అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Gentleman

Telugu Movie Review & Rating

తెలుగు వేదిక రేటింగ్


​కథలోకి వెళితే : 


మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన నాని, తన సహజ నటనతో ఆకట్టుకున్నడనే చెప్పాలి.


ఇక కథ మొదలుపెడితే కేథరిన్(నివేదా థామస్), ఐశ్వర్య(సురభి) తో కథ మొదలువుతుంది, ఇద్దరూ లండన్ ఎయిర్ పోర్ట్ లో ఫ్రెండ్స్ అవుతారు. హైదరబాద్ వచ్చేవరకు ఎలా టైం పాస్ చేయాలో తెలీక ఇద్దరి ప్రేమకథలు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఈ మాటల్లో ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది. అక్కడ కేథరిన్ కు మొదటి షాక్, తను ప్రేమించిన వ్యక్తి గౌతం(నాని), ఐశ్వర్య ప్రేమికుడి జయరామ్(నాని) గా పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకేలా వున్నారా?? ఒకరేనా అనే సందేహంతో గౌతం ఇంటికెళ్ళి చూసేసరికి గౌతం ఆక్సిడెంట్ లో చనిపోయేడనే విషయం తెలుస్తుంది. తన ప్రియుడిది ఆక్సిడెంట్ కాదు హత్య అని ఒక రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న కేథరిన్, తన మావయ్యే గౌతంని చంపి ఉంటాడని అనుమానించి, మావయ్య డేవిడ్ దగ్గరకి వెళ్ళేసరికి, కోమాలోవున్న తన మావయ్యను దగ్గర జయరామ్ కపిస్తాడు. ఒకవైపు ఐశ్వర్యతో జయరామ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఐశ్వర్య గ్రూప్స్ లో ఒక పార్టనర్ అయిన వంశీ(అవసరాల శ్రీనివాస్) వీళ్ళిద్దరి పెళ్ళికి ముఖ్య పాత్ర వహిస్తాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కి బ్రేక్ వేస్తూ ఓ ఇంటర్వల్.

సెకండ్ హాఫ్ నుంచి కథ కేథరిన్, జయరామ్, వంశీ చుట్టూనే తిరుగుతుంది. తన మావయ్య డేవిడ్ కొమాలోంచి బయటకి వస్తే ఈ హత్యకు గల కారణం తెలుసుకోవాలని చూస్తున్న కేథరిన్ కు నిరాశే మిగులుతుంది. డేవిడ్ కూడా హత్యకు గురవుతాడు.  ఇన్ని హత్యలకు పాల్పడ్డ జయరాంమీద కసితో కేథరిన్ కావాలని కబ్బోర్డ్ లో జయరామ్ బట్టలు పెట్టి ఐశ్వర్య కి అనుమానం వచ్చేలా చేస్తుంది. ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ ఈ  క్రైమ్ లో హీరోయే విలన్ అనుకునే సందర్భంలో  జయరామ్ ముసుగులో వున్నది  గౌతమ్ అన్ని తెలుస్తుంది. ట్రెక్ స్పాన్సర్  షిప్ నిమిత్తం జయభేరి ఇండస్ట్రీస్ ఎండి ని కలవాడానికి వెళ్ళిన తను అనుకోకుండా జయరాం హత్యలో ఇరుక్కున్నానని,  మేమిద్దరం ఒకేలా వున్నా కారణంగా జయరాం గా నటించవలసి  వస్తోందని, దీని వెనుక వంశీ హస్తం వుందని చెప్పడంతో కథలో అన్ని సస్పెన్సులు వీడిపోయి కథ సుఖంతమవుతుంది.  


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టిన విందా పనితీరు బావుంది. గౌతం- కేథరిన్ ల ప్రేమ సన్నివేశాలను, జయరాం- ఐశ్వర్య ల కులుమానీలీ దృశ్యాలను చాలా అందంగా చూపించాడు. 

సంగీత దర్సకత్వం వహించిన మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్, సంగీతం ఫరవాలేదు.

ఇక దర్శకత్వ బాధ్యతలు వహించిన మన దర్శకుడు ఇంద్రగంటి మోహన శర్మ. ఒక క్రైమ్ కథని ఇతివృత్తంగా చేసుకుని, నానితో ద్విపాత్రాభినయం చేయించి, ప్రేమ, సస్పెన్స్ లను మేళవించి చేసిన ప్రయత్నం బావుంది. సెకండ్ హాఫ్ మొత్తం క్రైమ్ చుట్టూనే తిరిగింది కథ, కాస్త కామెడీ టచ్ చేసి వుంటే ఇంకా బావుండేది. ఫస్ట్ హాఫ్ లో గౌతం, జయరాం పాత్రలలోని హాస్యాన్ని బాగా ఉపయోగించుకున్నాడు ఇంద్రగంటి. నివేదా, సురభి లు రెగ్యులర్ బబ్లీ పాత్రలు కాకుండా  కథకి ప్రాధాన్యమున్న పాత్రలు ఇవ్వడం శ్లాఘనీయం.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


గౌతం, జయరామ్ గా ద్విపాత్రాభినయం చేసిన నాని అలరించాడు. సహజమైన కామెడీ టైమింగ్ వున్న నాని విలనిజం వున్న క్యారెక్టర్లో జయరాం గా ఒదిగిపోయాడు. 

ఇక నివేద, సురభీలకు కథకు ప్రాధాన్యమున్న పాత్రలలో ఒదిగిపోయేరనే చెప్పాలి.

మిగతా పాత్రలలో చెప్పుకో తగ్గవి అవసరాల శ్రీనివాస్ మరియు రోహిణీలు బాగా నటించారు.

మిగతా పాత్రలు పాత్రకు తగ్గ సందర్భమే.

ప్లస్ పాయింట్స్:

నాని ద్విపాత్రాభినయం 


 ఫస్ట్ హాఫ్ కామెడీ అండ్ రొమాన్స్ 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మొదటి భాగాన్ని చక్కటి ప్రేమ, హాస్యంతో ముందుకు సాగించి, సెకండ్ హాఫ్ మొత్తం ఓ క్రైమ్ చుట్టూ తిరిగేలా చేయడం. సెకండ్ హాఫ్ లో నాని లో వున్నా టైమింగ్ కామెడీ మిస్ అయ్యింది, మంచి లాజిక్ ఉపయోగించి తనేం చెప్పదలుచుకున్నాడో దర్శకుడు చెప్పినా కామెడీ మిస్ అవ్వడంతో ప్రేఖకుడికి బోర్ కొట్టక తప్పలేదు.మొత్తానికి సినిమాని ఒకసారి చూడచ్చు.

Genre : Love &Crime thriller  
Target: All natural star fans.

Story line:తనది కాని ఓ హత్యని మీద వేసుకుని కష్టాలు పడ్డ ఓ యువకుడి కథే ఈ జెంటిల్ మాన్.   

Rating :2/4 (ఫరవాలేదు).

Banner          :శ్రీదేవి మూవీస్ 
Producer      : శివలంక కృష్ణ ప్రసాద్. 
Direction       :ఇంద్రగంటి మోహన శర్మ 


నాని, నివేదా ధామస్, సురభి, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, రోహిణి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రోహిణి, రమాప్రభ, ఆనంద్, ప్రగతి ముఖ్య తారాగణంగా నటించిన జెంటిల్ మాన్ సంగతులు మీకోసం. 


Release Date : 17th, June 2016.

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది