అక్షర తోరణం ప్రత్యేక సంచిక

SARDAR GABBAR SINGH

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్

Type your paragraph here.

POWER STAR PAWAN KALYAN'S ONE MAN MAGICAL SHOW WITH GUNS AND HORSES.

కథలోకి వెళితే :
ఓపెనింగ్ సీన్ పోలీస్ ఆఫీసర్ తనికెళ్ళ భరణికి దొంగని పట్టిస్తాడు ఫుట్ పాత్ మీద పడుకున్న మన చోటా గబ్బర్సింగ్. అమ్మ నాన్నా లేకపోవడంతో తనికెళ్ళ భరణే పెంచి పోలీస్ ఆఫీసర్ చేస్తాడు.


రతన్ పూర్ సంస్థాన రాజవంశీకుడైన భైరవ సింగ్(శరత్ కేల్కర్), అతనికి సలహాలిచ్చే అప్పాజీ(పోసాని) తమ చుట్టూ వున్న భూముల్లో మైనింగ్స్ వున్నాయని అక్కడి  ప్రజలని బలవంతంగా ఖాళీ చేయిస్తారు. బానిసలుగా చూస్తారు. అదే రతన్ పూర్ రాజమహల్ కు చెందిన దళపతి హరినారాయన్ సింగ్(ముఖేష్ ఋషి), భైరవ్ సింగ్ ఆగడాలను కంట్రోల్లో పెట్టగల పోలీస్ ఆఫీసర్ కోసం తనికెళ్ళ భరణి సహాయం కోరతాడు. ఇప్పుడే మన సర్దార్ ఎంట్రీ సీన్ రతన్ పూర్ కి సిఐ గా. తనకి తోడుగా సాంబ(ఆలి) ఓపెనింగ్ ఫైట్ అండ్ టైటిల్ సాంగ్ తో సర్దార్ లో వున్న గన్స్ అండ్ హార్సెస్ పై పాషన్ కనపడుతుంది.   

ఊళ్ళోకి రావడంతోటే భైరవ సింగ్ అరాచకాలు ఒకటొకటిగా తెలుసుకుంటాడు మన సర్దార్. వెంటవెంటనే మన కధానాయకి అర్షి తో సర్దార్ పరిచయం కూడా జరువుతుంది. పరిచయం కాస్త ప్రేమ. కథలో మొదటి సంఘర్షణ తల్లి తండ్రులు లేని యువరాణి హర్షికి పెళ్లి చేసే భాద్యత, ఆస్తిని కాపాడే బాధ్యత  హరినారాయన్ భుజాల మీద వేసుకుంటాడు. ఇక్కడి నుంచే సర్దార్ స్టైల్ అఫ్ ఆక్టింగ్ అండ్ కామెడీ మొదలవుతుంది. నో లాజిక్స అండ్ నో ట్విస్ట్స, ఆడియన్స్ కి పవర్ స్టార్ వన్ మాన్ షో మొదలవుతుంది. భైరవ్ సింగ్ గ్యాంగ్ కి తన తిక్క, లెక్క మొత్తం చూపిస్తాడు.క్లబ్ కింద మార్చిన రతన్ పూర్ స్కూల్ ని తిరిగి పిల్లలు వచ్చేటట్టు చేస్తాడు. ఈ క్రమంలో తోబా తోబా సాంగ్ అందరిని అలరిస్తుంది. రాజమహల్ లో మధుమతి(ఊర్వసి). రాజపూత్ తూటాల శేకర్ సింగ్ చౌహాన్(బ్రహ్మానందం) తో చేసే కామెడీతో కథని కొంచం ముందుకు నడిపించి అర్షి యువరాణని తెలుసుకుంటాడు. స్కూల్ బస్సు ని ఆక్సిడెంట్ చేసిన భైరవ్ మైనింగ్ లారీలని ఊళ్ళో వెళ్లకుండా చేసి డైరెక్ట్ గా భైరవ్ తోనే తలపడతాడు. రతన్ పూర్ టౌన్ సెంటర్ లో సాగే ఈ ఫైట్ సీన్ సూపర్. తన తిక్కలో వున్నా సత్తా చూపించి, ఆడియన్స్ కి బిపి పీక్స్ కి పెంచి, బ్రీ త్ టేకింగ్ పెర్ఫార్మన్స్ తో ఓ ఇంటర్వల్.

ఇంటర్వల్  తరువాత కూడా కథలో చెప్పుకోదగ్గ ట్విస్ట్ ఉండవ్, సర్దార్ వన్ మన్స్ షోనే. హరినరాయణ్  సర్దార్ విలువని గుర్తించి సహాయం కోరతాడు, భైరవ నుంచి ప్రజల్ని కాపాడమంటాడు. భైరవ్ సింగ్ వల్ల రాజమహల్ ని కొనడానికి భయపడుతున్న రమేష్ తల్వార్(రావు రమేష్) ని మహల్ ని కొనేటట్టు చేస్తాడు.ఈ సంఘటనలతో కథ ప్రీ క్లైమాక్స్ కి చేరి నందులాల్(కృష్ణ భగవాన్) సాయంతో సర్దార్ ని దొంగ దెబ్బ తీసి, లేనికేసులు ఇరికించి సస్పెండ్ చేయిస్తాడు భైరవ్.అర్షి ప్రేమ విషయం తెలిసి రాజకుటుంబం మీద పగతో బలవంతంగా తనతోటే పెళ్ళికి వప్పిస్తాడు.కథ క్లైమాక్స్ కి చేరుతుంది.కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ పార్ట్ ఎప్పుడూ వండర్స్ జరుగుతూ వుంటాయి, వాటికి కారణాలు కూడా అడక్కూడదు.

గబ్బర్ సింగ్ చేసిన ఆట పాటలతో కాస్త వెరైటి ఫినిషింగ్ ఇచ్చి మొత్తానికి రతన్ పూర్ వాసులకి భైరవ్ సింగ్ పీడ లేకుండా చేస్తాడు. ఫైనల్ గా రతన్ పూర్ యువరాణికి రాజా సర్దార్ గబ్బర్ సింగ్ మొగుడవుతాడు. 


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు : 

టెక్నికల్ టీం గురించి మొదట మాట్లాడుకోవాలంటే విల్సన్ గారి చాయాగ్రహణం. పవర్ స్టార్ లో వున్న పవర్, స్టైల్ అఫ్ ఆక్షన్, బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు చాలా పాషనేట్ గా సాగింది ఫోటోగ్రఫీ.


దేవిశ్రీ పసాద్ సంగీతం చాలా బావుంది. తోబ, తోబా- హే పిల్లా సుభానల్లా సాంగ్స్ రెండూ అయన సంగీత స్తాయిని మరింత పెంచాయి.


ఇక దర్శకుడి బాబీ గురించి. స్క్రీన్ ప్లే, కథని అందించిన పవన్ కళ్యాణ్ అభిరుచికి తగ్గట్టుగానే సాగింది బాబీ దర్శకత్వం. అంతకు మించి చెప్పుకోవలసింది ఏమీ లేదు.


ఇక స్క్రీన్ ప్లే, కథని అందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గురించి. ఒక పాషనేట్ పోలీసు ఆఫీసర్,తనకి తానే స్వత్రంత్రంగా అధికారాలు తీసుకుని, వాడే గన్ దగ్గర్నుంచి ఎక్కే గుర్రం వరకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుని, కామన్ మాన్ కి స్నేహితుడిలా, గుండాలకి సింహంలా కనిపించే క్యారెక్టర్ ని ఈ సినిమాలా తన రూపంలో చూపించాడు. గన్స్,గట్స్ లవ్ అండ్ కాప్షన్ కి సరిగ్గా సరిపోయింది తను రాసుకున్న గబ్బర్ సింగ్ క్యారెక్టర్.  ఏ సీన్ చూసినా గన్స్, హార్సెస్. వెరైటి అఫ్ గన్స్ తో తను చేసే మాజిక్స్, హీరోయిన్ ని రిచ్ గా చూపించడం, ఓ యువరాణిని ప్రేమించడం.కింగ్ మేకర్ లాంటి విలన్ ని జోకర్ ని చేయడం ఇలా. 

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. స్టైల్ అఫ్ ఆక్టింగ్ కి బ్రాండ్ అడ్రస్. భుజం మీద ఎర్రతుమాలు, గుండీలు విప్పిన ఖాకీ షర్టు,పోలీస్ బెల్ట్ కి అటు పక్క ఇటు పక్క గన్స్, డేరింగ్ లూక్స్ తో సర్దార్ గబ్బర్ సింగ్ గా పవర్ స్టార్ నటన అద్భుతః.


కాజల్ అందంగా వుంది, బాగా నటించింది.


దళపతి గా ముఖేష్ రుషి నటన చాలా బావుంది.


విలన్ గా శరత్ కేల్కర్ హుందాతనంతో కూడిన విలనిజాన్ని ప్రదర్శించాడు.


బ్రహ్మానందం, ఊర్వసి ,ఆలి, కృష్ణ భగవాన్,పోసాని, కబీర్ సింగ్, తనికెళ్ళ భరణి ల నటన కథకి తగ్గట్టు ముందుకు సాగింది.


బెస్ట్ డైలాగ్స్:


ఆయనకి ఓన్ అవ్వాలంటే ఫస్ట్ ట్యూన్ అవ్వాలి లేదా ఫ్యాన్ అవ్వాలి


సగం గడ్డం గీసుకుని చిరాకులో వున్నా...పూర్తి గడ్డం గీసుకునే లోపల దొబ్బేండి. 

రూల్ మారాలి రూలింగ్ మారాలి టైం మారాలి టైం టేబుల్ మారాలి

ఒక్కణ్ణే వస్తా, ఎక్కడికయినా వస్తా,ఇలాగా ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా

పొగరెక్కిన నీలాంటి వాడు పుట్టిన ప్రతీసారి నాలాంటి వాడు పుడుతోనే ఉంటాడు

నువ్వు అండగా ఉంటే ఎండా వాన కంట్రోల్ ఉంటాయి

రాజసం బ్లడ్ షేరింగ్లో కాదు ఫైరింగ్ లో ఉంటుంది.


పైనున్న వ్యవసాయం కనపడుతుంటే నాకు కిందున్న వ్యాపారం కనపడుతూంది.

తెల్లారి లేస్తే లైఫ్ లో రౌడీలు, కేడీలు తప్ప లైఫ్ లో లేడీస్ లేరు 

ఎర్రకోట మీద ఎగిరే జండా లాంటి వాడు ఎవ్వరి మాట వినడు.

ఓయ్ పేరు గుర్తుందా!! గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. 

ప్లస్ పాయింట్స్:

పవర్ స్టార్స్ స్టైల్ అఫ్ ఆక్టింగ్.


టౌన్ సెంటర్ లో మట్కాసింగ్ గ్యాంగ్ తో చేసే డాన్స్ కామెడీ.


ఇంటర్వల్ కి ముందు మైనింగ్ లారీలను ఆపి, విలన్ తో తలపడే సీన్.


తోబా తోబా సాంగ్.


మైనస్ పాయింట్స్ :

ఇంటర్వల్ తరువాత బ్రహ్మానందం తో చేసే క్విక్ గన్ గేమ్.


బాబీ డైరెక్షన్.


క్లైమాక్స్ లో సాగే డాన్స్ కామెడీ అండ్ ఫైట్.Genre : love & Action
Target :All power star fans  

Story line: రతన్పూర్ సంస్థానంలోని అరాచకాలను అణిచి, యువరాణి మనసు గెలుచుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సర్దార్ గబ్బర్ సింగ్. 
 
Banner :  Northstar Entertainment, Eros International
Presents: Pawan Kalyan Creative Works,
Producer  : Sharat Marar and Pawan Kalya.
Director    :Bobby


పవన్ కళ్యాణ్, కాజల్, ముఖేష్ ఋషి, ఊర్వసి, ఆలి,శరద్ కేల్కర్,కభీర్ సింగ్,బ్రహ్మానందం, శకలక శంకర్ లు  నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ విశేషాలు. 

Release Date : 8th April 2016.