అక్షర తోరణం ప్రత్యేక సంచిక
CHALO
Telugu Movie Review & Rating
బాగాలేదు
ఫరవాలేదు
బావుంది
చాలా బావుంది
తెలుగు వేదిక రేటింగ్
కథలోకి వెళితే :
మన కథానాయకుడు హరి( నాగశౌర్య)కి గొడవలంటే ఇష్టం. ఎక్కడ గొడవైతే అక్కడ డబ్బులిచ్చి మరీ గొడవల్లో పాల్గొంటాడు.
ఈ టార్చర్ పడలేక శౌర్య తండ్రి నరేష్ అన్ని ప్రయత్నాలు చేసి చివరకు అరుణాచలం ఫార్ములా ఫాలో అవుతాడు. గొడవలు ఉన్న చోట పెడితే ఆ అల్లర్ల మధ్యలో రాముడిలా మారతాడేమోనని బాగా వెతికి వెతికి ఆంధ్ర-తమిళ్ నాడు బోర్డర్ లో తిరుప్పురం అనే కాలేజ్ కి బలవంతంగా నెట్టేస్తారు. తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు అక్కడ ఎక్కడ చూసినా గొడవలే. ఊరి మధ్యలో ఓ కంచె, తమిళోడు కంచె దాటి అటు రాకూడదు, తెలుగోడు ఆ కంచె వైపే చూడకూడదు. ఇక కాలేజ్ లో సైలెంట్ గా పెద్ద యుద్ధమే జరుగుతుంది.
వైవా హర్ష తెలుగు బ్యాచ్, సత్య తమిళ్ బ్యాచ్. కాలేజ్ లోకి వస్తూనే ఓ తెలుగోడితో ఫైట్ చేసి తమిళ బ్యాచ్ సత్యకి దగ్గరవుతాడు. హరి తమిళోడనుకుని తన రూంలోనే చోటిస్తాడు. రావడంతోనే తెలుగుపిల్ల కార్తీక(రష్మీక) తో ప్రేమలో పడతాడు.
ఇక ఊళ్ళోకొస్తే వీరముత్తు, కేశవ మూర్తి మధ్య గొడవలు ఊరి పెద్దకి తలనొప్పిగా మారతాయి. ఒకరి ఎరియాలోకి ఒకరు వస్తే చంపేసుకునే కక్షలు పెంచుకుంటారు. సత్య బ్యాచ్ ఆల్మోస్ట్ హరిని తమ తంబి అనుకుని నమ్మేస్తుంది ఒక్క ముక్క తమిళ్ మాట్లాడక పోయినా.
ఇక్కడే కథలో చిన్న ట్విస్ట్. తనపై దాడి చేసిన గొడవని అడ్డుగా పెట్టుకుని కేశవమూర్తికి దగ్గరవుతాడు హరి కార్తీక కోసం. ఇంటికి భోజనానికి పిలిస్తే మన సత్యని వెంటబెట్టుకుని వెళతాడు. ఇంట్లోకి వచ్చేవరకు తెలీదు కార్తీక వీరముత్తు కూతురిని, తమిళ పోరీ అని. ఇంకో షాక్, హరి తంబి కాదని తెలుగు తమ్ముడిని సత్యకి తెలుస్తుంది. ఒక్కసారి యుద్ధ వాతావరణం. కత్తులు మెడచుట్టూ. ఆడియన్స్ కి హై బీపీతో ఓ ఇంటర్వల్.
మొత్తానికి సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుని బయటపడతారు ఇద్దరు. ఇప్పుడు హరికి గొడవలకన్నా ముఖ్యం కార్తీక కోసం మామ వీరముత్తు మనసు గెలవడం. ఆంధ్రావాడు తమిళోడి అల్లుడైతే ఆ కిక్కే వేరని కేశవమూర్తి హరికి సపోర్ట్ చేసి ఊరంతా రచ్చ చేస్తాడు. ఈ గొడవలో అటు కాలేజ్ లోనూ, ఇటు ఊళ్లోనూ ఓ మంటే రేగుతుంది. ఈ గొడవల్లో కాలేజ్ అంతా ఒక్కటవుతారు కానీ ఊరు ఇంకా వేడిగానే ఉంటుంది. వీరముత్తు వీరావేశంతో వెన్నెల కిషోర్ ని అల్లుడుగా సంబంధం కుదుర్చుకుంటాడు. హరితో సంబంధం లేకపోయినా వెన్నెల కిషోర్ హరిపై తీర్చుకునే సైకాలాజికల్ రివెంజ్ ఫుల్ కామెడీ పండిస్తాడు. ఏ దారిలేక ఊళ్ళో జనాల్ని కలిపే పనిలో పడతాడు హరి. మొత్తానికి ఓ సింపుల్ లాజిక్ తో ఊళ్ళో పగ పంతాల మధ్య తన ప్రేమని గెలిపించుకుని ఊరినే ఒకటి చేస్తాడు హరి.
టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :
మహతి స్వర సాగర అందించిన సంగీతం నేటి యూత్ ని ఆకట్టుకుంటూనే వినసొంపుగా ఉన్నాయి.
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కారెక్టర్స్ లోని ఎమోషన్స్ ని ఆడియన్స్ కి రీచ్ అయ్యాలా చేసాడు.
ఇక కథ, మాటలు, దర్శకత్వం తో తన ప్రతిభ చాటిన వేణు ఎంచుకున్న కథలోని కామెడీ చూపించి , హీరో పాత్రే కాదు సినిమాలో ప్రతి పాత్రలోనూ ఎమోషనల్ కామెడీ పండించి జంధ్యాలను గుర్తు చేసాడు.
ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తమిళ, తెలుగు పాత్రల మధ్య పండించిన కామెడీ అదరహో. చాలా రోజుల తరువాత సినిమా మొత్తం బోర్ కొట్టకుండా సిట్యుయేషనల్ కామెడీ పండిన సినిమా ఇదే కావచ్చు
ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:
సినిమాకి కథానాయకుడు నాగశౌర్య అయినా అతనితో సమానంగా ఉన్న కారెక్టర్ సత్యది. సత్య ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులకి నవ్వులు తెప్పించాయి. తమిళ యాసలో తెలుగు పండించి మొత్తం క్రెడిట్ కొట్టేసాడు.
హీరో నాగశౌర్య అందంగా వున్నాడు, నటనలో అంతే ఈజ్ కనపరిచాడు.
హీరోయిన్ రష్మీకకు మొదటి సినిమా అయినా మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచింది.
ఇక వైవా హర్ష, వెన్నెల కిషోర్, మచ్చ, పోసాని, రఘుబాబుల పాత్రలు నవ్వులే నవ్వులు పండించారనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్:
డైరెక్టర్ స్క్రీన్ ప్లే
తెలుగు తమిళ్ స్టూడెంట్స్ మధ్య నలిగిపోయే సత్య స్పెల్ బౌండ్ పెర్ఫార్మెన్స్
కాలేజ్ సీన్స్
శౌర్య.. రష్మీక మధ్య కెమిస్ట్రీ
మైనస్ పాయింట్స్ :
భూతద్దంలో పెట్టి చూడద్దు. కథ, కథనం, పాత్రలు అన్నీ బాగున్నాయి.
Genre : Action, comedy, entertainer.
Target : all comedy lovers
Story line: ప్రాంతాల లొల్లి మధ్య ఓ ప్రేమ పక్షుల కథే ఈ ఛలో
Rating : 3/5 ( బాగుంది)
Producer : Usha Mulpuri
Director : Venky Kudumula
Release Date : 2nd Feb, 2018.