అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Rojulu Maaraayi

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్


డబల్ మీనింగ్ డైలాగ్స్ తో మోత మోగించిన రోజులు మారాయి


కథలోకి వెళితే : 
మారుతీ మార్క్ అంటేనే డబల్ మీనింగ్ డైలాగ్స్, కాస్త స్త్రీ వ్యతిరేకత, దెయ్యం కామెడీ లేకుండా సినిమా వుండదేమో. ప్రమోషన్ పిక్చర్స్ దగ్గరనుంచి కథ పై అంచనాలు ఇలానే వున్నాయి సినీ ప్రేమికులకి.ఈ మూవీలో కతానాయికలిద్దరిని స్వార్థానికి ఉపయోగించుకుని వదిలించుకునే ఈ తరం అమ్మాయిల్లా చూపెట్టడంలో కాస్త ధైర్యం చేసాడనే చెప్పాలి. 

ఓపెనింగ్ సీన్ తోనే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడియన్స్ కి.  అశ్విత్(చేతన్) తను ప్రేమించిన ఆద్యకు(కృతిక) ప్రేమతో ఐ లవ్ యు చెప్పి ఇచ్చిన డైమండ్ రింగ్ ని అమ్మి  తను ప్రేమించిన విక్కీ అవసరాలకి ఇస్తుంది. రెండో ప్రేమ జంట పీటర్(పార్వతీశం) తన జాబుని ప్రేమించిన పాపానికి రంభ(తేజస్వి)కిచ్చి తన ప్రేమలో నిజాయితీ చాటుకుంటాడు. మరోవైపు రంభ తన ఆఫీసులో పని చేసే బాసుని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది.
కట్ చేస్తే రంభ, ఆద్యాలు అశ్విత్, పీటర్లను తమ అవసరాలకి మాత్రమె ఉపయోగించుకుని ప్రేమ నాటకం ఆడతుంటారు.

ఒకానొక టైంలో నన్ను పెళ్ళిచేసుకోమనే పీటర్ టార్చర్ తట్టుకోలేక రంభ తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి అందరిని వెంటేసుకుని శ్రీశైలం బాబా దగ్గరకి వెళతారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నవారు 3 రోజులలోనే చనిపోతారని చెపుతాడు. ఈ సంఘటనతో కథలు అతిపెద్ద మలుపు తిరుగుతుంది. తాము ప్రేమించిన వ్యక్తుల క్షేమంగా ఉండటం కోసం తమని ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని శోభనాన్ని మూడురోజులు వాయిదా వేస్తారు రంభ, ఆద్యలు. మూడురోజులు పూర్తయినా అశ్విత్, పీటర్ లు క్షేమంగా ఉంటారు. పీటర్ శోభనానికి తొందర పెట్టడంతో రంభ మరో ప్లాన్ వేస్తుంది, ఫామ్ హౌస్లో పనివాడితో కలిపి విషం కలిపి చంపించేద్దామని.
 మొత్తానికి విభూది (వాసు) సాయంతో ఇద్దరినీ చంపేసి ఫామ్ హౌస్లోనే పాతిపెడతారు.  ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీకి తెరవేస్తూ మనమోహాలమీద ఓ ఇంటర్వల్.

పనోడు విభూదితో కలిసి దృశ్యం సినిమా సీన్ మాదిరి సెల్ఫోన్లు మార్చి, అశ్విత్ కార్ ని చెరువులోకి తోసేసి తిరిగి క్రొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి హాస్టల్ కి వెళ్ళిపోతారు.సెకండ్ హాఫ్ లో క్రైమ్ చేసిన పాపానికి హారర్ ఎపిసోడ్ మొదలవుతుంది. అశ్విత్, పీటర్లు దెయ్యలై ఆద్య రంభలకి కనపడి  భయపెడుతూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంటారు. ఈ టార్చర్ తట్టుకోలేక  స్మశానాల్లో దెయ్యాలమీద రీసెర్చ్ చేసే బంచిక్ బాబా(ఆలి)ని హాస్టల్ కి తీసుకొస్తారు మగ దెయ్యాల్ని పట్టించటానికి. బాబాని కూడా ఓ ఆట ఆడుకుంటారు.  వెళుతూ వెళుతూ బాబా ఓ ట్విస్ట్ ఇస్తాడు. విసిరేసిన తాళిబొట్లు తిరిగి మేడలో వేసుకుంటే గాని దెయ్యాలు వదలవని. ఈ సస్పెన్స్ మధ్యలో  కథ ప్రీ క్లైమాక్స్ కి వస్తుంది. పెళ్ళి చేసుకోబోతున్న ఆద్య, రంభలకి తాము ప్రేమించిన వాళ్ళు మోసగాళ్ళని తెలుస్తుంది.  మరో వైపు పీటర్, అశ్విత్ ల మర్డర్ కేసుని ఫైల్ చేసి రంభ, ఆద్యలని ఇంటరాగేట్ చేస్తాడు ఎస్ఐ రాజారవీంద్ర. ఎంతయినా అమ్మాయిలు కదా, చేసిన తప్పుకి భయపడి. పాపానికి విరుగుడుగా అదే ఫామ్ హౌస్ కి వెళ్ళి చనిపోదామానుకుని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతారు. తెల్లారేసరికి మొత్తం అన్ని ట్విస్ట్లు వీడిపోయి అశ్విత్, పీటర్లు ఆడిన ప్రేమనాటకాన్ని చెప్పడంతో, మూసుకుపోయిన కళ్ళు తెరచుకుని కథ సుఖాంతమవుతుంది.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

ఫస్ట్ హాఫ్ రవివర్మ మాటలు పేలాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో థియేటర్ దద్దరిల్లింది.

సంగీత దర్శకుడు జెబి ఫరవాలేదనిపించాడు.

ఇక కథ, స్క్రీన్ ప్లే అందిచిన మారుతీ, ఈ తరం అమ్మాయిల మనోభావాలని తెరకెక్కిస్తూ, తన మార్క్ దెయ్యం కామెడీని వదలకుండా యూత్ కి కిక్కెక్కించే స్క్రీన్ప్లే ని వ్రాసాడనడంలో సందేహమే లేదు.

ఇక దర్శకుడు మురళీ. పార్వతీశం టైమింగ్ కామెడీని ఉపయోగించుకుని ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీసుకెళ్ళి, సెకండ్ హాఫ్ హారర్ కామెడీ తో కామన్ ఆడియన్స్ ని నవ్వించే ప్రయత్నం చేసాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

సినిమా మొత్తం పార్వతీశం వన్ మాన్ షో. తను పేల్చే ప్రతీ డైలాగ్ కి క్లాప్స్ బడ్డాయి. పార్వతీశం ఎక్కడాని ఆడియన్స్ వెతుక్కున్నారు చాలా సీన్స్లో .

నూతన పరిచయం చేతన్ రాముడు మంచి బాలుడిలా బాగా నటించారు.

తేజస్వి, కృతికలు ఈ తరం అమ్మాయిల మనోభావాల్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.

పోసాని, ఆలీలు ఉన్నంత సేపూ నవ్వులే నవ్వులు. వాసు, రాజరవీంద్రల  క్యారెక్టర్ బావుంది.

డబల్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లో పార్వతీశం. 

సెకండ్ హాఫ్ లో అలీ కామెడీ.


మైనస్ పాయింట్స్ :

నెగటివ్ పాయింట్స్ అని చెప్పడం కంటే ఈ తరం అమ్మాయిలు అబ్బాయిలతో సమానం. సో వారి ఆలోచనలు కూడా అబ్బాయిల్ని దాటిపోయాయి. ప్రేమ ఒక అవసరం.మనసుతో సంబంధం లేదన్న వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించాడు మారుతి తన స్క్రీన్ప్లే ద్వారా. చూసే ఆడియన్స్ కి ఈ పింట్ కాస్త నచ్చకపోవచ్చు. నిజం నిప్పులాంటిది మరి. Genre : Comedy crime thriller 
Target: All comedy lovers

Story line: ఈతరం ఇద్దరమ్మాయిలపై  రెండు  అమాయకపు మగ దెయ్యాల ప్రేమ నాటకమే ఈ రోజులు మారాయి.

Rating :2/4 (ఫరవాలేదు).

Banner         :  వెంకటేశ్వర క్రియేషన్స్ & మారుతి టాకీస్ & గుడ్ సినిమా గ్రూప్
Producer   : జి. శ్రీనివాసరావు
Story &screen play : మారుతి
Direction : మురళీ కృష్ణ 


చేతన్, కృతిక, పార్వతీశం, తేజస్వి, పోసాని,ఆలి, వాసు ఇంటూరి, రాజా రవీంద్రలు ముఖ్య తారాగణంగా నటించిన రోజులు మారాయి చిత్ర విశేషాలు మీకోసం. 


Release Date : 1st, July 2016.