అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Inkokkadu Movie Review

Telugu Movie Review & Rating

Genre : Complete Action film
Target :
All Chiyan fans

Story line:
తన భార్యని చంపిన మాఫియా డాన్ పై భర్త ఎలా పగతీర్చుకున్నాడనే కథే ఈ ఇంకొకడు.

Rating : 
2/4 (ఫరవాలేదు).

Banner      :
థమీన్ ఫిలిమ్స్
Producer  :
శిబు థమీన్స్
Director    :
ఆనంద్ శంకర్


చియాన్ విక్రం , నాయనతార, నిత్యమీనన్, నాజర్, తదితరులు నటించిన ఇంకొకడు చిత్ర విశేషాలు.
    
Release Date : 8th Sept, 2016. 


​కథలోకి వెళితే :


చియాన్ విక్రం ఓ విభిన్న కథా నాయకుడు. కథకి, అందులోని ప్రాత్రలో వైవిధ్యత, ప్రాధాన్యత వుంటే విక్రం కథని ఒప్పుకుంటాడనేది మన చూస్తున్నదే. జయాపజయాలతో సంబంధం వుండదు విక్రంకి. తన నటన చూడటం తప్ప. ఈ రోజే విడుదలైన విక్రం మూవీ ఇంకొకడు సినిమా కూడా ఆ కోవలోదే. ముఖ్యంగా తను ఈ సినిమా ఒప్పుకున్న కారణం లవ్ అనే హిర్జా పాత్ర కోసం.


కథ ప్రారంభంలోనే మలేసియాలో ఉన్న ఇండియన్ ఎంబసిపై దాడి జరుగుతుంది. ఆ దాడిలో ఒక ముసలి వ్యక్తి వాడిన ఇన్ హీలర్ పైనే అందరి ద్రుష్టి పడుతుంది. ఇదొక ఉగ్రవాద చర్యగా మలేషియన్ ప్రభుత్వం గుర్తిస్తుంది. దీని గుట్టు రట్టు చేయడానికి గత నాలుగు సంవత్సరాల నుండి అజ్ఞాతంలో వున్న ఆనంద్ ( విక్రం) ని స్పెషల్ ఇండియన్ ఆఫీసర్ అయిన నాజర్ వెతికి పట్టుకుని ఈ బాధ్యతలు అప్పగిస్తాడు.


కథ కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మలేషియాలో కెమికల్ మాఫియా డాన్ అయిన లవ్ ని చంపే ప్రయత్నంలో తన భార్య మీరా(నయనతార) ని కోల్పోతాడు ఆనంద్. దానితో విరక్తి చెంది జాబుకి రిజైన్ చేస్తాడు. నాజర్ కోరిక మీద మళ్ళీ వచ్చి ఈ ఉగ్రవాద చర్యకి కారణమైన వాళ్ళని వెతికే వేటలో తను చంపినా లవ్ మళ్ళీ బ్రతికే వున్నదని తెలుస్తుంది. కథ మొత్తం ఈ ఇన్ హీలర్ చుట్టూనే తిరుగుతుంది.ఇక్కడనుంచి కథనంలో ఆక్షన్, సస్పెన్స్ మొదలవుతుంది. మొత్తానికి తనతో వచ్చిన కేస్ ఆఫీసర్ నిత్యమీనన్ తో కలసి లవ్ ఆచూకి కనుక్కుని తను వున్న చోటుకి వెళతాడు. అక్కడే కథలో మరో మలుపు.


సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులకి ఆశ్చర్యం కలిగించే ఈ లవ్ ఒక హిజ్రా. విక్రం డ్యూయల్ రోల్. లవ్ గెటప్, హావభావాలతో విక్రం కట్టిపడేస్తాడు ప్రేక్షకులని. మొత్తానికి లవ్ ని అరెస్ట్ చేస్తాడు. లవ్ తెలివిగా మలేషియన్ పోకిసు నుంచి తప్పించుకుని తను మాఫియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తను తయారు చేసిన కెమికల్ డ్రగ్ ని ఉగ్రవాదులకి సప్లై చేయాలనుకుంటాడు. మళ్ళీ ఆనంద్ తన వీరోచిత పోరాటంతో, లవ్ ఆట కట్టించి, కథని సుఖాంతం చేస్తాడు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సినిమాటోగ్రాఫర్ కి ప్రత్యేక మార్కులు ఇవ్వచ్చు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది.


సంగీతం అందించిన హరీష్ జైరాజ్ పాటలు పాత బాణీలలో కొత్త రాగాలు పలికిన్చినట్టు వున్నాయి తప్ప కొత్త అర్థత కనపడలేదు గాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది.


ఇక దర్శకుడి ఆనంద్ గురించి. తను ఎంచుకున్న కథ చాలా పాతది. మొదట అరగంటలోనే ప్రేక్షకుడు క్లైమాక్స్ ఎలా ఉండబోతూందనేది కనిపెట్టేస్తాడు. దర్శకుడి ఆలోచన మొత్తం హాలీవుడ్ తరహాలో పూర్తి స్థాయి ఆక్షన్ థ్రిల్లర్ మూవీ తీయాలన్న తపనే కనపడింది. లవ్ అనే ఒక వైవిధ్యభరితమైన పాత్రలో విక్రం ని హిజ్రాగా నటింపచేసి నటన పరంగా విక్రంకి మంచి మార్కులు తెప్పించగాలిగాడు గాని కథలో కథనంలో వైవిధ్యత లేదు. పాత సినిమా పోరాట సన్నివేశాలని చూస్తున్నట్టుగానే వుంది. కామెడీని పూర్తిగా దూరం పెట్టాడు. ఇక్కడే ప్రేక్షకులకి కాస్త నిరాశ తెప్పించాడని అనుకోవచ్చు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


విక్రందే సినిమా మొత్తం. ఏజెంట్ ఆనంద్ గా, హిజ్రా పాత్రలో లవ్ గా తన నటన అధ్బుతః


నయనతార, నిత్యలకి కథాబలమైన పాత్రలు లభించాయి.


ప్లస్ పాయింట్స్:


చియన్ విక్రం నటించిన రెండు పాత్రలు. లవ్ అనే హిర్జా పాత్ర. సినిమాటోగ్రఫి


మైనస్ పాయింట్స్ :


హాలీవుడ్ తరహా సినిమా తీయడంలో ఆక్షన్ కే ప్రాధాన్యత, లోపించిన కామెడీ.


కథ, కథనం రెండూ పాతవే.


కథనంలో కొత్తదనం లేకపోవడంతో విక్రం కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది.


తెలుగు వేదిక రేటింగ్

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది