అక్షర తోరణం ప్రత్యేక సంచిక


బ్రహ్మోత్సవం, spyder మూవీస్ నిరాశ కలిగించిన తరువాత దర్శకుడు కొరటాల శివతో కలిసి సూపర్ స్టార్ మహేష్ చేసిన ప్రయోగం అనుకోవచ్చు ఈ భరత్ అనే నేను. ఈ ప్రక్రియలో శ్రీమంతుడు లాంటి విజయాన్ని అందుకున్నారని నిశ్శందేహంగా చెప్పచ్చు.


​కథలోకి వెళితే :


 

ఆక్స్ఫర్డ్  యూనివర్సిటీ లో ఫుడ్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకుని తన తండ్రి(శరత్ కుమార్), నవోదయం పార్టీ ముఖ్యమంత్రి అకాల మరణంతో , తప్పనిసరి పరిస్థితిలో పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రాజ్ ఒత్తిడితో ముఖ్యమంత్రి గా భరత్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తాడు మన సూపర్ స్టార్ మహేష్  బాబు.అంతఃకరణ శుద్దితో CM అయిన వెంటనే ట్రాఫిక్  రూల్స్ నిబంధనలు ప్రజలకు చేరేలా చేసి యంగ్ CM స్ట్రిక్ట్ అని నిరూపించుకుంటాడు. కుర్ర ముఖ్యమంత్రి కావడంతో ఆఫీస్ కి వెళ్లే దారిలో  వసుమతి(కైరా అద్వానీ)తో ప్రేమలో పడతాడు.


ఎవ్వరి మాట వినడు, పార్టీ అధ్యక్షుడితో సహా. సమాజంలో బ్రతకాలంటే భయం, బాధ్యత  ఉండాలి, ప్రజలలో మార్పు రావాలంటూ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు.అన్ని శాఖలని ప్రక్షాళన చేసే పనిలో పడతాడు.ప్రతి పక్ష నాయకుడి కొడుకు అక్రమ ఆస్తుల విషయాన్ని CBI  అప్పగిస్తాడు,తప్పని తెలిసినా క్లీన్ చిట్ ఇవ్వాల్సి వస్తుంది. 

కథ పూర్తిగా రాజకీయ వాతావరణం చుట్టూ వేడెక్కుతున్న తరుణంలో తను ఇష్టపడుతున్న వసుమతితో   మార్నింగ్ కాఫీ, ఓ అందమైన పాట కాస్త ఆడియన్స్ కి రిలీఫ్.

పార్టీ అధ్యక్ష్యుడు ప్రకాష్ రాజ్  ఇచ్చిన విందుకు భరత్ ని పిలుస్తాడు. అవినీతి లీడర్స్ అందరూ ఒకే చోట చేరతారు.  చిత్రంగా అన్ని పార్టీ లీడర్స్ ఒకే మాట మీద ఉండాలని, ప్రజలు వేరు, మనం వేరు, మన మీద మనం అవినీతి కేసులు వేసుకోకూడదని చెప్పడంతో మీ అందరిని బాధ్యతగల మగాళ్ళుగా మారుస్తానని చెప్పి ఆడియన్స్ కి ఇంటర్వల్ బ్రేక్ ఇస్తాడు భరత్. ఈ ఇంటర్వల్ బ్లాక్ ని దర్శకుడు తీసిన విధానం చాలా బాగుంది.

సెకండ్ హాఫ్ నుంచి CM గా కాకుండా ప్రజల్లో ఒకడిగా, నిజమైన నాయకుడిగా ఉండటానికి ట్రై చేస్తాడు మన భరత్. రాయలసీమలో తన పార్టీ లీడర్ పైనే ఇండిపండెంట్ అభ్యర్థిని నిలబెడతాడు. గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పద్ధతి, ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడి పై చర్య,,గ్రామాల్లో స్వయం పరిపాలనా అధికారం. ఇలాంటి వాటిమీద దృష్టిపెట్టి  ప్రజల్లో పేరు సంపాయిస్తాడు. ఇలాంటి పొలిటికల్ మూవీ చాలా వచ్చినా ఈ సన్నివేశాలు స్క్రీన్ ప్లే పరంగా ఆశక్తిగా సాగి ఎక్కడా ప్రేక్షకుడిని బోర్ కొట్టించదు. అంతా బాగుంది అనుకునే సమయంలో వసుమతితో ప్రేమ కారణంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ఈ సన్నివేశం తరువాత మీడియాతో మాట్లాడే  సీన్ సెకండ్ హాఫ్లో మంచి సన్నివేశం. కథ ప్రీ క్లైమాక్స్ కి చేరి పొలిటికల్ రివెంజ్, ఫామిలీ ఎమోషన్స్, తన తండ్రికి పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రాజ్ వల్ల జరిగిన అన్యాయం, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తిరిగి భరత్ అనే నేను ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేడన్నదే కథ, ముగింపు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


దర్శకుడు కొరటాల శివ నుంచి సెట్ లో పనిచేసే బాయ్ వరకు అందరి పనితనం, అన్ని క్రాఫ్ట్స్ నైపుణ్యం బాగుంది.


ముఖ్యంగా దర్శకుడు ఒక పాత కథని తీసుకుని తన స్క్రీన్ ప్లే ద్వారా ప్రస్తుత రాజకీయ నాయకులపై, సమాజం పై ఎక్కుపెట్టిన ప్రశ్నల అస్త్రం. వాటికి హీరో మహేష్ తో ఇచ్చిన సమాధానం చాలా ఆశక్తిగా, సగటు సి
నీ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు నడిపించింది. సామాజిక బాధ్యత గల దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.


ఇక సంగీతం అదించిన మన దేవి కి చాలా మంచి మార్కులు వేయచ్చు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


సూపర్ స్టార్ మహేష్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది??  ఎప్పటిలాగే స్టైలిష్ లుక్స్ తో ఆదరగొట్టాడు. ఇన్ షర్ట్ చేసుకున్న ముఖ్యమంత్రి కారెక్టర్ లో క్లాసిక్ పెర్ఫార్మెన్స్ తో తన అభిమానులకు పండగే చేసాడు. 


హీరోయిన్ కైరా. పాత్ర నిడివి తక్కువగా ఉన్న ఆకట్టుకుంది.


సహజనటులు ప్రకాష్ రాజ్, రావ్ రమేష్ లు మంచి అభినయాన్ని కనపరిచారు.
ఆమని, సీతారా, PA గా చేసిన బ్రహ్మాజీ నటన బాగుంది.


హైలైట్ సీన్స్:

భరత్ ముఖ్యమంత్రిగా ఆఫీస్ కి వెళుతూ ప్రేమలో పడటం
రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ తో టూరింగ్ టాకీస్ లో చేసే ఫైట్
అసెంబ్లీ సన్నివేశాలలో మహేష్ డైలాగ్స్
పదవి నుంచి రిజైన్ చేశాక మీడియాతో కాన్ఫరెన్స్.


తెలుగు వేదిక రేటింగ్

Genre : Political entertainer 
 

Actors: Mahesh Babu, Kiara Advani, Prakash Raj, Posani Krishnamurthy


Story line:
తన సొంత పార్టీ విధానాలనే ఎదిరించి ప్రజలలో నిజమైన నాయకుడిగా ఎదిగే ఓ లీడర్ కథే ఈ భరత్ అనే నేను


Rating :
3/4 (బాగుంది )

Producer    : DVV Danayya

Director    : Koratala Siva​

Music Director : Devi Sri Prasad
Cinematographer :
Ravi K. Chandran
Editor :
A. Sreekar Prasad

Release Date :
20th April, 2018. 


BHARAT ANE REVIEW

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది