అక్షర తోరణం ప్రత్యేక సంచిక

RANGULA RATNAM

Telugu Movie Review & Rating


​కథలోకి వెళితే :

రంగుల రాట్నం ఈ టైటిల్ వినగానే ఏ పెద్ద హీరో మూవీనో అనుకుని సగటు ప్రేక్షకుడికి యంగ్ హీరో రాజ్ తరుణ్ అని తెలిస్తే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది.మొదటి నుంచి ఈ టాలెంటెడ్ యంగ్ హీరో చిత్రాల టైటిల్స్ విభిన్నమే. అయితే క్లాసిక్ టైటిల్స్ లేదా పక్కా యూత్ టార్గెట్ చేసే టైటిల్స్... చూద్దాం ఈ రంగుల రాట్నంతో ఎంతమందిని తన చుట్టూ తిప్పుకుంటాడో.


టైటిల్స్ లో హీరోని చూడగానే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని అర్థమవుతుంది. చూస్తుండగానే 6 నెలలు వెనక్కి.  అందరి తల్లుల్లానే వయసొచ్చిన కొడుక్కి వరసైన పిల్లని వెతికే పనిలో పడుతుంది విష్ణు(రాజ్ తరుణ్) కోసం సితార.ఇక ఆఫీస్ కి వెళ్లే దారిలో హెల్మెట్ పెట్టుకుని, రూల్స్ ఫాలో అయ్యే అమ్మాయితో గొడవపడుతూ ఉంటాడు.  ఆఫీస్ కొలీగ్ ప్రియదర్శన్ తో సరదాగా ఓ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్లి ఫస్ట్ లుక్ లొనే ప్రేమాలో పడతాడు మన విష్ణు.  కట్ చేస్తే ఇద్దరూ ఒక్కటే. కీర్తి ( చిత్ర) పద్ధతులు పడికట్లు ఉన్న అమ్మాయి, రూల్స్ తనని ఫాలో అయ్యేంత రూల్స్ ఉన్న అమ్మాయి. ఈవెంట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. మన కీర్తిని ఇంప్రెస్స్ చేయడానికి నానా తంటాలు పడుతూవుంటాడు. కీర్తికోసం తమ్ముణ్ణి కూడా కాకా పడతాడు. అమ్మకి కూడా పరిచయం చేస్తాడు. విష్ణుకోసం తన తల్లే చొరవ తీసుకుని కీర్తితో కొడుకు ప్రేమ విషయం చెపుతుంది. ఈ తల్లి కొడుకుల సెంటిమెంట్ చూస్తుంటే మన మధ్య తరగతి కుటుంబాల అనుబంధాలే కనపడతాయి. కథసరదాగా సాగిపోతుంది అనుకునే లోపు దర్శకుడికి ఏమైందో తల్లిని శాశ్వతంగా దూరం చేస్తాడు. విష్ణు రంగుల ప్రపంచం చీకటై  ఒంటరితనం స్నేహం చేస్తుంది. ఓదార్పుకోసం వచ్చిన కీర్తిని తనతో ఉండిపొమ్మని ఇండైరెక్టుగా తన ప్రేమ విషయం చెపుతాడు విష్ణు. కీర్తికి ఏదో గతం వుంది, విష్ణు ప్రేమని ఒప్పుకోవటం లేదని అనుమానం ప్రేక్షకుడికి కలిగేలోపు ఓ ఇంటర్వల్.

 తల్లి చనిపోయిన బాధలో ఒంటరై కీర్తికి దగ్గరవుదామనుకుంటే తాను కూడా దగ్గరవుతున్నట్టే కనపడి దూరంగా ఉంచుతుంది. ఈ ట్రైయాంగులర్ ట్రాజెడీలో ఇంకో ట్విస్ట్ ఏదో ఉందని సగటు ప్రేక్షకుడికి అర్థమవుతున్న టైం లో ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో గతం. ఎంతో ఇష్టపడ్డ తన తండ్రి ఆక్సిడెంట్ లో చనిపోతాడు. ఇదే విష్ణు విషయంలో జరుగుతుందనే ఎన్నో సినిమాల్లో మనం చూసేసిన అనుమానాన్ని హీరోయిన్ డౌట్ గా చూపించడం. మన విష్ణు కన్విన్స్ చేయడంతో మళ్లీ ప్రేమకథ పట్టాల మీదకి ఎక్కుతుంది. విష్ణు చేసే ప్రతి పనికి కీర్తి రిమోట్ లా తయారవుతుంది. కొద్దీ రోజుల్లోనే లైఫ్ లో ఉన్న అన్ని రంగుల ఎమోషన్స్ ని చూసేసి విసిగిపోతాడు. కేరింగ్ పేరుతో అడుగు తీసి అడుగువేయడానికి కూడా కీర్తి పర్మిషన్ తీసుకునే పరిస్థితి రావడంతో  ప్రేమ గీమా వద్దా అని గుడ్ బై చెప్పి   వెళ్లిపోతాడు.  రంగులరాట్నం అనే టైటిల్ ఈ కథకి ఎందుకు పెట్టాడా అనే సందేశం క్లియర్ అవుతుంది మూవీ ప్రీ క్లైమాక్స్ వచ్చే టప్పటికి. ఇంకేదైనా ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంటుందేమో రెగ్యులర్ మూవీస్ కి భిన్నంగా అనుకున్న ఆడియన్స్ కి నిరాశే ఎదురై మళ్లీ నువ్వే కావాలంటూ మన విష్ణు కీర్తి చేయిపట్టుకుంటాడు. కథ సుఖాంతం.టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సంగీత దర్శకుడు శ్రీ చరణ్  సంగీతం చాలా సైలెంట్ గా కథలో ఉన్న ఎమోషన్స్ మధ్య కొట్టుకుపోయింది.
సినిమాటోగ్రఫీ ఒక్కటే రంగుల రాట్నం మూవీని కాస్త రంగులుగా చూపించింది క్లైమాక్స్ వరకూ.


ఇక మన దర్శకురాలు శ్రీ రంజని. తల్లి, భార్య ప్రేమ రెండూ ఒక్కటే. మగాడు అర్థం చేసుకోవడంలొనే ఉందన్న అనాదిగా తెలిసిన విషయాన్ని కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశారు. తల్లి చెపితే ప్రేమతో ఒప్పుకుని, అదే ప్రియురాలు చెపితే ఇగోతో పక్కకు పెట్టడం అనే కాన్సెప్ట్ తీసుకుని, చివరకు ఎంత కేరింగ్ అయినా అది ప్రేమలోకే వస్తుందని రాజ్ తరుణ్, చిత్రలతో చెప్పే ప్రయత్నం చేసి ప్రేక్షకుల సహనాన్ని భోగిపూట పరీక్షించారు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


మన హీరో రాజ్ తరుణ్ ఎటువంటి కారెక్టర్ అయినా తన కారెక్టరైజేషన్ తో మెప్పించగలడు. కథలో ఏమన్నా ఇబ్బందులుండాలి తప్ప రాజ్ తరుణ్ నటనలో ఉండదు.
ఇక హీరోయిన్ చిత్ర. రొమాంటిక్ లుక్స్ ఉన్నప్పటికి బుద్దిమంతురాలి పాత్రలో ఒదిగిపోయింది.
అమ్మగా సితార చాలా బాగా నటించారు.
కమెడియన్ పాత్ర ఎందుకో ప్రియదర్శన్  నటనని చూసి తెలుసుకోవచ్చు. సన్నివేశంలో సత్తా లేకపోయినా తన నటనతో ఉత్సాహపరుస్తూనే వున్నాడు.
Genre : Romantic family entertainer 


Target : All family audience 


Story line: మగువ ప్రేమని సెంటర్ చేసుకుని మగాడి ఎమోషన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇదే ఈ రంగులరాట్నం.


Rating : 2/4 (ఫరవాలేదు)


Banner      : Annapurna studios


Producer  :  Akkineni Nagarjun


Story &Direction   :  Sri Ranjani


రాజ్ తరుణ్, చిత్ర శుక్ల, సితార, ప్రియదర్శిని వంటి సహజ నటీనటులు నటించిన రంగులరాట్నం  చిత్ర సంగతులు మీకోసం...


 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్