుహముఖాల్లో -

చారిత్రక విభాత సంధ్యల
మానవకధ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దేపరమార్ధం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
...@ శ్రీ శ్రీ

కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బు బిళ్ళా -
హీనంగా చూడకు దేన్నీ !
కవితా మయమేనోయి అన్నీ !
రొట్టె ముక్కా ,
అరటితొక్కా ,
బల్ల చెక్కా -
నీ వేపే చూస్తూ ఉంటాయ్ !
తమ లోతు కనుక్కోమంటాయ్ !
తలుపు గొళ్ళెం ,
హారతి పళ్ళెం ,
గుర్రపు కళ్ళెం -
కాదేదీ కవితకనర్హం !
ఔ నౌను శిల్పమనర్ఘం !
ఉండాలోయ్ కవితవేశం !
కానీవోయ్ రసనిర్దేశం !
దొరకదటోయ్ శోభాలేసం ?
కళ్లంటూ ఉంటే చూసి ,
వాక్కుంటే వ్రాసీ !
ప్రపంచమొక పద్మ వ్యూహం !
కవిత్వమొక తీరని దాహం !
( మహాప్రస్థానం - 1950 )
ఋక్కులు (14-04-1934 )


పల్లవి :

తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం 1 :

దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ ఆ ఆ ....
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ .....
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదురవద్దు..బెదరవద్దు
నిదురవద్దు..బెదరవద్దు
నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం 2 :

ఓ ఓ ఓ ఓ ఓ...
ఎవడువాడు?..ఎచటివాడు?
ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటువచ్చిన తెల్లవాడు

కండబలం గుండెబలం
కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు
మానధనం.. ప్రాణధనం
దోచుకొనే దొంగవాడు.. దొచుకొనే దొంగ వాడు
ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
తగినశాస్తి చేయరా...తగిన శాస్తి చేయరా ...
తరిమి తరిమి కొట్టరా.... తరిమి తరిమి కొట్టరా..

తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం 3 :

ఈ దేశం... ఈ రాజ్యం...
ఈ దేశం ఈ రాజ్యం .. నాదే అని చాటించి.. నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలు గొట్టి...
శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి...
తుది సమరం మొదలుపెట్టి.. తుది సమరం మొదలుపెట్టి..

సింహాలై గర్జించాలీ... సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ... సంహారం సాగించాలీ

వందేమాతరం... వందేమాతరం..
వందేమాతరం... వందేమాతరం..

చరణం 4 :
ఓ ఓ ఓ ఓ ఓ...
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా

అందుకో మా పూజ లందుకో.. రాజా..
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అల్లూరిసీతారామరాజా.. ఆ...అల్లూరిసీతారామరాజా..

ఓ ఓ ఓ ఓ ఓ...
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా

త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...

చిత్రం : అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల