అక్షర తోరణం ప్రత్యేక సంచిక

NO LOGICS, ONLY POWER PACKED ACTION ENTERTAINER. SARAINODU. 


కథలోకి వెళితే :

ఓపెనింగ్ సీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వైరం ధనుష్( ఆది పినిశెట్టి) ఆయిల్ పైప్ లైన్స్ వేయడంకోసం పర్ణశాల ఊరిని బలవంతంగా ఖాళీ చేసి, ఊరి పెద్దని చంపేస్తాడు. తన అనుచరుడు ఓబుల్ రెడ్డి(ప్రదీప్ రావత్ )ని కాపలా పెడతాడు. 

ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మన సరైనోడు గణ( అల్లు అర్జున్) ఎంట్రన్స్ జరుగుతుంది. పాతబస్తీ పహిల్వాన్ తో ఓ దుమ్మురేపే ఫైట్ చేసి కబ్జా అయిన ల్యాండ్ ని తిరిగి ఓ మహిళకు అప్పగిస్తాడు. ఫస్ట్ ఫైట్ లోనే గణ క్యారెక్టర్ చెపుతాడు దర్శకుడు. మిలటరీ జాబు మానేసి లాయర్ అయిన బావ శ్రీపతి( శ్రీకాంత్)తో కలసి కోర్ట్లులో జరగని న్యాయం కోర్టు బయట జరిగేలా చేస్తాడు. కండలు తిరిగిన బాడీ, టైట్ షర్టు, ఎవ్వరిని లెక్కచేయని వాడిగా, ఒంటి మీద దెబ్బపడితే ఎంతటోడైనా భయపడతాడనే నైజంతో గణ ఓపెనింగ్ సీన్ అదరహో అన్నట్టుంటుంది మాస్ ఆడియన్స్ కి. 

ఐ ఎ స్ కి రిజైన్ చేసి కబ్జా అవుతున్న పర్ణశాల భూములకు, రైతులకు అందంగా నిలబడతాడు జయప్రకాష్( సాయికుమార్). జయప్రకాష్ స్నేహితుడు, గణ తండ్రి అయిన ఉమాపతి(జయప్రకాష్) తనూ ఒక ఐ ఎ స్ అయివుండి సి ఎం కొడుకు అన్యాయాలను ఆపలేకపోతారు.ఆక్షన్  సన్నివేశాలతో వేడిగా సాగుతున్నా కథ మన గణ ప్రేమలో పడడంతో రూటు మారుతుంది. లోకల్ ఎం ల్ ఎ దివ్య( కేథరిన్) ని చూడగానే ప్రేమలో పడతాడు, వెంటపడతాడు. ఇదే సయంయం లో జెపి  కూతురు మహాలక్ష్మి ( రకుల్ ప్రీత్ సింగ్) ఇంటికి  పెళ్లి చూపులకు వెళ్ళి సంబంధం వద్దనుకుంటాడు. కథలో కీలక సన్నివేశం ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు మానస అనే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. ఎం ల్ ఎ దివ్య అండగా నిలబడినా ప్రయోజనం వుండదు. ధనుష్ సాయంతో కేసుని తప్పు దారి పట్టిస్తాడు లాయర్ రాజీవ్ కనకాల. ఇక్కడే సరైనాడు టైటిల్ కి సరిగ్గా న్యాయం చేస్తాడు మన గణ. రాత్రికి రాత్రే  వ్యాపారవేత్త  కొడుకు, లాయర్ కాళ్ళు నరికేస్తాడు. ఇప్పుడు కథ కీలక మలుపు తిరిగి వైరం ధనుష్, గణ ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుంది. మధ్య మధ్యలో ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా భూగర్భ శాస్త్రవేత్త గా బ్రహ్మానందం, ఉమాపతి తమిళ కోడలుగా ఆదర్శ  బాలకృష్ణన్ చేసే సాంబార్ కామెడీ  ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. గణ ప్రేమలో పడ్డ ఎం ల్ ఎ దివ్య,  పెద్దమ్మ తల్లి సమక్షంలో ఈ గొడవలు మానమని ప్రమాణం చేయించుకునే సమయంలో మహాలక్ష్మి కాపాడమంటూ గుడికి వస్తుంది తనని తరుముతున్న ధనుష్ గ్యాంగ్ కి చిక్కకుండా. దివ్యతో ఒట్టు గట్టుమీద పెట్టి, నరాలు తెగే ఆక్షన్ సన్నివేశంతో గ్యాంగ్ ని చితక్కొట్టి, నెక్స్ట్ ఏం జరగబోతోందా అనే టెన్షన్ ని ఆడియన్స్ లో రేకెత్తించి ఇంటర్వల్ వరకు తీసుకొస్తాడు కథని.

కథ మళ్ళీ కాసేపు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మహలక్ష్మి జరిగిందంతా చెపుతుంది. భూమికోసం ధనుష్ పర్ణశాలలో భీబత్సం సృష్టించి, ప్రజలకు అండగా వున్న తన తండ్రి జయప్రకాష్ ని చంపి, తనని కూడా చంపే ప్రయత్నం చేస్తే తప్పించుకుని నీ దగ్గరకు వచ్చానని చెపుతుంది. దివ్య తన ప్రేమని  త్యాగం చేసి, మహాలక్ష్మి- గణ లని కలిపి వెళ్ళిపోతుంది. కథ ప్రీ క్లైమాక్స్ కి చేరి గణ మీద పగతో మళ్ళీ మహలక్ష్మి ని కిడ్నాప్ చేస్తాడు ధనుష్. ఇక్కడ జరిగే ఫైట్ సీన్ చాలా ఫన్నీగా సాగి మీడియా ముందే ధనుష్ పరువు తీస్తాడు గణ. ఓబుల్ రెడ్డిని బెదిరించి నిజం చెప్పిస్తాడు. ఆశక్తిగా సాగీ ఈ సన్నీవేశాలతో కథ క్లైమాక్స్ కి వచ్చి వేరే దారిలేక సి ఎం, సి ఎం కొడుకులు కలిసి బావ శ్రీపతి, తండ్రి ఉమాపతిలను కిడ్నాప్ చేస్తారు గణ కోసం. ప్రేక్షకులు ఊహించే క్లైమాక్స్ అయినా కాస్త ఆశక్తిగా సాగడంతో చూసే ప్రేక్షకుడికి ఎక్కడా విసుకు రాదు. సరైనోడు తన సత్తా చాటి, డిజిపి సుమన్ సాయంతో కథకి ఫన్నీ అండ్ హ్యాపీ ముగింపు ఇస్తాడు. 


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

మొదట మాట్లాడుకోవలసింది సినిమాటోగ్రఫి ఋషి గురించి. హీరో బిల్డప్ సీన్స్ , బాడీ లాంగ్వేజ్ ని రఫ్ గా చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు ఋషి. అవుట్ అండ్ అవుట్ ఈ కంప్లీట్ ఆక్షన్ మూవీ కి ఫైట్స్ ప్లస్ పాయింట్.  ఫైట్స్ మాస్టర్స్ తో కలిసి ఋషి చాలా రిచ్ గా చూపించాడు ప్రతీ ఆక్షన్ సన్నివేశాన్ని.   

సంగీత దర్శకుడు తమన్ గురించి. తెలుసా తెలుసా అనే మెలోడీ సాంగ్, బ్లాక్ బస్టర్ అని మాస్ సాంగ్స్ తో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు.

పక్కా మాస్ డైలాగ్స్ అందించిన మాటల రచయిత రత్నం కి ప్లస్ మార్క్స్ తప్పకుండా పడాలి.  ఎర్రగా వున్నాడు, ఏం తెలీదనుకున్నారేమో! మాస్ ఊర మాస్ లాంటి డైలాగ్స్ ప్రేక్షకులతో తప్పట్లు కొట్టించాయి.

ఇక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ భాద్యతలు భుజాన వేసుకున్న మన దర్శకుడి గురించి. తను ఎంచుకున్న కథలో లాజిక్స్ పక్కన పెడితే ఆద్యంతం కథ ఆశక్తిగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. చట్టం న్యాయం చేయలేని పని భయమంటూ తెలీని ఒక వ్యక్తి చేస్తే, ప్రేక్షకుడికి ఎంత థ్రిల్ గా వుంటుందో చూపించాడు తనదైన దర్శకత్వంతో ఈ ఆక్షన్ చిత్రాల దర్శకుడు. తన కథలో హీరో కండలు తిరిగి, రఫ్ లుక్కుండాలి. అదే సమయంలో కామెడీ అండ్ డాన్స్ చేయగలగాలి. ఈ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ ని ఎంచుకోవడం మరొక తెలివైనపని.  సి ఎం కొడుకుని ఎదుర్కోవాలంటే హీరో సామాన్యుడు అయితే వర్క్ అవుట్ కాదు. అందుకే ఒక ఐ ఎ స్ ఆఫీసర్ కొడుకుని కథానాయకుడిగా ఎంచుకున్నారు. క్లాసు ఆడియన్స్ కూడా ఒప్పించే దిశలో దర్శకుడి ప్రయత్నం ఫలించింది. 

ఓబుల్ రెడ్డి ఇంట్లో జరిగే హీరో పెళ్లి చూపులు, ఇంటర్వల్ బ్యాంగ్, విలన్ గెస్ట్ హౌస్ లో హీరోయిన్ కాపాడే సన్నివేశాలు బోయపాటి దర్సకత్వ ప్రతిభకు నిదర్శనం.



ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందరూ అనుకున్నట్టుగానే సరైనోడు టైటిల్ కి తగ్గట్టు పక్కా ఊరమాస్ లా నటించాడు. కండలు తిరిగిన శరీరం, టైట్ షర్టు, మడత పెట్టిన కాలర్, రఫ్ లూక్స్. ఓవరాల్ గా ఒక ఆక్షన్ మూవికి హీరో ఎలా ఉండాలో, మాస్ ఆడియన్స్ ఎలా ఆశిస్తారో అలావున్నాడు. ఆక్షన్ సీన్స్ లో తన కండలు తిరిగిన శరీరాన్ని విదుపుకుంటూ పిడికిలి బిగించి ఇచ్చే పంచులుకి సగటు ప్రేక్షకుడి నుంచి ఈలలు రాకతప్పదు. ఇక డాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ సాంగ్ లో స్టెప్స్ కి  ఈలలే ఈలలు. చాలా రోజుల తరువాత కంప్లీట్ ఆక్షన్ మూవీ వండర్ అల్లు అర్జున్ నుంచి.

ఇక కథానాయికలు కేథరిన్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటన చాలా బావుంది. 

ఆది పినిశెట్టి,బాహుబలి ప్రభాకర్, ప్రదీప్ రావత్ ల విలనిజం బావుంది.

అన్నపూర్ణ, ఆదర్శ బాలకృష్ణన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి ల కామెడీ బాగా పండింది.

సాయికుమార్, జయప్రకాష్, సుమన్ ల పాత్ర కథకి బలాన్ని చేకూర్చింది.

ఐటమ్స్ సాంగ్ లో  అంజలి తళుకులు బావున్నాయి 


బెస్ట్ డైలాగ్స్:

ఎర్రగా వున్నాడు, ఏం తెలీదనుకున్నారేమో! మాస్, ఊరమాస్.( అల్లు అర్జున్)


చావుని వాడుకోవడం నీకలవాటు, చావుతో  ఆడుకోవడం నాకలవాటు.


తాగితే ఉల్లాసం కోసం త్రాగాలి, ఉద్యమాలు చేసేలా త్రాగాకూడదు.(బ్రాహ్మి) 


పెళ్ళాం పూజగదిలాంటిది, గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది. 


ప్లస్ పాయింట్స్:

అల్లు అర్జున్ అల్ ఫైట్ సీన్స్.


ఓపెనింగ్ ఫైట్ లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ చూపించిన వైనం

ఓబులరెడ్డి ఇంట్లో పెళ్లి చూపులు 

గుడిలో జరిగే ఇంటర్వల్ బ్యాంగ్  ఫైట్ 

విలన్ గెస్ట్ హౌస్ లో విలన్ గ్యాంగ్ తో సాగే ఆక్షన్ అండ్ కామెడీ ఫైట్

 బ్రహ్మానందం, ఆదర్శ బాలకృష్ణన్ సాంబార్ కామెడీ, జయప్రకాష్ రెడ్డి ఊళ్ళో కామెడీ.

బ్లాక్ బస్టర్ సాంగ్.


మైనస్ పాయింట్స్ :

లాజిక్స్ వెతకకపోతే పక్కా మాస్ ఎంటర్టైనర్. సమ్మర్ ఆడియన్స్ కి వేసవి చిరుజల్లు.




 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

Sarainodu

Telugu Movie Review & Rating

Genre : love & Action
Target :Allu Arjun fans & Action movie lovers   

Story line: చట్టానికి,న్యాయానికి భయపడనివాడు భయానికి, చేతిదెబ్బకి భయపడతాడు. ఓ సరైనోడికి తలవంచుతాడు. ఇదే సరైనోడు కాన్సెప్ట్.
 
Banner     : Geetha Arts
Presents  : Padmasri Allu ramalimgayya.
Producer : Allu Aravind
Director   : Boyapati srinu


అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్,శ్రీకాంత్,ఆది పినిశెట్టి, రాజీవ్ కనకాల, సాయికుమార్, సుమన్, బ్రహ్మానందం,ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి, ఆదర్శ బాలకృష్ణన్, అన్నపూర్ణ లు ముక్య తారాగణంగా నటించిన సరైనోడు విశేషాలు. 


Release Date : 22nd April 2016. 

తెలుగు వేదిక రేటింగ్