అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్

Genre : Romedy Entertainer
Target : All Teenagers

Story line: దేశభక్తి నిండిన ఇద్దరు కంప్యూటర్స్ టెకీస్ ప్రేమ కథ.


Rating : ఫరవాలేదు 2/4

Banner      :
 SRP Visuals
Producer  : శివరాజ్ పాటిల్ 
Director    : నాని ఆచార్య 


రామ్ కార్తీక్, భాను త్రిపాటి, బిత్తిరి సత్తి  తారాగణంగా నటించిన నీకు నాకు మధ్య 18 చిత్ర విశేషాలు. 
    
Release Date : 21st April, 2017. 

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

IDDARI MADHYA 18

Telugu Movie Review & Rating

కథలోకి వెళితే :


హోలిపండుగా సంబరాల్లో హిమని ఎవరో గాయం చేయడంతో సృహ కోల్పోతుంది. ఏం జరిగిందో అర్థం కాదు మహికి. ఎన్నో ప్రేమ కథల్లాగే ఈ కథ కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది.


 అరకులోయకు పిక్ నిక్ వచ్చిన ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ప్రేమగా మారాలంటే ఓ కారణం కావాలి. టూర్లో మహి మర్చిపోయిన మొబైల్ హిమకి దొరుకుతుంది. పనిలోపనిగా హిమ, మహి డైరీకూడా చదువుతుంది. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. హైద్రాబాద్ వచ్చి ఫోన్ ఇస్తానని మహిని ఊరించి రోజులు లెక్కపెట్టుకునేలా చేస్తుంది. మహి కాలేజీలో కొలంబస్ అనే లోకల్ గూండాతో గొడవ. బీర్బల్ గా బిత్తిరిసత్తి మొదటిసారి వెండితెర ప్రవేశం చేసి కాలేజీలో ఉన్న కుర్రాళ్లకు అప్పులు ఇస్తూ తనదైన కామెడీని పండించడానికి ప్రయత్నిoచాడు చిత్రంగా హిమ కూడా మహి కాలేజీలో జాయిన్ అవ్వడం , ఇద్దరూ కలిసి ఒకే కంప్యూటర్ ప్రాజెక్ట్ చేయడం, ఇద్దరు ఇళ్ళు కూడా ఎదురెదురుగా కుదిరిపోవడం ఆడియెన్స్ బ్రెయిన్ కి పెద్దగా పనిపెట్టకుండా  జరిగిపోతాయి.


మిషన్ 18 అనే  ప్రాజెక్ట్ మీద సీరియస్ గా పనిచేస్తూనే ఇద్దరి మధ్య లవ్ ప్రాజెక్ట్ పెరిగి మహి లవ్ ఆక్సెప్ట్  చేస్తుంది హిమ.యుగళగీతాలు పాడుకోవడం, మధ్య మధ్యలో బిత్తిరి సత్తితో  కామెడీ సీన్లతో సాగుతున్న కథలో ఓ కీలక మలుపు కాలేజీ వాష్ రూంలో చెల్లెలి వీడియోస్ తీసినందుకు టోనిని షూట్ చేస్తాడు మహి పాత బస్తీలో కొన్న గన్ తో. తరువాత ఏం జరుగుతుంది అనే టెన్షన్ తో ఓ ఇంటర్వల్.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మిషన్ 18 పూర్తయ్యేవరకు పోలీసులకి కూడా దొరకకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటాడు మహి. కథ లవ్ జోనర్ నుంచి సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఆడియన్స్  కి ఈ టెన్షన్ లో కాస్త రిలీఫ్ బిత్తిరిసత్తి కామెడీ, హిమకు ధైర్యం చెపుతూ మహితో కొన్ని రొమాంటిక్ సీన్స్.


కథలో క్రైమ్ తోపాటు మాఫియా ఫ్లావర్ కూడా తోడవుతుంది. మహి హిమలు చేస్తున్న యాంటీ బ్లాస్టింగ్ ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి అబ్దుల్లా, కొలంబస్ లు ప్రయత్నించి లాభంలేకపోవడంతో లాబ్ ని తగులబెడతారు. ప్రొఫెసర్ దగ్గర మరో కాపీ ఉండడంతో మహి హిమలు ప్రాజెక్ట్ సబ్మిషన్ కి ఢిల్లీ వెళ్ళి అప్రూవల్ చేయించుకుని వస్తారు. కథ ప్రి క్లైమాక్స్ కి చేరి కొలంబస్ కి మహి మీద అనుమానం వస్తుంది.


అబ్దుల్లా ఆర్డర్స్ ప్రకారం కొలంబస్  మానవ బాంబుగా తయారవుతాడు హోలీరోజున కాలేజీలో బ్లాస్ట్ చేయడానికి. అది ఫెయిల్ అవడంతో హిమ, మహి మీద దాడి చేస్తారు. ఓ భీభత్సమైన ఫైట్ , అబ్దుల్లా గ్యాంగ్ అందరిని కాల్చడం మొదలుపెడుతుంది. ఫైనల్ గా పోలీసులు రంగంలోకి దిగి కథ సుఖాంతం చేస్తారు. టైటిల్ కి తగ్గట్టుగా ఇద్దరి మధ్య 18 సక్సెస్.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


ఘంటాడి కృష్ణ సంగీతం శ్రావ్యంగా ఉంది. ఎప్పుడో  మనసంతా పూవుగా మారింది పాటకు చక్కటి బాణీ ఇచ్చారు. 
సినిమాటోగ్రఫీ అంతంత మాత్రమే
ఇక దర్శకుడు నాని ఆచార్య గురించి.  తన కథలో అంతర్లీనంగా దేశభక్తి చూపెడుతూ ఓ ప్రేమ కథని నడిపించారు. కాకపోతే దేనికి ప్రాధాన్య మివ్వాలో తెలీని సందిగ్ధత. అయినా తన మొదటి సినిమాలో రాసుకున్న కథకి న్యాయం జరిగేలా తనవంతు ప్రయత్నించాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


నాయికా నాయికలు రాం, భాను త్రిపాఠి ల నటన ఓ మోస్తరుగా బాగుంది.
మొదటిసారి వెండి తెరపై అలరించిన బిత్తిరిసత్తి తనదైన మార్క్ కామెడీతో అలరించాడు.


ప్లస్ పాయింట్స్:

ఘంటాడి కృష్ణ పాటలు, హీరోయిన్ భాను త్రిపాఠి క్లోజ్ అప్ గ్లామర్.

మైనస్ పాయింట్స్ :


ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ 
స్క్రీన్ ప్లే


టోటల్ గా సోసిల్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించిన ఓ మూస సినిమా