అక్షర తోరణం ప్రత్యేక సంచికదిక్కులు చూడకు రామయ్యతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు త్రికోటి. ఆ ముగ్గురు సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రంజిత్. వీరిద్దరికి జువ్వ రెండవ చిత్రం. కథలో బలం కథనంలో ఆశక్తి ఉండి జువ్వ విజయం దిశగా ఎగరాలని కోరుకుందాం

​కథలోకి వెళితే :


కథ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో మొదలవుతుంది. అదికూడా మైనర్ స్టూడెంట్స్ మధ్య. శృతి నువ్వు నన్నె ప్రేమించాలంటూ వేధించి ప్రిన్సిపాల్ ని చంపి బస్వరాజు (అర్జున్) బాల నేరస్తుడిగా జైలుకు వెళతాడు.


 ఇక కథలో హీరో రంజిత్ ప్రవేశం.చిన్న చిన్న ఛీటింగ్స్ చేస్తూ ఆకతాయిగా తిరిగే రంజిత్ కి ఆధ్య(పాలక్ జల్వాని) పరిచయంతో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ జర్నీలో రంజిత్ కమెడియన్స్  సప్తగిరి, అలీ చేసే కామెడీ సన్నివేశాలు కాసేపు ఎంటర్టైన్ చేస్తారు.


ఇక ఈ జువ్వ ఎగరాలంటే అసలయిన కథ మొదలవ్వాలి. బాలనేరస్తుడిగా జైలుకెళ్లిన బస్వరాజు తిరిగి వస్తాడు. రావడంతోనే శృతి శృతి అంటూ తన చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం వేట మొదలుపెడతాడు.
 ఈ సస్పెన్సు ఎక్కువ సేపు నాంచకుండా శృతి ఎక్కడుందో కనుక్కుంటాడు. శృతి ఎవరో కాదు బస్వరాజ్ కి దొరకకుండా పేరు మార్చుకున్న ఆధ్య. ఈ సస్పెన్సు థ్రిల్లింగ్ లవ్ గేమ్ లో శృతి కోసం బస్వరాజ్ వేట, తనకి దొరక్కుండా శృతి ఎస్కేప్ అవ్వడం, మన రంజిత్ శృతికోసం ప్రాణాలు తెగించి కాపాడే పనిలో ఇంటర్వల్ బ్రేక్.


 ట్రైన్ లో వైజాగ్ పారిపోతున్న శృతి, రంజిత్ ల వెంట పడతాడు బస్వరాజ్. అనుకోకుండా రంజిత్, బస్వరాజ్ లు పరిచయం జరుగుతుంది ట్రైన్ లో.  ఇక్కడనుంచి ఛేజింగ్ మొదలవుతుంది. శృతి, బస్వరాజ్ లు ఒకరికొకరు ఎలా ఉంటారో తెలీదు. వైజాగ్ లో శృతికోసం  వేట మొదలవుతుంది. అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ .


శృతికి షెల్టర్ ఇచ్చిన  అంకుల్ మురళి శర్మ తన మతిస్థిమితం లేని కొడుక్కి ఇచ్చి చేయాలని శృతిని బంధించి, శృతికి అడ్డొచ్చే బస్వరాజ్ ని అరెస్ట్ చేయిస్తాడు. కథ ఎటునుంచి ఏటో వెళుతుంది. తెలివిగా శృతిని తప్పిస్తాడు రంజిత్.
 రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా కథల్లాగా గుర్తుపట్టలేని శృతి కోసం బస్వరాజ్, శృతిని పట్టుకోవాలని మురళీశర్మ. కథ క్లైమాక్స్ కి వస్తుంది. అసలు నిజం తెలుస్తుంది. మన హీరో రంజిత్ వీరోచిత పోరాటంతో బస్వరాజ్ కథ ముగుస్తుంది.టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


కీరవాణి వారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
దర్శకుడు త్రికోటి commercial love స్టోరీ తీసే ప్రాసెస్ లో పాత ఫార్ములా నే తీసి చూపించడానికి ప్రయత్నం చేసాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

Hero రంజిత్ చక్కటి బాడీ లాంగ్వేజ్ తో సహజంగా నటించాడు
సప్తగిరి, పోసాని, అలీ, మురళి శర్మ, సనాలు పాత్రకు న్యాయం చేశారు


Overall కథ, కథనంలో దమ్ములేదు, జువ్వ ఎగరలేదు.


JUVVA

Telugu Movie Review & Rating

Genre : Psycho love with action 
 

Actors: Ranjit, palak lalwani , Murali sharma, Ali, Saptagiri,Posani


Story line:
Regular commercial mas masala love story
Rating :
1/4 (బాగాలేదు)

Producer    : Dr Bharath Somi.

Director    : Trikoti 

Music Director: MM keeravani 

Cinematography: Suresh

Banner:  Somi films  

Release Date : 23rd 
Feb, 2018. 

తెలుగు వేదిక రేటింగ్

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది