అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Kalyana Vaibhogame

Telugu Movie Review & Rating 2.0/4.0

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

Genre : Family Entertainer
Target :

Story line:
పెద్దల ఇష్టాలు కాదనలేక పెళ్లి, నేటి తరం వాళ్ళ ఇష్టాలని చంపుకోలేక విడాకులు. మధ్యలో కుటుంబం, పరువు మధ్య నలిగిపోయే సంఘర్షణ.

Rating : 2.0/4.0

Banner      :
శ్రీ రంజీత్ మూవీస్
Producer  :
కే ఎల్ దామోదర ప్రసాద్
Director    :
నందిని రెడ్డి


నాగ శౌర్య మాళవిక నాయర్, ఆనంద్, రాశి, పర్ల్ మీనెయ్, ప్రగతి 
    
Release Date : 4th March, 2016. 


కథలోకి వెళితే :


ఓపెనింగ్ సీన్ మన హీరో బిల్డింగ్ మీదనుంచి సూసైడ్ కి ప్రయత్నిస్తాడు తన పుట్టిన రోజునే. కథ ఫ్లాష్ బ్యాక్ లోకి  వెళుతుంది.

స్నేహితుడు అభయ్ ని పెళ్ళొద్దని సరదాగా టీజ్ చేస్తూ సాగే శౌర్య సాంగ్.
అమ్మమ్మ చనిపోకుండా శౌర్య పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళ పంతంతో అక్క కుదిర్చిన మ్యాచ్ చూడటానికి ఉమామహేశ్వర్రావ్ కూతురు దివ్య(మాళవిక)ని పెళ్లి చూపులు చూడటానికి విజయవాడ వస్తాడు . ఇష్టం లేని పెళ్లి చూపులని ఇద్దరూ తెలివిగా తప్పించుకుంటారు. అయినప్పటికీ పేరెంట్స్ తెచ్చిన పెళ్లి చూపులకి అటెండ్ అవుతూనే ఉంటారు. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటారు.

అటు తిరిగి ఇటు తిరిగి ఈ సంబంధాల టార్చర్ పడలేక శౌర్య తన ఫస్ట్ మ్యాచ్ దివ్యతోనే ఫిక్స్ అవుతాడు. ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లిరోజు రాత్రి దివ్య పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇస్తుంది. ఆరునెలల్లో మ్యూచువల్ కంసెంట్ మీద విడిపోదామని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు శౌర్య. పెద్దల్లో ఘనంగా జరిగిన పెళ్లి తరువాత అనుకున్నట్టుగానే  లాయర్ ని కలిసి డివోర్స్ కి అప్లయ్ చేస్తారు పేరెంట్స్ కి తెలీకుండా.

ఇదంతా చేస్తున్నది ఎందుకంటే పెళ్లి పెళ్లి అంటూ వెంటపడే పెద్దలను కాదనలేక, తమకు నచ్చిన లైఫ్ ని డిసైడ్ చేసుకోవడానికి ఆడుతున్న నాటకమని ఒక మెసేజ్ కన్వే చేస్తూ ఆడియన్స్ కో ఇంటర్వల్.


డివోర్స్ వచ్చే ఆరు నెలలలోపు పెద్దలకు తెలీకుండా తమ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దివ్య రాను రాను శౌర్య ఫామిలీకి దగ్గరయి, విడిపోయే భర్తతో మొదటిసారి ప్రేమలో పడుతుంది. కథలో ఇంతవరకు పెద్దగా లేని ఓ చిన్న మలుపు, వైదేహి అనే మోడల్ తో ప్రేమలో పడతాడు మన హీరో. వైదేహితో దిగిన పిక్స్ ఫేస్ బుక్ లో పెట్టి దివ్యతోనే చెపుతాడు తమ ప్రేమ విషయం. ఇక్కడి నుంచే దివ్య అసూయ, వైదేహిని శౌర్య నుంచి దూరం చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. ప్రేమలో వున్న ఈర్ష్య వల్ల కావాలని వైదేహి, శౌర్యలను ఇబ్బంది పెడుతుంది దివ్య. వైదేహిని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొస్తాడు శౌర్య. సేమ్ టైం కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుస్తూ దివ్య పేరెంట్స్ ఇంటికి వస్తారు.

ఒక సెంటిమెంటల్ డ్రామా, ఉన్నరెండు రోజుల్లో శౌర్య, దివ్య పేరెంట్స్ కి దగ్గరవుతాడు. దివ్య మనసుకి మరింత దగ్గరవుతాడు. ఇంకో నెలరోజుల్లో విడాకులు వస్తే అమెరికా వెళ్లిపోదామన్న ప్రయత్నాలు మొదలుపెడతాడు శౌర్య. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో వీళ్ళు ఆడుతున్న పెళ్లి డ్రామా పెద్దలకు తెలిసి, పెద్దగోడవే జరుగుతుంది. పరువు కాపాడుకోడానికి దివ్యకి వేరే పెళ్లి చేయడానికి రెడీ  అవుతారు. చేసేదిలేక శౌర్య అమెరికాకి  ప్రయాణం. క్లయిమాక్స్ లో తాగుబోతు రమేష్, ఆశిష్ విద్యార్థి  తో ఓ కామెడీ అండ్ సూసైడ్ హై డ్రామా.


ఫ్లాష్ బ్యాక్ లో కథ ప్రెజెంట్ లోకి వచ్చి, బిల్డింగ్ మీంచి దూకిన శౌర్య సరాసరి చెత్తలారీలో పడతాడు. విడిపోయిన జంట మళ్ళీ కలుస్తారు. కథ సుఖాంతం.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:బెస్ట్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్ :
తెలుగు వేదిక రేటింగ్