అక్షర తోరణం ప్రత్యేక సంచిక
తెలుగు వేదిక రేటింగ్
Genre : Action & message
Target: సంప్రదాయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకి మరియు ఉపేంద్ర అభిమానులకి.
Story line: అనాదిగా వస్తున్న ఆలయ వంశ పారంపర్య అర్చకత్వం ఒక బాధ్యత, అస్తిత్వం అనే ఓ విప్రుడి గాధే ఈ బ్రాహ్మణ.
Rating :2/4 (ఫరవాలేదు).
Banner : విజి చెరిష్ విజన్స్ & తారక రామ బానర్స్
Producer : మహేష్ చౌదరి & విజయ.ఎం
Story &Direction : శ్రీనివాస రాజు.
ఉపేంద్ర, సలోని అశ్విన్, రాగిణి ద్వివేది, రవి శంకర్ తారాగణంగా నటించిన బ్రాహ్మణా చిత్ర విశేషాలు.
Release Date : 8th, July 2016.
Brahmana
Telugu Movie Review & Rating
బాగాలేదు
ఫరవాలేదు
బావుంది
చాలా బావుంది
కథలోకి వెళితే :
చాలా రోజుల తరువాత ఓ కులం పేరు మీద వచ్చిన సినిమా. ఉపేంద్ర లాంటి కన్నడ సూపర్ స్టార్ ధైర్యంతో చేసిన సినిమా. ఈ రోజుల్లో సనాతన ధర్మానికి వారధి లాంటి బ్రాహ్మలు తమ కులవృత్తిని విడిచి వేరే ఉద్యోగాలు చూసుకోవడం వల్ల మన హిందూ ధర్మ ప్రతిష్ట దెబ్బతింటూదన్న అంశానికి కొంత మషాలా కలిపి తీసిన సినిమా.
ఇక కథలోకి వెళితే ఓపెనింగ్ సీన్ పన్నెండవ శతాబ్దం నుంచి ఆలయ బాధ్యతలు స్వీకరిస్తున్న బసవన్న కుటుంబం పెద్ద పరమేశ్వర శాస్త్రి కి మంత్రితో గొడవ జరుగుతుంది.
శివరాత్రికి వస్తానన్న తమ కొడుకుల కోసం పరమేశ్వర శాస్త్రి దంపత కోసం ఎదురు చూస్తుంటారు. కట్ చేస్తే చిన్న కొడుకు బసవన్న( ఉపేంద్ర) ఓ విహారి. ఏ నిముషానికి ఎక్కడుంటాడో కూడా తెలీదు. మన బసవన్న ఇంట్రోడక్షన్ ఒక ఆక్షన్ సీన్తో మొదలవుతుంది. దుబాయ్ లో ఉగ్రవాది అమానుల్లా ని షూట్ చేసి తన సొంతవూరు బయలుదేరతాడు. ఊళ్ళోకి వస్తూనే కబెలాకి తరలించే దేవస్థానం గోవులను కాపాడతాడు. వెంట వెంటనే హీరోయిన్ భవాని ఎంట్రన్స్ కూడా జరిగిపోతుంది. బావా నన్ను పెళ్ళిచేసుకొమ్మని వెంటపడుతుంది.పెళ్ళి సంబంధాలని కూడా చెడగొట్టుకుంటుంది. పరమేశ్వర శాస్త్రి ప్రధాన అర్చక పదవికాలం పూర్తవడంతో పెద్దకొడుకుని బాధ్యత తీసుకోమంటాడు. ఒప్పుకోడు. ఆ బాధతో శాస్త్రిగారు కన్నుమూస్తారు. ఆ బాధ్యతలు చిన్నకొడుకు బసవన్న తీసుకుంటాడు.బాధ్యతలు తీసుకోగానే దేవస్థానం లెక్కలు చెప్పమంటాడు మేనేజ్నెంట్ ని. మన బసవన్నని చంపడానికి ముంబై మాఫియాతో ఒక డీల్ కూడా జరుగుతుంది. అక్కడ జరిగే భీభత్సమైన ఫైట్ లో ఒక పూజారిని కాపాడటానిక హెలిపాడ్స్ లో వచ్చి ఫైట్ చేస్తారు బసవన్న మనుషులు. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఓ ఇంటర్వల్.
కథ గతంలోకి వెళుతుంది. క్రైమ్ బ్రాంచ్ లో పనిచేసే మన బసవన్న మాఫియా దాదా అమనుల్లాని దుబాయ్ పోలీసులకి పట్టిస్తాడు. ఆడియన్స్ కి సస్పెన్స్ పోయి బసవన్న పోలీసాధికారి అని తెలుస్తుంది. అమానుల్లా తెలివిగా తప్పించుకుంటాడు. కథ మళ్ళీ వర్తమానంలోకి వస్తుంది. తండ్రికిచ్చిన మాటకోసం పోలీసు జాబుకి రిజైన్ చేసి ఆలయానికి అంకితమవుతాడు.కథ ప్రీ క్లైమాక్స్ ఆలయ నిర్వాహకుల అంతుచూసి ఆలయ భూముల్ని కాపాడుతాడు. ఇక అమానుల్లా ఆగడాలను అరికట్టడం ఒకటే మిగిలుంది. బసవన్న మీద పగతో ఆలయంలో హోమం చేస్తున్న బసవన్న మీద ఎటాక్ చేస్తాడు అమానుల్లా. ఫైనల్ గా ఓ భీకర కన్నడ స్టైల్ ఫైట్ తో అమనుల్లాని చంపేస్తాడు. ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ తన తండ్రిపేరు నిలబెడతాడు మన బసవన్న.
టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :
దండుపాల్యం దర్శకుడు శ్రీనివాస్ రాజు గురించి. ఉపేంద్ర లాంటి రియల్ స్టార్ ని హీరోగా ఎంచుకుని మన సంప్రదాయానికి వారథులైన బ్రాహ్మల మీద, ప్రస్తుత పరిస్థితుల మీద తీసి ఒక ధైర్యమే చేసాడు. ముఖ్యంగా అర్చక వృత్తిని ఒక బరువుగా కాకుండా ఒక భాద్యతగా తీసుకోవాలని, దేవాలయ విశిష్టత చెప్పే సన్నివేశాలు చాలా బావున్నాయి. ఈ టాపిక్ ని మాఫియాతో ముడిపెట్టకుండా అదే పాటర్న్ తో కొనసాగిస్తే ఇంకా బావుండేది.
ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:
ఉపేంద్ర గురించి చెప్పాలి అంటే సహజంగా నటించడంలో దిట్ట. ఒక బ్రాహ్మణుడిగా తన నటన బావుంది. దేవాలయ సిబ్బందితో జరిగే సీన్స్ లో బాగా నటించాడు. అదే సమయంలో అర్చక వృత్తిని చులకనగా చూసే వారికి తన సందేశంతో ఒక చురకకూడా అంటించాడు.
సలోని నటన బావని అట పట్టించడం వరకే పరిమితం.
రవిశంకర్ విలనిజం బావుంది.
మిగిలిన వారు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
ఉపేంద్ర నటన
దేవాలయంలో జరిగే అన్ని సీన్స్.
మైనస్ పాయింట్స్ :
బ్రాహ్మణ సంప్రదాయానికి, మాఫియా గ్యాంగ్ కి లింక్ పెట్టి కథ నడపడం టైటిల్ కి తగ్గట్టు సరిపోలేదు. కథాబలం తగ్గినట్టనిపించింది.