అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్

Genre : Action entertainer with family drama
 

Actors: Sai DharamTeja, Lavanya Tropathi, Najar, Ashish Vidyarthi

Story line:
తనకి సహాయం చేసిన ఫ్యామిలీ కోసం ఓ ఇంటెలిజెంట్ చేసిన సాహసమే ఈ ఇంటెలిజెంట్


Rating :
1/4(బాగాలేదు)


Producer  :
Usha Mulpuri

Director    : VV Vinayak

​Dialogues:Shiva Aakula 
Music:
S Taman

Banner: CK Entertainments Pvt Ltd

Release Date : 
9th Feb, 2018. 

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

INTELLIGENT

Telugu Movie Review & Rating


మన మెగా సుప్రీం హీరోకి ఒక మెగా హిట్ కావాలని మెగా ఫాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. ధరమ్ తేజ్ కి కూడా ఓ భారీ హిట్ అవసరం. ఇలాంటి సమయంలో మాస్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఇంటెలిజెంట్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కథలోకి వెళదాం....


​కథలోకి వెళితే :


స్కూలింగ్ డేస్ నుంచి మనకి సాయంగా వుండే వారికి సహాయం చేయాలన్న లక్ష్యంతో పెరుగుతాడు మన తేజ (సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్). Vision software ఓనర్ నందకిశోర్ (నాజర్) చదివించడంతో అతని కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తాడు మన తేజ. హీరో అన్నాక హీరోయిజం చూపించాలి కాబట్టి ఫ్రెండ్ ని కొట్టినందుకు పోసాని గ్యాంగ్ ని చితక్కొట్టి, పనిలో పని పబ్ లో ఓ పాటతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాడు.


విక్కీ గ్యాంగ్ కలెక్టర్ తివారిని చంపి సిటీలో తనకి ఎదురులేదని పోలీసులకి  సవాల్ విసురుతాడు. పనిలో పని నందకిశోర్ కంపెనీని ఓ ముంబై కంపెనీ కొనాలని విక్కీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. కథలో ముఖ్యమైన మలుపు   కోసం ఎదురుచూసే లోపల నంద కిషోర్ కూతురుతో ప్రేమాయణం, లోకల్ రౌడీస్ పోసాని, ఫిష్ వెంకట్ మరియు తేజ ఫ్రెండ్స్ సప్తగిరి గ్యాంగ్ తో కామెడీ ప్రేక్షకుడుని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇదేకాకుండా సమాజ సేవ, అమ్మ ప్రేమతో కాస్త సెంటిమెంట్ కూడా చూపిస్తాడు.


విక్కీ గ్యాంగ్ నందకిశోర్ ని కంపెనీని వ్రాసిమ్మని  భయపెడతారు. దాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో తేజ పోస్ట్ చేశాడన్న కోపంతో తేజని కొడతారు విక్కీ గ్యాంగ్. రాత్రికి రాత్రే తన కంపెనీని ముంబై కంపెనీకి రాసిచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు.  ఇప్పుడు కథ అసలు మలుపు తిరుగుతుంది. నాజర్ ది హత్య లేక ఆత్మ హత్యా?? విక్కీ భాయ్ ని చంపాలి. ఈ కోపంలో మొదట విక్కీ భాయ్ తమ్ముడిని చంపి, ఇప్పటి వరకు పేరు తప్ప మనిషి కనపడని విక్కీ భాయ్ (రాహుల్ దేవ్) కి సవాల్ విసిరి ఇంటర్వల్ బ్రేక్ ఇస్తాడు మన తేజ.

 ఇంటర్వల్ తరువాతైనా ఇంటెలిజెంట్ మూవీలో కాస్త ఇంటలిజెన్స్ ఉందేమోనని ఎదురు చూసే ప్రేక్షకులకి నిరాశే ఎదురవుతుంది. రాత్రికి రాత్రే మన తేజ ధర్మా భాయ్ పేరుతో ఫేస్ బుక్ లో ఫేమస్ అవుతాడు.చాలా నెట్వర్క్  ఏర్పడుతుంది. అన్యాయంగా దోచుకున్న రాజకీయ నాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీ హ్యాక్ చేసి పేదలకు పంచుతాడు. ఈ లాజిక్ ఆడియన్స్ కి అర్థం కాకపోయినా ఎంజాయ్ చేస్తారు.


ఆస్తులు పోగొట్టుకుని  బాధపడుతున్న పొలిటీషియన్స్ పృద్వి, రఘుబాబులతో చేయించిన కామెడీతో మళ్లీ  నవ్వించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. విక్కీ భాయ్ ఇండియా వస్తాడు, ధర్మా భాయ్ రూపంలో ఉన్న తేజని వేటాడే పనిలో ఉంటే అనూహ్యంగా తేజ విదేశాల్లో ఉన్న విక్కీ భాయ్ అకౌంట్స్ లో హ్యాక్ చేసి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు.


ఇంటెలిజెంట్ అనే మూవీ టైటిల్ కి న్యాయం చేయడానికి ధర్మా భాయ్ విక్కీకి గ్యాంగ్ కి, పోలీసులకి దొరకకుండా తెలివిగా ఆడుకుంటాడు. మధ్య మధ్యలో ఆటవిడుపుగా ఓ రెండు పాటలు, ధర్మ రాజు పేరుతో బ్రహ్మనందం కామిడి  మళ్లీ అలరిస్తుంది.  అసలు విక్కీకి చంపకుండా ఈ గేమంతా ఎందుకు ఆడుతున్నాడంటే ఓ స్నేక్ గేమ్ తెలియాలి. మంత్రి కొడుకు చేసిన అన్యాయం తెలియాలి. నాజర్ ఎలా చనిపోయాడో తెలియాలి. ఫైనల్ గా అన్ని ట్విస్ట్ లు వీగిపోయి నాజర్ హత్య వెనుక కుట్ర, కంపెనీ ఎలా తిరిగి దక్కించుకున్నాడన్న విషయాలతో మన ఇంటెలిజెంట్ కథ సుఖంతమవుతుంది.

టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలన్నీ శ్రావ్యంగా లేకపోయినా అలరించాయి. 


సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. 


ఇక మాస్ చిత్రాల కేర్ ఆ అడ్రస్ అయిన దర్శకుడు వినాయక్ గురించి. మెగా ఫ్యామిలీతో సినిమా అంటేనే చాలా అంచనాలు పెట్టుకుంటారు అభిమానులు. 


ఏక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీద దృష్టిపెట్టి సినిమా టైటిల్ నే పక్కన పెట్టాడు వినాయక్. ఓల్డ్ స్క్రీన్ ప్లే, బోరు కొట్టే కామెడీ, ఇంటెలిజెంట్ కాదుకదా ఎవరేజ్ గా కూడా లేని సీన్స్. మాఫియా, పోలీస్, కొన్ని హత్యలు, వీటిని ధైర్యంగా ఎదుర్కొనే కథానాయకుడు. ఈ కథల నుంచి బయటకి వచ్చి కాస్త ఇంటెలిజెంట్ మూవీస్ కి ప్రయత్నించాలని కొరుకుందాం ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మన వినాయక్ ని.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

సాయి ధరమ్ తేజ్ పాటల్లో, స్టైలిష్ లుక్స్ లో చాలా బాగున్నాడు. నటన పరంగా ok అనిపించాడు. 


లావణ్యా త్రిపాఠి హీరోకి తోడుగా హీరోయిన్ గా నటించింది.


ఇక హాస్య నటులు పృథ్వి,  బ్రహ్మానందం,రఘుబాబు, సప్తగిరి, కాదంబరి కిరణ్, విద్యుల్లతా రామన్, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ లు కథతో పాటు నటించారు. 


కారెక్టర్ ఆర్టిస్ట్స్ లు నాజర్, ఆశిష్ విద్యార్థిలు నటన బాగుంది. 


​విలన్ లుగా దేవ్ గిల్, రాహుల్ దేవ్ లు చాలా కష్టపడ్డారు విలనిజం చూపించడానికి.