అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Janata Garrage

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్


​కథలోకి వెళితే :


చాలా రోజులనుంచి ఒక మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్ టి ఆర్, శ్రీమంతుడు సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్లో వున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గారేజ్ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో సిని వర్గాల్లో, యంగ్ టైగర్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి. జనతా గారేజ్ లో విశేషాలు చూద్దాం.


కథ సింపుల్, తమ్ముడు ప్రోత్సాహంతో పట్నం వచ్చి ఒక మెకానికల్ షెడ్ పెట్టుకుంటాడు సత్యం(మోహన్ లాల్). దాని పేరు జనతా గారేజ్. వాహనాల రిపేర్లె కాకుండా సమాజంలో జరిగే అన్యాయలను ఎదిరించి అడ్డొచ్చిన వాళ్ళని రిపేర్లు చేస్తుంటారు అన్నదమ్ములు. సత్యం తమ్ముడు, మరదలు హత్యకు గురికావడంతో మిగిలిని మగ బిడ్డని తన మేనమామ సురేష్ ముంబై తీసుకెళ్ళిపోతాడు. కాలచక్రం అలా దొర్లి పాతిక సంవత్సరాలు గడిచిపోతుంది. జనతా గారేజ్ ప్రజల్లో అభిమానం సంపాయించుకుంటుంది. సత్యం సామాన్య జనాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు.


మరో వైపు ఆనంద్( జూనియర్ ఎన్ టి ఆర్) కూడా పెద్దనాన్న భావాలతో పెరుగుతాడు. ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణానికి ఎవరైనా హానిచేస్తే తాటతీస్తాడు. ఆనంద్ ని ప్రేమిస్తూ మరదలు బుజ్జి( సమంతా) ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడాని ఎదురుచూస్తూ వుంటుంది. మరో వైపు నిత్యమీనన్ కూడా ఆనంద్ భావాలకు ఫిదా అయ్యి అభిమానం పెంచుకుంటుంది. కథలో ఏదో ఒక ట్విస్ట్ వుండాలి. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చి అక్కడ పర్మిషన్ లేకుండా కట్టే కట్టడాలకు లోకల్ బిజినెస్ మాన్, సత్యం కొడుకే కారణమని, సత్యం కొడుకని తెలిసి కూడా వార్నింగ్ ఇచ్చి వెళతాడు.


ఈ సంఘటనతో కథ మలుపు తిరుగుతుంది. తన తరువాత ఈ జనతా గారేజ్ నడిపించే బాధ్యత నిజాయితీ గల ఆనంద్ కి అప్పగిస్తాడు సత్యం. నాటకీయంగా సత్యం కొడుకుని, బిజినెస్ మాన్ తన కూతురికి చేసుకుంటాడు తన వ్యాపారాల్లో సత్యం అడ్డు రాడని. ఇన్ని చేసినా సత్యం, ఆనంద్ ఇద్దరూ వీళ్ళ వ్యాపారానికి అడ్డుతగులుతూ వుంటారు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సత్యాన్నే హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. సత్యం అనుచరుడు అజయ్ ని కూడా హత్య చేస్తారు. వీటన్నిటికి కారణం అయిన తన కొడుకునే చివరకి చంపి జనతా గారేజ్ బాధ్యతలు ఆనంద్ కి అప్పగిస్తాడు. టూకీగా ఇదే కథ.

టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఓ మోస్తరుగా వుంది.


సినిమాటోగ్రఫి అందించిన తిరునావక్కరుసు పనితనం సినిమాకే హైలెట్.


మన దర్శకుడు కొరటాల శివ గురించి. ఎంచుకున్న కథ బాగుంది, కథ నడిపించే విధానంలో తికమకకు గురై అటు యంగ్ టైగర్, మోహన్ లాల్ మధ్యలో బాలన్స్ చేయలేక కాస్త ఇబ్బందులు పడ్డాడు.సెకండ్ హాఫ్ కథనం మొత్తం తెలిసున్న సినిమాలే చూసినట్టుగా వుంది.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


మన యంగ్ టైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే న్యూ లుక్ తో, తన వైవిధ్యమైన నటనతో, సాఫ్ట్ లుక్ తో చాలా బాగా నటించాడు. మాస్ ఇమేజ్ నుంచి క్లాసు ఇమేజ్ కి ఒక మెట్టు ఎక్కాడనే చెప్పచ్చు.


మరో ముఖ్య పాత్ర పోషించిన మోహన్ లా కుటుంబ పెద్దగా, ప్రజలకోసం బ్రతికే మనిషిగా అద్భుతమైన రోల్ పోషించాడు.


ఇద్దరు కధానాయికలయిన సమంతా, నిత్యాలు నిడివి అంతంత మాత్రమే.


కథలో ముఖ్య పాత్రలు పోషించిన సాయికుమార్, అజయ్, బ్రహ్మాజీల నటన బాగుంది. దేవయాని పాత్ర వున్నా డైలాగ్స్ తక్కువ.


బెస్ట్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:


జూనియర్ స్టైలిష్ నటన. మోహన్ లాల్ అద్భుత నటన. సినిమాటోగ్రఫి.


మైనస్ పాయింట్స్ :


దర్శకుడు కథనం నడిపించే విధానంలో ప్రేక్షకుడు తెలిసున్న సన్నీ వేశాలనే చూసినట్టు వుంది తప్ప కొత్తదనం లేదు. సెకండ్ హాఫ్ వచ్చే టప్పటికి ఎన్నో మలుపులు తిప్పాడు. ఆ మలుపులన్నీ గాడ్ ఫాదర్, మన వర్మ సర్కార్ సినిమాల సన్నివేశాలను పోలినట్టే వుంది తప్ప వైవిధ్యత కనిపించలేదు.


​కథనం నేడిపే విధానం నత్త నడతలా వుంది తప్ప ఎక్కడా సగటు ప్రేక్షకుడికి హుషారు తెప్పించలేదు.


​సినిమా 20 నిముషాలు అయ్యాకా మన యంగ్ టైగర్ కనపడతాడు. అది ప్రేక్షకులకి కాస్త నిరాశ కలిగించిన విషయం.Genre : Social message & Family Drama.


Target : 
All young tiger & Mohanlal fans


Story line:
సమాజంకోసం వీలైనంత వరకు మంచి చెయ్యాలనే ఇద్దరి వ్యక్తులు కథే ఈ జనతా గ్యారేజ్.

Rating : 
2/4 (ఫరవాలేదు).

Banner     :
మైత్రీ మూవీ మేకర్స్
Producer  :
నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)
Story & Direction   :
కొరటాల శివ


​యంగ్ టైగర్ ఎన్ టి ఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, దేవయాని, సాయికుమార్ తదితరులు నటించిన జనతా గారేజ్ విశేషాలు.

   
Release Date : 1st Sept, 2016.