అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్


​ట్రైలర్ లో ఏక్షన్, మూవీలో ఫ్యామిలీ ఎమోషన్. టోటల్ స్లో నారేషన్.


కథలోకి వెళితే : 
కేవలం ఒక్క ట్రైలర్ తో మొత్తం దేశాన్ని కబాలి మనియాగా మార్చిన తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో సారి భారతీయ ప్రేక్షకులు కళ్ళారా చూసారు. అసలు సినిమాలోకి సగటు ప్రేక్షకుడు వెళితే ఎలా వుందో చూద్దాం.

ఓపెనింగ్ సీన్ 25 సంవత్సరాలుగా కౌలాలంపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కబాలి విడుదలవుతాడు. విడుదలవుతోనే టోనీ లీ కి, అతని 43 గ్యాంగ్స్ కి వెన్నులో దడపుట్టిస్తాడు. విడుదలవుతూనే మలేషియాలో వున్న ఏ భారతీయుల చేత డ్రగ్స్, వ్యభిచారం చేయించద్దని వార్నింగ్ ఇస్తాడు టోనీలీ గ్యాంగ్స్ కి. ఒకవైపు టోని లీ రైట్ హ్యాండ్ అయిన వీరశంకర్( కిషోర్) కబాలినీ ని అంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఇక్కడి నుంచే కథలో సెంటిమెంట్ పార్ట్ మొదలవుతుంది. జైలుకి వెళ్లేముందు కడుపుతో ఉన్న తన భార్య రాధిక ఆప్టే ఎక్కడ వుందో తెలుసుకోవాలనుకుంటాడు. గతంలో తన మీద పగ తీర్చుకున్న అందరిని కలుస్తాడు. ఈ క్రమంలో తను డ్రగ్ భాధితుల కోసం నిర్వహిస్తున్న ఫంక్షన్ లో తన గతంగురించి చెపుతాడు . కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. 

కబాలి భారతదేశ సంతతికి చెందినా మలేషియా వాసి. అక్కడ మలేషియన్స్, చైనీస్ ప్రజలు ఇండియన్స్ ని  చూసే చిన్నచూపుకి వ్యతిరేకంగా ఒక విప్లవం లేవదీస్తాడు. సీతారామరాజు(నాజర్) నాయకత్వంలో పోరాడతాడు. సీతారామరాజు హత్యకు గురికావడంతో అనతికాలంలోనే నాయకుడవుతాడు. అనూహ్యంగా జరిగిన ఒక వెన్నుపోటు కారణంగా పోలీసులకి చిక్కి పాతిక సంవత్సరాలు జైలు పాలవుతాడు. కథలో ఓ ఇంటర్వల్.

 అనూహ్యంగా తనని చంపడానికి వీరశంకర్ చేత పంపబడ్డ దన్సిక తన కూతురని తెలుసుకుంటాడు. ఇండియా లో వున్న తన భార్య కోసం యానం వెళ్ళి కలుసుకుంటాడు. ఇక్కడ జరిగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సీనియర్ ప్రేక్షకులని టచ్ చేస్తుంది. నేటి యువతరాన్ని కొంచం అసహనంలోకి నెట్టేస్తుంది. ఫైనల్ గా భార్య బిడ్డలతో మలేసియా వచ్చిన మన కబాలికి చేదు అనుభవం ఎదురవుతుంది. తన గ్యాంగ్ మొత్తాన్ని టోనిలీ గ్యాంగ్ అంతం చేస్తారు. స్కూల్ కూడా కూలగొడతారు. ఈ సంఘటనలతో చలించిపోయిన కబాలి 43 గ్యాంగ్స్ ని నడుపుతున్న టోనీ లీ పుట్టిన రోజుకి వెళ్ళి అక్కడే అందరి కథ ముగిస్తాడు. ఇదే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మన తలైవా కబాలి సినిమా విశేషాలు. 


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

మొదట మాట్లాడుకోవలసింది సినిమాటోగ్రఫి నిర్వహించిన మురళీ గురించి. ఈ సినిమాలో రజనీ తరువాత ఏదైనా బావుంది అని చెప్పాలంటే ఇదే. ప్రతీ సీన్, షాట్ లో మురళి పనితనం సూపర్బ్.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ గురించి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన పనితనం చూపించాడు.
 
దర్శకుడు రంజిత గురించి. కామెడీ అండ్ సాంగ్స్ లేకుండా ఒక ఏక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమాని సూపర్ స్టార్ లాంటి రజనీకాంత్ తో తీయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా మొదటి అరగంట తన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. తరువాత చూపించడానికి ప్రయత్నించాడు. 


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

మనందరి తలైవా, అభితాబ్ తరువాత అంతటి స్టార్ డం అందుకున్న  రజనీకాంత్ కంప్లీట్ న్యూ లుక్ లో, మలేషియన్ డాన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. డైలాగ్ డెలివరి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాకింగ్ స్టైల్ అన్నిట్లోనూ తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. డాన్ గానే కాకుండా తనకు దూరమైనా కుటుంబంకోసం పరితపించే వ్యక్తిగా పరిపూర్ణమైన నటన ప్రదర్శించాడు.

మిగిలిన వారిలో చెప్పుకో తగ్గది రాధికా ఆప్టే, కిషోర్ ల నటన బాగుంది.

మలేషియన్ నటుడు విన్స్  టన్ చావ్ నటన సూపర్. మిగిలిన వారు తమ పరిధికి తగ్గట్టు నటించారు.


బెస్ట్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:

తలైవా కబాలి ఓపెనింగ్ సీన్ అండ్ గెటప్


సినిమాటోగ్రఫి


క్లైమాక్స్


మైనస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పాలంటే కాస్త కష్టమే. అయినా కాస్త ధైర్యం చేసి చెప్పాల్సివస్తే.


 పేరులో వున్న స్టైల్ సినిమా చూస్తుంటే లేదు.


ట్రైలర్ చూడగానే భారీ ఏక్షన్ ఫిలిం అని కలలుగన్న రజనీ అభిమానులకు అటు ఏక్షన్ ఫిలిం కి ఇటు ఫిమిలీ డ్రామా కి మధ్యలో ఆగిపోయింది.


హాలీవుడ్ సినిమా మేకింగ్, కథనం చాలా నత్త నడకలా ఉండడంతో ప్రేక్షకులు అసహనానికి గురిగాక తప్పదు.


ముఖ్యం గా రజనీకాంత్ కామెడీ చేయడంలో కూడా సూపర్ స్టార్, ఆ కోణాన్ని చాలా తక్కువగా ఉపయోగించుకున్నాడు దర్శకుడు. 


KABALI

Telugu Movie Review & Rating

Genre : Action & Emotional family Drama
Target: అల్ ఇండియా తలైవా ఫాన్స్   

Story line:  మలేసియాలో డాన్ గా ఎదిగిన ఓ భారతీయుడి కుటుంబకథే ఈ కబాలి. 

Rating : 2/4 (ఫరవాలేదు).

Banner         : షణ్ముఖ క్రియేషన్స్ 
Producer   :  కలైపులి ఎస్ థాను 
Story &Direction : రంజిత్ పా 

 తలైవ రజనీకాంత్, రాధికా ఆప్టే, దినేష్ రవి, విన్స్  టన్ చావ్ , నాజర్, కలై రసన్, హరిక్రిష్ణన్,దన్సిక, కిషోర్, జాన్ విజయ్ తారాగణంగా నటించిన  కబాలి సంగతులు సంగతులు.

Release Date : 22th, July 2016.

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది