అక్షర తోరణం ప్రత్యేక సంచిక

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్


​ నాచురల్ స్టార్ నాని ఇప్పుడు అందరి హీరో. ఒక వర్గానికి సంబంధించిన హీరో కాదు. అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేస్తూ వరుస హిట్లతో  ముందుకు దూసుకుపోతున్నాడు.
అనుకున్నంత కాకపోయినా నాని స్క్రీన్ప్లే ని నమ్ముకుని ఈ సినిమాని ఒప్పుకున్నాడనడంలో సందేహం లేదు.


కథలోకి వెళితే :..... హీరో నాని ఎంట్రీ చిన్న బెట్టింగ్ తో మొదలవుతుంది. మనోడి టాలెంట్ ఏది చూసినా, విన్నా ఇక మర్చిపోడు. ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ మీద సినిమా అంతా తిరుగుతుంది కూడా. నాని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయ్, అన్నతో(రాజీవ్ కనకాల)ప్రేమ, సిటిమెంట్ రెండూ ఎక్కువే. ఇలా సంతోషంగా ఫ్రెండ్స్, అన్నతో వీకెండ్ ఎంజాయ్మెంట్స్ చేస్తున్న శివ జీవితంలో వదిన(భూమిక)వచ్చి అన్నతో తనకున్న ఎమోషనల్ బాండ్ ప్లేస్ ని ఆక్రమిస్తుంది. అన్న వదినకి దగ్గరవుతూ తనని దూరం పెడుతున్నాడన్న కోపంతో బాబాయ్( నరేష్)ఇంటికి మకాం మారుస్తాడు. ఇలా ప్రశాంతంగా ఉన్న నాని జీవితంలో అన్న ఢిల్లీ వెళ్లడం వల్ల వదిన దగ్గర తప్పక వుండాల్సొస్తుంది.వదిన చెప్పిన ఇంట్లో పనులన్నీ తప్పక చేస్తూ, మగ ఇగో హర్ట్ అయ్యి పిన్ని(ఆమని)తో చెప్పుకుని, పిన్నినింటికి దుకాణం సర్దేడానికి బయలుదేరేలోపే మన మిడిల్ క్లాస్ అబ్బాయికి పల్లవి పరిచయం మవుతుంది. వీళ్లిద్దరి మధ్య సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో విలన్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి శివ శక్తి ట్రావెల్స్ ఓనర్ శివ రూపంలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. తన బస్ ఫైర్ ఆక్సిడెంట్ కేస్ లో అడ్డొస్తున్న మిలటరీ ఆఫీసర్ ని చంపేస్తాడు. కథలో ట్విస్ట్ తనని ప్రేమిస్తున్న పల్లవి తన మరదలే అనే విషయం తెలుస్తుంది. సరాసరి వదిన ఇంటికే పల్లవి రావడంతో ఇక ఆనందానికి హద్దులుండవ్ మన నానికి. తన మరిది ప్రేమ విషయం తెలిసి పల్లవిని ఊరికి పంపించేస్తుంది వదిన. ఎంతో కోపంతో తన బాబాయ్ ఇంటికి వెళ్లిపోతున్న నానికి పాత సినిమాల్లో సెంటిమెంట్ ని గుర్తుచేస్తూ వదిన మంచితనాన్ని, త్యాగాన్ని చెపుతాడు బాబాయ్. ఇక్కడ నుంచే కథలో ఒక మలుపు. RTO ఆఫీసర్ అయిన వదిన లైసెన్స్ లేకుండా నడుపుతున్న శివ ట్రావెల్స్ బస్సెస్ ని సీజ్ చేసి కేస్ ఫైల్ చేస్తుంది. RTO ఆఫీస్ ఎదురుకుండానే తన వదినని షూట్ చేయబోతున్న శివని అడ్డుకుని ఇంటర్వల్ లో హీరోయిజం చూపిస్తాడు మన నాని.


​​శివలాంటి వాడితో గొడవెందుకని నానిని డైరెక్ట్ గా విలన్ దగ్గరకు తీసుకెళ్లి సారి చెప్పేస్తుంది వదిన. సైన్మాలో సెంటిమెంట్ కూడా ఎక్కువవుతుంది. శివ తన వదినమీద దాడి చేస్తాడని ముందుగానే గ్రహించిన నాని తన వదినని అన్నివిధాల కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాడు. వదిన నానికో సాఫ్టవెర్ జాబ్ చూస్తుంది. జాబుని ఎగ్గొట్టి వదినని కాపాడే పనిలో పడతాడు. ఫామిలీ సెంటిమెంట్స్ తక్కువవుతున్న సమయంలో వదిన మరిదిల సెంటిమెంట్ ప్రేక్షకులకి కాస్త కొత్తగా అనిపిస్తుంది. నాని నిజమైన మరిదిలానే జీవించాడు. సెంటిమెంట్ ఎక్కువవుతుంది అనుకున్న ఆడియన్స్ కి కాస్త రిలీఫ్ ప్రియదర్శిన్, వెన్నెల కిషోర్ కామెడీ. శివ వేసే ప్రతి ప్లాన్ ని ఫెయిల్ చేస్తాడు నాని. పల్లవి రోల్ అప్పుడప్పుడు నాని కలిసి మన పెళ్లి ఎప్పుడెప్పుడని అనడానికి, నాన్నని ఎదిరించి తననేలానైనా పెళ్లి చేసుకొమ్మని చెప్పడానికే పరిమిత మవుతుంది మిలిటరీ ఆఫీసర్ ని చంపిన వీడియో ఫుటేజ్ నాని పోలీసులకి ఇవ్వడంతో శివ అరెస్ట్ అవుతాడు. కథ సుఖాంతం అయిందని పల్లవితో సరదా పాటొకటి పాడుకుని తన ఆఫీస్ పనిలో పడిన నానికి మరో ట్విస్ట్ ఇస్తాడు శివ వదినని కిడ్నాప్ చేసి. నాని ఎదురుకుండానే శివ షూట్ చేసుకుంటాడు. సీతకోసం లక్ష్మణుడు వెతికినట్టు అన్నిచోట్లా వెతుకుతాడు నాని. ఈ సన్నివేశాలు , నాని వదిన కోసం పడేతపన , మగ సెంటిమెంట్ నాని బాగా పండించడంతో ఆడియన్స్ కళ్ళలో కన్నీళ్లు తప్పవు. ఫైనల్ గా ఒక్కసారి చూస్తే ఏదీ ఏదీ మర్చిపోని నాని, గతంలోకి వెళ్లి, శివ మాటలు గుర్తుచేసుకుని, తన వదినని వెతికిపట్టుకుని కథని సుఖాంతం చేస్తాడు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి తన భాద్యత నిర్వర్తించాడు తప్పించి పనితనం చెప్పుకునేలా లేదు.

సంగీతం అందించిన  దేవిశ్రీ ప్రసాద్  ఎప్పటిలాగా యువతను ఆకట్టుకునే బాణీలను సమకూర్చాడు. ముఖ్యంగా MCA టైటిల్ సాంగ్ మరియు శ్రీమణి వ్రాసిన కొత్తగా అనే పాటలు ఆకట్టుకున్నాయి.

ఇక దర్శకుడు విరించి గురించి చెప్పాలి  తల్లి, తండ్రి, చెల్లి ఇలా సెంటిమెంట్ మీద ఎమోషన్ సిమెంట్ కట్టి చాలా  సినిమాలు వచ్చాయి . దర్శకుడు కొత్తగా వదిన మరిది సెంటిమెంట్ ని కొత్తగా ఆడియన్స్ కి టేస్ట్ చూపించాడు.  దర్శకుడిని మెచ్చుకోవలసిన విషయం MCA అనే పేరు పెట్టి  పక్కా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చూపించడం. నాని, సాయిపల్లవిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలని, క్లైమాక్స్ లో నాని, భూమిక మధ్య సన్నివేశాలని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించాడు. ఒక విధంగా నాని దర్శకుడి చేత ఫ్యామిలీ సెంటిమెంట్ ఇష్టపడే ప్రేక్షకులకోసం దగ్గరుండి చేసినట్టు వుంది.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


సినిమా మొత్తం ముగ్గురే. నాని, సాయిపల్లవి, భూమిక చావ్లా.

నాని నటన ధియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసాడు.  ముఖ్యంగా టైమింగ్ కామెడీ అండ్ పేస్ ఎక్స్ప్రెషన్. సాయిపల్లవితో చేసే ప్రేమ సన్నివేశాలు.

ఇక సాయిపల్లవి గురించి ఇప్పటికే ఫిదా సినిమాతో భానుమతిగా మంచి మార్క్స్ కొట్టేసిన తిను, ఇందులో పల్లవిగా అందంగా నటించింది. నాని వెంట నన్ను ఎప్పుడు పెళ్ళి చెసుకుంటావ్ అని తిరిగే సన్నివేశాలలో నానినే కంగారు పెట్టేలా నటించింది.

వదినగా నటించిన భూమిక చాలా హుందాగా, భాద్యతలు తెలిసిన మహిళగా, మరిదిని సరైన దారిలో పెట్టె వదినగా హుందాగా నటించింది.

ఇక వెన్నల కిషోర్, ప్రియదర్శన్, నరేష్, ఆమని లు తమ పాత్రల పరిధి నటించారు.MCA-Middle Class Abbaayi

Telugu Movie Review & Rating

Genre : Sentiment with Action& comedy
Target : 
All family audience

Story line:  
ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) మగ సెంటిమెంట్ కథే మన NATURAL STAR నాని నటించిన MCA

Rating :
2/4 (ఫరవాలేదు)

Banner      :
Sri Venkateswara creations
Producer  :  
Dil Raju, Laxman
Story &Direction   : 
Venu Sriram


నాని, సాయి పల్లవి, భూమిక, నరేష్, ఆమని, ప్రియదర్శన్, రాజీవ్ కనకాల, సుడిగాలి సుధీర్ లు నటించిన MCA చిత్ర విశేషాలు.

​​
Release Date : 21st Dec, 2017.