అక్షర తోరణం ప్రత్యేక సంచిక

MANASUKI NACHCHINDI

Telugu Movie Review & Rating


మంజుల ఘట్టమనేని. సూపర్ స్టార్ ఫామిలీకి తగ్గ వారసురాలిగా తనని తాను నిరూపించుకున్న చిత్రం Show. నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకున్న ఈ చిత్రం నుంచి మంజుల ఏదైనా కథ ఎంచుకుంది అంటే అందులో విభిన్నత ఉంటుంది. అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా మెగా ఫోన్ పట్టింది దర్శకురాలిగా మనసుకు నచ్చింది సినిమాతో. ప్రేక్షకుల మనసుకి కూడా నచ్చలాని కోరుకుంటూ కథలోకి వెళదాం.


​కథలోకి వెళితే :


 ఒకే కుటుంబాలకు చెందిన నిత్య(త్రిధా చౌదరి), సందీప్ లిద్దరూ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు కోపంతో గోవా పారిపోతారు. ప్రియదర్శి వీళ్ళకి తోడు. గోవాలో ఫ్రెండ్ గెస్ట్ హౌస్ లో వుంటారు. నిత్యా ప్రకృతి ప్రేమికురాలు, సందీప్ ప్రాక్టికల్ గా థింక్ చేసే వ్యక్తి.  సరదాగా యోగా క్లాసెస్ చెపుతున్న నిత్యా దగ్గరకి నిఖిత ( అమైరా) వస్తుంది. అందరూ ఫ్రెండ్స్ అవుతారు.


 నిత్యా అభిరుచికి తగ్గట్టు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మగజీన్ ఎడిటర్ శివ పరిచయ మవుతాడు. సరదాగా ఇలా సాగిపోతుంటే ప్రియదర్శి సందీప్ కి ఓ స్టిల్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్ అప్పగిస్తాడు. ఆది కాస్త చెడగొట్టడంతో నలుగురిలో అవమానిస్తాడు సందీప్ ని ప్రియదర్శి. సినిమా టైటిల్ కి తగ్గట్టుగా మనసుకి నచ్చిన పనిలో పడతాడు సందీప్. అందమైన ప్రకృతిని బంధించడానికి కెమెరా పట్టుకుని బయలుదేరతాడు. సందీప్ కనపడక పోయేసరికి నిత్యా కి నిజమైన  మనసుకి నచ్చిన ఇష్టం సందీపేనని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. చూసే ప్రేక్షకుడికి అర్థం కాదు,ఇక్కడ నుంచి మొదలవుతుంది సున్నిత ప్రేమ కథ. అన్ని సినిమాల మాదిరి సందీప్ కి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటే తిరిగి సందీప్ షాక్ ఇస్తాడు తనకు నిఖితంటే ఇష్టమని. నిత్యా ఎదురుకుండానే ఇద్దరూ ఒకటయ్యి మనసుకు నచ్చేదే చెయ్యమని, అనుభూతి చందమంటూ ఈ ట్రైయాంగులర్ లవ్ స్టొరీ కి ఓ బ్రేక్ ఇస్తారు.

 సెకండ్ హాఫ్ దగ్గర నుంచి పాత సినిమాల ప్రేమ కథే. నిత్యా సందీప్ కోసం సందీప్ -నిఖితల ప్రేమని చెడకొట్టడానికి ప్రయత్నిస్తుంది. సందీప్ మాత్రం నిత్యని స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. మనసుకి నచ్చిన   నేచర్ ఫోటోగ్రఫీకి దగ్గరవుతాడు. ఈ సైలెంట్ ప్రేమ కథ కాస్త రచ్చ రచ్చగా మారుతుంది. నా వాడంటే నా వాడని ఇద్దరూ గొడవపడుతూ చివరకి సందీప్ ముందే పంచాయితీ పెడతారు. సందీప్ నిఖిత వైపే ఓటు వేయడంతో కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుతుంది. ఇక నిత్య మనసుకి నచ్చిన సందీప్ ని వదులుకోవడానికి ఆల్మోస్ట్ రెడి అవుతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం బలవంతంగా పెద్దలందరూ కలిసి మళ్లీ సందీప్ కి ప్రేమని పుట్టించి నిత్యతో కలిపి మనసుకి నచ్చింది సినిమాకి శుభం కార్డ్ వేస్తారు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సినిమాకి ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. గోవాలో జరిగే ఫ్రేమ్ ని చాలా అందంగా చూపెట్టాడు. 
సంగీతం ఫరవాలేదు. 

దర్శకురాలు మంజుల తీసుకున్న కాన్సెప్ట్ పాతదే. మనసుకి నచ్చిందే చేయమని, కాకపోతే కొత్తగా చేయడానికి ప్రయత్నం చేసింది. మనసు ఒకరికి ఇచ్చేసిన తరువాత కూడా మనసుకు నచ్చిన ప్రేమని ఫీల్ అవ్వమనడం కాస్త కొత్తగా ఉంది. ఈ త్రిముఖ ప్రేమ కథని ఓపికతో నడిపిన విధానాన్నీ  అభినందించాలి.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


సందీప్ , త్రిధా, అమైరా లకు పాత్ర పరంగా మంచి మార్కులే వేయచ్చు. 
ప్రియదర్శి, నాజర్ , సంజయ్ ల కథా గమనాన్ని పెంచారు.


 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

Genre : Emotional love
 
Actors: సందీప్ కిషన్, త్రిధా చౌదరి, అమిరా దస్తర్

Story line: మనసుకి నచ్చిందే నిజమైన ప్రేమ

Banner: Anandi art Creations
Producer    : Madan

Music: Radhan

Director    : Manjula swaroop​
Rating : 1/4(బాగాలేదు)

Release Date : 16th Feb, 2018. 

తెలుగు వేదిక రేటింగ్