అక్షర తోరణం ప్రత్యేక సంచిక


A TRAGEDY LOVE STORY WITH SLOW NARRATION.

కథలోకి వెళితే : 

కొణిదెల కుటుంబంనుంచి వచ్చిన మొట్ట మొదటి కథానాయిక కావడంతో ఒక మనసు చిత్రం మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను చిత్రం చేరుకుందో లేదో చూద్దాం.


ఓపెనింగ్ సీన్ ప్రగతి తన కూతురు సంధ్య (నిహారిక) కోసం పెళ్ళి చూపులు చూస్తూ వుంటుంది, మరో ప్రక్క విజయనగరం లోకల్ పొలిటీషియన్ రావురమేష్ కొడుకు సూర్య(నాగ శౌర్య) జైలులోంచి బైలు మీద బయటకి వస్తాడు. వచ్చి రాగానే సంధ్యని కలుస్తాడు.

వీళ్ళ ప్రేమకథ సినిమా చూసే ప్రేక్షకులకి తెలీడానికి కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. మెడిసిన్ పూర్తి చేసి విజుయనగరంలో  హోం సర్జెన్ గా ప్రాక్టీసు చేస్తున్న సంధ్య తొలిచూపులోనే సూర్యని ప్రేమిస్తుంది. ప్రేమలో హడావుడి లేకుండానే సూర్య కూడా సంధ్య ప్రేమలో పడతాడు. వచ్చిన చిక్కల్లా సంధ్య మనసుతో ప్రేమిస్తుంది. రాబోయే మునిసిపల్ ఎన్నికలలో కొడుకుని నిలబెట్టటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు తండ్రి. ఒక పక్క చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేస్తూ, ఎలక్షన్స్ లో డబ్బు నిమిత్తం ఓ పెద్ద సెటిల్మెంట్ కి పోయి అట్రాసిటి కేసులో మూడేళ్ళు జైలు లో ఉండాల్సొస్తుంది సూర్య.

కథ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకి వచ్చిన తరువాత సూర్య, సంధ్య లు కలిసి ఉండాలనే ప్రయత్నాలు చేస్తారు. కేసు ఎంతకీ రాజీకి రాదు. సంధ్య వత్తిడి వల్ల సూర్య సంధ్యని ఎవ్వరికి తెలీకుండా పెళ్ళిచేసుకుని కాపురం పెడతాడు. రావురమేష్ బావయిన లోకల్ ఎంల్ఎ నాగినీడు తన కూతురుని పెళ్ళి చేసుకుంటే సమస్యలనీ తీరతాయని హామీ ఇవ్వడంతో, తనకు బైల్ రాలేదని, నీ జీవితం నాశనం అయిపోతుందని సంధ్యని నమ్మించి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాడు సూర్య . సంధ్య ఒప్పుకోదు. చివరికి రావురమేష్ ద్వారా నిజం తెలుసుకున్న సంధ్య భర్త కోసం, భర్తని' కాపాడటం కోసం ఆత్మాహత్య చేసుకుని చనిపోతుంది.    

ఇది టూకీగా మూవీ. కాని ఇద్దరు నిజమైన ప్రేమికుల మధ్య ప్రేమ సంగతులు, మనసు చెప్పుకునే మాటలు, నిరీక్షణ, ప్రమంటే రెండు మనసుల ప్రయాణం కాదు ఒకే మనసని నమ్మే సంధ్య, అందమైన ప్రకృతి, సముద్ర తీరం, ప్రేమలోని భావోద్వేగాలు చూడాలంటే సినిమాలో చూడాల్సిందే. అందమయిన నిహారిక, నాగ శౌర్యల అభినయం ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి. 


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

ఇక టెక్నికల్ టీం గురించి మాట్లాడాలంటే అందరూ బాగా వర్క్ చేసారు ఒక్క ఎడిటర్ తప్ప.  ఈ మూవీ ప్రేక్షకులకి చేరలేదంటే కేవలం ఎడిటర్ దే తప్పు. రెండు ప్రేమ హృదయాల అందమైన భావోద్వేగాలను, ప్రకృతి మధ్యలో బంధించిన దర్శకుడి కళ్ళకి తగ్గట్టు ఎడిటర్ ఎడిట్ చేయలేకపోయాడు. చాలా సినిమా ప్రెజెంట్ లోనా, ఫ్లాష్ బ్యాక్ లోనా అనే సందేహం వచ్చింది చూసే ఆడియన్స్ కి. సినిమా అంతా ఇంచుమించ రెండు మూడు లోకేషన్స్ లో తీయడంతో కన్ఫ్యూజింగ్ కట్స్ పడ్డాయి ఎడిటర్ నుంచి.  ఈ కట్స్ తో కథలో ఇన్వొల్వె అవ్వలేకపోయేరనే అనుమానం ప్రేక్షకులకి.  

మిగతా టీం అంతా బాగా చేసారు
.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

నాగశౌర్య ఎప్పటిలాగే తన అందమయిన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నంలో పడ్డాడు.

ఇక కొణిదెల ప్రిన్సెస్ నిహారిక గురించి. మనం నాగబాబు గారి కూతురు, బుల్లితెరపై నటించింది అని చూడకపోతే ప్రేమించిన మనసుకోసం ప్రేమలో పునీతమై, తన ప్రేమికుడు లేదంటే జీవితమే లేదనేంతగా ఒదిగిపోయింది  సంధ్య పాత్రలో నిహారిక. 

ఇక రావురమేష్ మూవికి హైలెట్. తరువాత అవసరాల శ్రీనివాస్ మరియు ప్రగతి. మిగిలిన వారు తమ పాత్రకు తగ్గ న్యాయం చేసేరనే చెప్పాలి.


ప్లస్ పాయింట్స్:

నాగ శౌర్య, నిహారిక నటన 

అందమైన లొకేషన్స్.


మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ అండ్ ఎడిటర్. ఓ సన్నివేశం ప్రేక్షకుడి మనసులోకి వెళ్ళేలోపులోనే కన్ఫ్యూజింగ్ టేకింగ్ అండ్ ఎడిటింగ్ తో, స్లో నారేషన్తో విసుగుతెప్పించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 


దర్శకుడి ఆలోచనలతో సాగిన ఎడిటింగ్ తో నాగశౌర్య, నిహారికల నటన కూడా అసహనానికి గురిచేసింది కొన్ని చోట్ల.

Genre : Love ( A trazedy love story) 
Target: All lovers

Story line: దూరమైనా దగ్గరైనా మనసైన ప్రేమ శాశ్వతం.

Rating :2/4 (ఫరవాలేదు).

Banner         : మధుర ఎంటర్టైన్ మెంట్స్ 
Producer   : శ్రీధర్ రెడ్డి & TV9. 
Story &Direction :రామరాజు గొట్టెముక్కల

నాగ శౌర్య, నిహారిక కొణిదెల, రావురమేష్, అవసరాల శ్రీనివాస్,నాగినీడు,ప్రణతి,వెన్నెల కిషోర్ నటించిన ఒక మనసు  సంగతులు మీకోసం. 

Release Date : 24th, June 2016.

                        Oka Manasu

Telugu Movie Review & Rating

తెలుగు వేదిక రేటింగ్

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది