అక్షర తోరణం ప్రత్యేక సంచిక


అక్కినేని అఖిల్ కి అఖిల్ లాంటి డిజాస్టర్ తరువాత అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున చాలా జాగ్రత్తగా తమ కుటుంబానికి ఘనవిజయం ఇచ్చిన మనం దర్శకుడు విక్రమ్ కుమార్ ని పెట్టి ఆల్మోస్ట్ మళ్లీ అఖిల్ కి  రిలాంచ్ ప్రాజెక్ట్ గా తీసిన చిత్రం 'హలో'. 


ప్రేమకథలు కేర్ ఆ అడ్రస్ అయిన అక్కినేని ఫ్యామిలీ కి హలో సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుందాం.


కథలోకి వెళితే :....
మన హీరో అవినాష్(అఖిల్) ని ఫస్ట్ సీన్ లో చూడగానే అర్థమవుతుంది అతని కళ్ళు ప్రేమకోసం, ఒకరికోసం సంవత్సరాలుగా  వెతుకుతున్నాయని. తన చిన్ననాటి జును(ప్రియదర్శిని) కోసం వెతుకుటుంటాడు. అలా చూస్తుండగానే ఆడియన్స్ ని ఫ్లాష్ బాక్ లోకి తీసుకువెళతాడు దర్శకుడు.


 శ్రీను  ఒక అనాధ, వీధి బాలుడు. వైలన్ ప్లే చేస్తూ RK పార్క్ లో ఉంటాడు. ఓ పానీపూరి వాలా దగ్గర జునుతో పరిచయం, స్నేహం పెరుగుతుంది. జును శ్రీను ప్లే చేసిన వైలన్ ట్యూన్ అంటే ఇష్టం. కొద్దిరోజుల్లోనే ఎన్నో పాతకథల్లానే జును నాన్నకి వేరే స్టేట్ ట్రాన్సవేర్ అవడంతో విడిపోతారు. వెళ్ళేటప్పుడు జును 100 నోటుమీద మమ్మీ నెంబర్ వ్రాసి ఇస్తుంది. ఆ వంద నోటు కాస్త చైల్డ్ రోబర్ పండు దొంగిలించడంతో జును జ్ఞాపకం తప్ప ఇంకేం మిగలదు శ్రీను దగ్గర. జును కోసం పండును వెంపడిస్తూ ఆక్సిడెంట్ కి గురవుతాడు శ్రీను. ఆక్సిడెంట్ చేసిన రమ్యకృష్ణ, జగపతిబాబు దంపతులకు  పిల్లలు లేకపోవడంతో శ్రీనుని పెంచుకుంటారు. 


 హైద్రాబాద్లో RK పార్క్ దగ్గర కలిసిన వీళ్లిద్దరి చిన్ననాటి  పరిచయం పెరిగేకొద్దీ ప్రేమగా మారుతుంది.  జును పేరు ప్రియ. శ్రీను పేరును అవినాష్ గా రమ్యకృష్ణ మారుస్తుంది.  ఎప్పటికైనా తనకి శ్రీను ఫోన్ చేస్తాడని  ఎదురుచూస్తుంటుంది ప్రియ.  అవినాష్ ఎదురుచూపులుతోనే జునుకోసం వెతుకుటుంటాడు. ప్రియ శ్రీను మీద ప్రేమతో వైలన్ నేర్చుకుంటుంది.  అనుకోకుండా ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన కాల్ లో ఒక  వైలన్ సంగీతం వినపడుతుంది అవినాష్ కి.  చిన్నప్పుడు జును దగ్గర ప్లే చేసిన వైలన్ ట్యూన్ అది. క్యాబ్ డ్రైవర్ ని లొకేషన్ ఆడిగేంతలోనే  అవినాష్ ఫోన్ తన చిన్ననాటి స్ట్రీట్ ఫ్రెండ్ పండునే కొట్టేస్తాడు. అక్కడినుంచి హీరో ఛేజింగ్ మొదలవుతుంది. ఫైనల్ గా  దొంగిలించిన  సెల్ ఫోన్స్ వెళుతున్న ట్రక్ ని చేజ్ చేసి మరీ మొబైల్ సంపాయిస్తాడు. క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసి ఉదయం వచ్చిన ఇంకమింగ్ కాల్ లొకేషన్ కనుక్కుంటాడు. ఇంతలో ఓ బలమైన దెబ్బ  విలన్ గ్యాంగ్ లో ఒకడు తలపై కొట్టడంతో  స్పృహతప్పే పడిపోతారు అవినాశ.జునుని కలుసుకుంటాడా లేదా అనే సందిగ్ధంలో ఓ ఇంటర్వల్.


కొన్ని ఫ్లాష్ బ్యాక్ లు జతచేసి చక్కటి స్క్రీన్ ప్లే తో మళ్లీ జరుగుతున్న కథలోకి తీసుకురావడంలో దర్శకుడు దిట్ట. ఈ సంఘటన జరగక ముందు మన అవినాష్ కి తాను వెతుకుతున్న జును ప్రియగా పరిచయం అవుతుంది. అదే రోజున ఫ్లైట్ లో రమ్యకృష్ణ కు కూడా పరిచయమవుతుంది ప్రియ. ఆ పరిచయం మళ్లీ ఓ కొత్త స్నేహంగా మారుతుంది. తమ తమ చిన్ననాటి ప్రేమకోసం అవినాష్, ప్రియాలిద్దరూ వారి స్నేహాన్ని ప్రేమగా మార్చుకోరు. మళ్ళి కథ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకు వచ్చి అవినాష్ క్యాబ్ డ్రైవర్ ద్వారా తను విన్న వైలన్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లోదని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళి అందరిని అడుగుతాడు. అదే సమయానికి ప్రియ కూడా మ్యూజిక్ ఫెస్టివల్ కి వస్తుంది. అవినాష్ చేసేదిలేక తనకు, జునుకు తెలిసిన ఆ వైలన్ ట్యూన్ ని ప్లే చేస్తాడు. అనుకోకుండా ఇన్నేళ్లు అజ్ఞాతంలో దాగివున్న ఆ వందనోటు ఒక్కసారి ఎగిరి అవినాష్ కి చేరుతుంది. ఈ రెండు సన్నివేశాలతో క్లైమాక్స్ దగ్గర పడిందని ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఎంతోకాలం నుంచి శ్రీను ఫోన్ కోసం ఎదురుచూస్తున్న జును కి హలో అంటూ కాల్ చేసి కథని సుఖాంతం చేస్తాడు దర్శకుడు. ఫ్రెండ్స్ అయిన అవినాష్-ప్రియలు ఇప్పుడు ప్రేమికులయిన  శ్రీను- జును మారతారు. వ్రాసిపెట్టి ఉంటే ఎక్కడవున్నా కలవక తప్పదని ఓ వాయిస్ ఓవర్ ఇంగ్లీష్ లో పాస్ అవుతూ వుంటుంది స్క్రీన్ మీద.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సినిమాటోగ్రఫీ అద్భుతః. సినిమాటోగ్రాఫర్ వినోద్ ని ఎంతైనా అభినందించవచ్చు. 


ఇక సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ మనం సినిమాలాంటి ఆహ్లాదమైన సంగీతాన్ని అందించాడు. అఖిల్ పాడిన ఏవేవో కలలు కన్న పాట బాగుంది. 

ఇక మన మనం దర్శకుడు గురించి. సున్నితమైన ప్రేమ కథలని, మరపురాని జ్ఞాపకాలతో ముడిపెట్టి వెండితెరపై ప్రేమకావ్యాలుగా మారుస్తాడు. అదే కాన్సెప్ట్ తో అఖిల్ తో ప్రయోగం చేసాడు విక్రమ్. ఇది కచ్చితంగా ప్రయోగమనే చెప్పాలి. ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా కుటుంబ విలువల్ని కాపాడుతూ ఇద్దరు ప్రేమికులు పడే తపన చాలా బాగా చిత్రీకరించాడు. కాకపోతే మరీ ఇంత పద్ధతైన ప్రేమ కథ మల్టీప్లెక్స్  ఆడియన్స్ కి మాత్రమే చేరగలదని చెప్పచ్చు. 


శ్రీను-జునుల మధ్య చిన్ననాటి స్నేహాన్ని, రమ్యకృష్ణ- జగపతి బాబుల మధ్య శ్రీను వచ్చిన తరువాత అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని వాళ్ళు పడే తపనని కళ్ళు చమర్చేలా చిత్రీకరించాడు గాని థియేటర్ లో కూర్చున్న మాస్ ఆడియన్స్ కి కాస్త విసుగ్గానే అనిపిస్తుంది. మొత్తానికి మరో సున్నితమైన ప్రేమ కథని మన ముందుంచాడు విక్రమ్.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


అఖిల్ చాలా సహజంగా నటించాడు. ప్రేమ కథలకు ఈ తరం నాయకుడు అఖిల్. 


హీరోయిన్ ప్రియదర్శిని విషయానికొస్తే ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత ప్రయత్నం చేసినా కనపడలేదు. తినొక మైనస్ సినిమాకి. 


రమ్యకృష్ణ- జగపతి బాబులు పోటీపడి నటించారు. కొన్ని సీన్స్ లో మనకి తెలీకుండానే కళ్ళెంబడి నీళ్లొస్తాయి. 


ప్రవీణ్, కృష్ణుడు, వెన్నెల కిషోర్, విలన్ అజయ్ లు కథని ముందుకు నడిపిస్తారు.


HELLO !!!

Telugu Movie Review & Rating

తెలుగు వేదిక రేటింగ్

Genre : Romantic action movie​
Target : 
All Akkineni fans​
Story line:  
నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఒకటవుతుంది​
Rating : 2
/4 (ఫరవాలేదు)

Banner      :
 Annapurna Videos  
Producer  :  
Nagarjuna​
Story &Direction   : 
Vikram k Kumar


అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శిని, జగపతి బాబు, రమ్య కృష్ణ, అజయ్  ముఖ్య పాత్రలు పోషించిన హలో మూవీ చిత్ర విశేషాలు.

​​
Release Date : 22nd Dec, 2017. 


 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది