అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Genre : Emotional Family Drama /Action
 

Actors: Mohan Babu, Manchu Vishnu, Shriya Saran, Nikhila Vimal


Story line:
తన కుటుంబం కోసం జీవితంలో, రంగస్థలం పైనా నటించి గెలిచిన ఓ నటుడి కథే ఈ గాయత్రి.


Rating : 2
/4(ఫరవాలేదు)

Director    : Madan
Music:
S Taman

Banner: Sri Lakshmi Prasanna Pictures

Release Date : 
9th Feb, 2018. 

GAYATRI

Telugu Movie Review & Rating

తెలుగు వేదిక రేటింగ్


విలక్షణ నటనకు, డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరు మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. నిర్మాతగా, నటుడిగా తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న  57వ చిత్రం గాయత్రి. టైటిల్ వినగానే కుటుంబ కథా చిత్రమని చెప్పనక్కర్లేదు. మూవీ స్టిల్స్ ని బట్టి చూస్తే పవర్ ఫుల్ రోల్ లో భారీ డైలాగ్స్ చెప్పారని తెలుస్తూంది. రండి కథ ఎలా వుందో చూద్దాం


​కథలోకి వెళితే :



130 మంది హత్యకు కారణమైన దాసరి శివాజీకి ఉరిశిక్ష. ఎలా ఏంటి?? ఓ TV ఛానల్ రిపోర్టర్ అనసూయ శివాజీపై ఆర్టికల్ రాస్తూ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. తన భార్య శారద(శ్రియా) పేరుతో శారదా సదన్ అనాధాశ్రమాన్ని నడుపుతూ పసిపిల్లల్ని చదివిస్తూ ఉంటాడు మన స్టేజ్ ఆర్టిస్ట్ శివాజీ. భూసేకరణ పేరుతో ఖాదర్ భాయ్ శారదా స్థలాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు.


ఇక్కడ మొదలవుతుంది కథలో మొదటి సమస్య.శివాజీకి మామూలుగా మొదటి పేజీ నటుడు,  కోపమొస్తే రెండో పేజీ ఉగ్రనరసింహుడు. మంత్రి పృథ్వి నెమలి మాంసాన్ని తిని మీడియాకు దొరికి పోవడంతో మంత్రి బదులు మన శివాజీ మంత్రి వేషంలో రిమాండ్ లో ఉంటాడు. ఈ విషయం మన జర్నలిస్ట్ అనసూయ కనిపెట్టడంతో శివాజిని ఫాలో అవుతుంది. ఇక శివాజీ పర్సనల్ లైఫ్లో భార్య ని పొగుట్టుకుని తప్పిపోయిన కూతురికోసం వెతుకుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే అదే ఊర్లో ఉన్న కూతురు గాయత్రి( నిఖిల్ విమల) డాక్టర్ చదువుతున్నా తెలియని పరిస్థితి. కథలో మరో ట్విట్ తన కూతుర్ని కొంతమంది చంపడానికి ట్రై చేస్తుంటారు. గాయత్రిపై ఒక్కసారి మర్డర్ అటెంప్ట్ జరిగితే కాపాడే క్రమంలో తాను కాపాడింది తన కూతురని తెలుస్తుంది. ఇకపై నిజాయితీగా బ్రతకాలనుకుని పాత జీవితానికి స్వస్తి చెపుతాడు. తీరా కూతురు దగ్గరకెళ్లి తనే తండ్రని చెప్పేంతలోపే చిన్నప్పుడే వెయ్యి రూపాయలకు అమ్మేసిన తన తండ్రంటే అసహ్యమని గాయత్రి చెప్పిన మాటలువిని ఆ ప్రయత్నం మానుకుంటాడు. మన శివాజీ పాత జీవితం ఏంటని తెలుసుకునే లోపే ఓ ఆ సస్పెన్సు కి బ్రేక్ ఇస్తూ ఓ ఇంటర్వల్.


 ఇంటర్వల్ తరువాత యువ శివాజీ (మంచు విష్ణు ) దర్శనమిస్తాడు. ఓ ఊరి నాటకానికి వెళ్లి ప్రెసిడెంట్ కూతురు గాయత్రితో ప్రేమలో పడతాడు. పెళ్ళితో ఒకటవుతారు. వీరిద్దరి మధ్య సన్నీ వేషాలు ఆకట్టుకునేలా తీసాడు దర్శకుడు. అప్పుడే శివాజీ లైఫ్ లో నటించడం మొదలుపెడతాడు. భార్య ఆపరేషన్ నిమిత్తం తనమీద ఒక తప్పు వేసుకుని ఒకడి వేషంలో జైలుకు వెళతాడు. తీరా వచ్చేటప్పటికి గాయత్రి చనిపోతుంది, పాపని ఎవరో తీసుకెళ్లిపోతారు.


కథ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకు వచ్చి అసలు నిజం తెలుస్తుంది గాయత్రికి. తండ్రిని కలవడానికి వెళుతుంటే కథలో మరో మలుపు మోహన్ బాబు డబుల్ రోల్ లో నటించిన  మంత్రి గాయత్రి పటేల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.  ఈ గాయత్రి పటేల్ చేసిన తప్పుకు మన శివాజీ అతని వేషంలో  జైలుకు పంపిస్తారు. కూతరు గాయత్రిపై జరిగే హత్యా ప్రయత్నానికి ఓ విధంగా గాయత్రి పటేల్ కారణం. శివాజీకి ఉరిశిక్ష వేస్తారు.


 ఇక మిగిలింది క్లైమాక్స్. జర్నలిస్ట్ అనసూయ ఈ మిస్టరీని ఎలా మీడియాకి చేరుస్తుంది.మన నాటకాల శివాజీ, రాజకీయ నాయకుడు శివాజీ పటేల్ కు మధ్య జైలులో జరిగిన సంఘటనలు దర్శకుడు చాలా ఆశక్తిగా తీసాడనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.ఇక శివాజీ ఎలా బయటపడ్డాడనేదే మిగిలిన కథ. క్లైమాక్స్ చాలా ఆశక్తి కరంగా తీర్చిదిద్ది దర్శకుడు కథని సుఖాంతం చేసిన విధానం బాగుంది.



టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :



మోహన్ బాబు సినిమా అంటేనే డైలాగ్స్. మాటల రచయిత డైమండ్ రత్నబాబు సంభాషణలు కథా బలాన్ని పెంచాయి. 
సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. 


సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి ప్లస్ పాయింట్. 


ఇక దర్శకుడు మదన్. కొత్త కథ కాకపోయినా కథనాన్ని చాలా బాగా నడిపించాడు. కథనం పాడవకుండా మోహన్ బాబు ద్విపాత్రాభినయం, విష్ణు పాత్రల చిత్రీకరణ బావుంది. మోహన్ బాబుపై ఫస్ట్ హాఫ్ లో తీసిన సాంగ్స్ ప్రేక్షకులకి కాస్త అసహనం మిగిల్చినా సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా గాయత్రి పటేల్ పాత్రతో మెప్పించగలిగాడు.



ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

విలక్షణతలో మోహన్ బాబు పెట్టింది పేరు. నటుడు శివాజీగా, మంత్రి గాయత్రి పటేల్ గా మన డైలాగ్ కింగ్ అద్భుతంగా నటించారు. సెకండ్ హాఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది అంటే దానికి గాయత్రి పటేల్ నటనే కారణం. చాలా రోజుల తరువాత నాటకాల్లో పద్యాలు చెప్పి డైలాగ్ కింగ్ అలరించారు. 


ఇక మన మంచు విష్ణు. యంగ్ మోహన్ బాబుగా బాగా నటించాడు. 


శ్రీయ, నిఖిల విమల్ పాత్రలు కథా బలాన్ని పెంచేలా ఉన్నాయి. 


నటులు పోసాని, శివ ప్రసాద్, సత్యం రాజేష్, నాగినీడులు నటన బాగుంది.


జర్నలిస్ట్ శ్రేష్ఠ గా అనసూయ మొదటి నుంచి చివరివరకు మంచి రోల్ పోషించింది.


 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది