అక్షర తోరణం ప్రత్యేక సంచిక

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది


జక్కన్న చెక్కిన శిల్పం కామెడీ మూవికి ఎక్కువ కమర్షియల్ మూవీకి తక్కువ


​కథలోకి వెళితే :

చాలా రోజులనుంచి అపజయాలు వెంటాడుతున్న మన సునీల్ కి అర్జెంటుగా ఓ కమర్షియల్ సక్సెస్ కావాలి. అందాలరాముడు, మర్యాదరామన్న లాంటి మరో విజయం తన ఖాతాలో జమ చేసుకోవాలని సునీల్ ఈ జక్కన్నతో చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ కథలోకి వెళదాం.  

ఓపెనింగ్ సీన్ తన తండ్రి నాగినీడు చెప్పిన చిన్న పిట్ట కథని నరనరాల్లో ఇముడ్చుకుని చేసిన సహాయానికి సమయం వచ్చినప్పుడు ప్రాణాలడ్డుపెట్టయినా సహాయం చేయాలనుకుంటాడు కొడుకు గణేష్(సునీల్).ఇది కాస్త మోతాదు మించి ఎక్కువగానే సహాయ పడుతుంటాడు.

పెద్దవాడైన గణేష్ ఓపెనింగ్ సీన్లోనే పడిపోయిన తన పర్సుని తిరిగి ఇచ్చిన బెగ్గర్ ని సింగర్ ని చేసి మిగతా కథలో తనెలా ఉంటాడో ముందుగానే చెపుతాడు. భైరాగి( కభీర్ సింగ్) వైజాగ్లో పేరుమోసిన రౌడి. ఎవ్వరికి కనిపించకుండా దందాలు చేసి ఇటు పోలీసులని అటు ప్రజలని భయపెడుతుంటాడు.వైజాగ్ రాగానే మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు సహస్రతో(మన్నర). తనకోసం కుంగుఫు స్కూలలో ఆఫీస్ బాయ్ గా కూడా జాయిన్ అవుతాడు. ఓవైపు సహస్రతో ప్రేమపాటలు పాడుకుంటూ మరోవైపు ఎవ్వరకి కనిపించని బైరాగి పిక్ పట్టుకుని తిరుగుతుంటాడు.ఇదే ప్రేక్షడుకికి కథలో ట్విస్ట్.  బైరాగిని చంపాలనుకునే మరో గ్యాంగ్ తో కలిసి, బైరాగిని టార్గెట్ చేసి, వాళ్ళమీదే తిరగబడతాడు. బైరాగికూడా సందిగ్ధంలో పడతాడు తనని ఎందుకు రక్షిస్తున్నాడని. చిన్నప్పుడు దేవా అని రౌడినుంచి తనని కాపాడినందుకు నీ అభిమానిగా మారి నీకు నే చెయ్యాలనుకున్న సహాయం చేస్తున్నానని సింపుల్ గా తేల్చేస్తాడు. బైరాగి అంటే తెలీని వైజాగ్ ప్రజలకు బైరాగి ఫోటోలు చూపించి పాపులర్ చేస్తాడు. గణేష్ చేసిన పనికి అంతవరకూ వెంటపడని పోలీసుల బైరాగివెంట పడతారు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసరుగా కట్టప్ప( పృథ్వి) తన దైన బాలయ్య పంచ్ డైలాగులతో గణేష్, బైరాగితో చేసే కామెడీ ప్రేక్షకులని కొంచం నవ్వించే ప్రయత్నం చేస్తుంది. 

ఇక కథ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి తను ప్రేమిస్తున్న సహస్ర అన్నయ్యే  బైరాగని తెలుసుకుని సహస్ర ఫ్యామిలీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తాడు. బైరాగికి పెళ్ళికూడా చేసే ప్రయత్నం చేస్తాడు. తానంటే భయపడే ప్రజలు, తననొక మామూలు మనిషిగా చూస్తున్నందుకు పగతో రగిలిపోయి గణేష్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు బైరాగి. అనుకున్న ప్లాన్ రివర్స్ అయ్యి  బైరాగే చిక్కుల్లో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటాడు. ప్రేక్షకులందరూ ఊహించినట్టుగా మన గణేష్ వీరోచితంగా పోరాడి చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడిన బైరాగి ప్రాణాలు కాపాడతాడు. అమర శిల్పి జక్కన్న శిల్పాన్ని చెక్కితే మన జక్కన్న స్నేహంతో మనుషుల మనసుల్ని చెక్కి, సినిమా టైటిల్ ఇందుకోసమే పెట్టామని ఆడియన్స్ కి విడమరచి చెప్పడంతో కథ సమాప్తమవుతుంది.   


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ని మెచ్చుకోవచ్చు. సునీల్ బాడీ లాంగ్వేజ్ ని మాస్ హీరోకి తగ్గట్టు చూపించాడు రామ్ ప్రసాద్.

దినేష్ సంగీతం ఆశించినంతగా లేదు.

ఇక మన దర్శకుడు ఆకెళ్ళ గురించి. తను ఎంచుకున్న కథలో కొత్తదనం వుంది. కథనాన్నే మరింత ఆశక్తిగా చూపెడితే బాగుండేది. పూర్తి స్తాయి కమర్షియల్ హీరోగా సునీల్ ని చూపించే ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. 


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

సునీల్ కథని మొత్తం భుజాన వేసుకుని ఎక్కువ బరువే మోసాడని చెప్పాలి. అటు ఫైట్స్, ఇటు తన సహజసిద్దమయిన కామెడీ తో ప్రేక్షకులని అలరించడానికి వందశాతం కష్టపడ్డాడు.

మన్నర చోప్రా అందాల ఆరబోత కూడా అంతంతమాత్రమే. నటనకి ఏమాత్రం ఆస్కారం లేదు.

నాగినీడు, రాజలక్ష్మిల పాత్ర హుందాగా వుంది.

సప్తగిరి, పృథ్వి, రోలర్ రవిలు తమదైన హాస్యంతో అలరించారు.


బెస్ట్ డైలాగ్స్:ప్లస్ పాయింట్స్:

సునీల్ నటన 

కథలో కొత్తదనం 

సప్తగిరి స్పూఫింగ్ కామెడీ బాగుంది.


మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కథలో విభిన్నత చూపించినా కథనాన్ని ఆశక్తిగా చూపించలేకపోయాడు. బైరాగి పాత్ర రౌడీయిజానికి కామెడీకి మధ్యలో పల్చబడింది.

పృథ్వి తో పేల్చిన  డైలాగ్స్ రొటీన్ గా వున్నాయి తప్ప కొత్తదనం లేదు.

హీరోయిన్ పెద్ద మైనస్ పాయింట్ మూవికి.

సునీల్ డాన్సులను ఇష్టపడేవారికి రెగ్యులర్ స్టెప్స్ తో నిరాశే మిగిలింది.
Genre : Action & comedy
Target: All comedy flick lovers

Story line: చేసిన సాయం మర్చిపోకూడదని తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి తిరిగి సాయం చేసే ఓ యువకుడి కథే ఈ జక్కన్న.

Rating : 2/4 (ఫరవాలేదు).


Banner         : RPA క్రియేషన్స్
Producer   :   సుదర్శన్ రెడ్డి
Story &Direction : వంశీకృష్ణ ఆకెళ్ళ

 సునీల్, మన్నర చోప్రా, నాగినీడు, సప్తగిరి, పృథ్వి, రోలర్ రవి, రాజా రవీంద్ర, కభీర్ సింగ్ తారాగణంగా నటించిన  జక్కన్న సంగతులు సంగతులు.

Release Date : 29th, July 2016.

తెలుగు వేదిక రేటింగ్

JAKKANNA

Telugu Movie Review & Rating