అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్

OVER SENTIMENT+ LARGE DIALOGUES   = BRAHMOTSAVAM. 

కథలోకి వెళితే :

 ఓపెనింగ్ సీన్ తిరుమల బ్రహ్మోత్సవాలలో సమంతాతో మొదలవుతుంది కథ. అక్కడే మన కథానాయకుడు మహేష్ ని చూస్తుంది.
అసలు కథలోకి వెళితే ఓ అందమయిన ఉమ్మడి కుటుంబం. ఇంటిపెద్ద చంటిబాబు(సత్యరాజ్), ఇంటి మహాలక్ష్మి( రేవతి).బావగారికి నలుగురు బావమరుదులు, వారి భార్యలు, బిడ్డలతో కళకళలాడే ఫామిలీ. వీళ్ళల్లో పెద్దబావమరిది రావురమేష్, ఆయన భార్య రాజ్యలక్ష్మి(జయసుధ). రావు రమేష్ కి ఒక అసంతృప్తి. బావ నీడలోనే జీవితం వెళ్ళిపోతూందని, కష్టపడినా తనకు గుర్తింపు రావటంలేదని. సినిమాలో ఈ సన్నివేశం నుంచి ముగింపు వరకు ట్విస్టులు, మలుపులు అన్నీ ఈ కుటుంబాల మధ్యే. ప్రేమ, పగ, ఆప్యాయతలు, అనుబంధాలు అన్నీ వీళ్ళమధ్యే. వీళ్ళమధ్యలో మొత్తం కుటుంబానికి ఆనందం పంచి తల్లో నాలుకలా అందరిని కలుపుకుపోయే మన కథానాయకుడు మహేష్. ఆనందంతో పాటు ఎక్కువగా ఆలోచించడు, నచ్చింది చేసేస్తాడు. అలాగే వరసకి మరదలు, చుట్టాలమ్మాయ్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కాజల్ తో ప్రేమలో పడతాడు.  

కథలో ఎప్పుడో జరిగే పెద్ద సంఘటనకి చిన్న ఎంట్రీ సీన్ జయప్రకాశ్ రెడ్డి వచ్చి చంటిబాబు sheeniloc colors ఫ్యాక్టరీని కొనాలనుకోవడం. చంటిబాబు ఒప్పుకోడు. అదే సమయంలో రావురమేశ్ అసంతృప్తి తీరాడానికి తన కూతుర్ని మహేష్ కి ఇవ్వాలనుకుంటాడు. కాని సీన్ రివర్సయి మన మహేష్ కాజల్ ప్రేమలో పడతాడు. రెండునెలల ఇండియాకి వచ్చిన కాజల్ కి మహేష్ నచ్చుతాడు గాని ఉమ్మడి ఫామిలీతో కలిసి వుండడం నచ్చదు. మహేష్ తో లవ్ బ్రేక్ అప్ చేసుకుంటుంది. మరో వైపు వీరి ప్రేమ విషయం చూసిన  రావురమేష్ కడుపులోవున్న మంటని అందరిముందే బయటపెట్టి గొడవపెట్టుకుని ఉమ్మడి కుటుంబంనుంచి  వెళ్ళిపోతాడు. తన పెద్దబావమరిది దూరమయిపోతున్నారన్న బెంగలో  చంటిబాబు చనిపోవడం,అంతులేని సెంటిమెంట్ మధ్య, మంచిమాట చెప్పే తండ్రి  దూరమవ్వడంతో  చెప్పలేని విషాదంలోకి వెళ్ళిపోతారు మహేష్ తో పాటు కుటుంబసభ్యులు. ప్రేక్షకులకి చిన్న రిలీఫ్ ఇస్తూ ఓ ఇంటర్వల్.

సెకండ్ హాఫ్ సమంతా ఎంట్రీ. అచ్చం మహేష్ లాంటి మనసు. అందరిని కలుపుకుపోతుంది. కుటుంబ విలువలన్నా, ఉమ్మడి కుటుంబమన్నా చాలా ఇష్టం. కథలో కొంత హుషారు. రావు మావయ్యని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించిన మహేష్ కి నిరాశే ఎదురవుతుంది. మధ్యలో సమంతా, మహేష్ లు కలిసి చేసే సందడి. కొత్తగా చిగురించిన ప్రేమతో ఓ యుగళగీతం ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా.  ఇక్కడే కథ కొత్తకోణంలో చూపిస్తాడు దర్శకుడు. తండ్రి బ్రతుకున్నప్పుడు తన తరపు బంధువుల గురించి చెప్పిన మాటలు గుర్తొస్తాయి మహేష్ కి. సినిమా చూసే ప్రేక్షకులకి సయితం అర్థంకాని పయనం చేస్తాడు మహేష్ తమ ఇంటిపేరుగల వారికోసం సమంతాతో కలసి. ఉన్న ఉమ్మడి కుటుంబం చాలదన్నట్టు చంటిబాబు అన్నదమ్ముల కోసం నాగపూర్ వెళతారు మహేష్, సమంతలు. అక్కడ కష్టాల్లో ఉన్న అత్తని కలుస్తారు.  అక్కడనుంచి లక్నో వెళ్లి కజిన్ వరుస వెన్నెల కిషోర్ ని కలుస్తారు. మహేష్ చుట్టాల వేట హరిద్వార్ నుంచి కాశీకి వెళుతుంది. అక్కడ పండితుల్ని కలుస్తారు తమ ఇంటిపేరు వున్నా వారికోసం. జర్ని చిన్నాన్న వరుసైన నాజర్ ని, దూరపు బంధువు ముకేష్ ఋషిని కలవడంతో కథ ప్రీ క్లైమాక్స్ కి వస్తుంది. ఈ సీన్స్ మొత్తం ప్రేక్షకులని ఆహ్లాదపరుస్తాయి. సమంతా మహేష్లు దాదాపు ప్రేమలో పడతారు. పంతంకొద్దీ రావు రమేష్  తనకూతురు ప్రణీతని వేరే సంబంధం చూసి పెళ్లిఖాయం చేస్తాడు. ప్రేక్షకులు ముందుగానే ఊహించని క్లైమాక్స్ లో భారీ డైలాగ్స్ , భావోద్వేగాల మధ్య రావు రమేష్ తన తప్పు తెలుసుకుని మహేష్ కుటుంబంలో మళ్ళీ ఒకడవుతాడు.   

టోటల్ గా అందరూ కలిసి వుంటే ఓ పండుగ. ఆనందంగా వుంటే అదే పెద్దసందడి. అదే బ్రహ్మోత్సవం.

టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

సినిమాటోగ్రఫి రత్నవేలు గురించి. సినిమాలో కాస్టింగ్ ఎక్కువగా వున్నా ప్రతీ ఫ్రేమ్ ని అందంగా చూపించారు.

సంగీత దర్సకత్వం వహించిన మిక్కీ జె మేయర్ వీనులవిందయినా సంగీతం అందించాడనడంలో సందేహంలేదు.

ఇక కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు వహించిన మన దర్శకుడు శ్రీకాంత్ అద్దాల గురించి. ఉమ్మడి కుటుంబం, కుటుంబవిలువలు పదికాలాల పాటు పదిలంగా వుండాలనే మంచి భావంతో ఎంచుకున్న కథ. కాకపొతే స్క్రీన్ ప్లే బాగా నెమ్మదిగా, ఆ కుటుంబసభ్యుల మధ్యే తిరగేలా చేసాడు.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:
మహేష్ బాబు. మొత్తం సినిమాని తన భుజాలపై కాదు ఏకంగా తలపైనే పెట్టుకున్నాడు. ఇక హీరోయిజాన్ని పక్కన పెట్టి ఉమ్మడి కుటుంబంలో ఒకడిగా కలిసి తనవరకు మంచి నటన ప్రదర్శించాడు. ఇక అందంలో చెప్పనక్కర్లేదు. అబ్బాయిలే అసూయపడేంత అందగాడు.

ముగ్గురు కథానాయికలు సమంతా, కాజల్, ప్రణీత చక్కటి నటన ప్రదర్శించారు.

సత్యరాజ్, రేవతి, జయసుధల నటన బావుంది.  ప్రేత్యేకంగా రావు రమేష్ గురించి చెప్పాలి. అసూయతో బాధపడే వ్యక్తిగా అద్భుతంగా నటించాడు.

ఇక మిగిలిన నటులంతా తమ తమ పాత్రలలో దర్శకుడి ఆలోచనకి తగ్గట్టు నటించారనే చెప్పాలి.  


ప్లస్ పాయింట్స్:

మహేష్ నటన 


బాల త్రిపురమణి నడుంతిప్పుకుని పాట, బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్,


సెకండ్ హాఫ్ లో మహేష్, సమంతల జర్నీ.


మైనస్ పాయింట్స్ :

కథనం 


దర్శకత్వం


భారీ భావోద్వేగాలు 


సంఘర్షణ లేని సెంటిమెంట్ తో పాత్రలచేత భావోద్వేగాలు పలికించాలనుకోవడం.

ప్రేక్షకులకి అర్థంకాని పొడుగు డైలాగులు.
Brahmotsavam

Telugu Movie Review & Rating

Genre :Family drama & Love 
Target:
All Mahesh babu fans

Story line:
విడిపోయిన బావమరిది కోసం బావ ఆరాటం. వీళ్ళిద్దరిని కలపడంకోసం కథానాయకుడి పోరాటం. ఇదే అందరూ కలిసుండాలనే కుటుంబోత్సవం, బ్రహ్మోత్సవం.   

Rating :2/4 (ఫరవాలేదు).

Banner         : MB productions
Producer      : PVP
Story & Direction : Sreekanth Addala

మహేష్ బాబు, కాజల్, సమంతా, సత్యరాజ్, రేవతి, రావు రమేష్, జయసుధ, తులసి,కృష్ణ భగవాన్, నరేష్, జయప్రకాష్ రెడ్డి, నాజర్, వెన్నెల కిశోర్ లు ముఖ్య పాత్రలుగా నటించిన మొత్తం కుటుంబం కలిసి చూసే చిత్రం బ్రహ్మోత్సవం గురించి నాలుగు మాటలు. 


Release Date : 20th, May 2016.

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది