తెలుగు వేదిక రేటింగ్

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

Genre : Love & Action Entertainer
Target : : All Indians

Story line:
అమరేంద్ర బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాల్సివచ్చింది.  బాహుబలి కొడుకైన శివుడు తన తండ్రికి చేసిన ద్రోహానికి భల్లాలదేవుడిపై పగ ఎలా తీర్చుకుని మాహిష్మతి సామ్యాజాన్ని, తన తల్లిని కాపాడాడు.

 
Rating : 4/4 చాల బావుంది

Banner     :
: Arka Media​
Producer  :
శోబూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
Story & Direction    :
రాజమౌళి


యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, దగ్గుపాటి రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ, నాజర్ లు ముఖ్య ప్రాత్రలలో నటించిన బాహుబలి ( ది కంక్లుషన్) చిత్రవిశేషాలు, అత్యంత సాంకేతికత విలువలతో తీసిన విజువల్ వండర్స్ గురించి తెలుసుకుందాం.
    
Release Date : 28th April, 2017. 

BAHUBALI 2, THE CONCLUSION

Telugu Movie Review & Rating

త్వం ప్రత్యేక సంచిక


​కథలోకి వెళితే :

ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న  బాహుబలి కంక్లూషన్ లో కథ గురించి కన్నా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఉత్కంఠ రెండు సంవత్సరాలనుంచి భారతీయ సగటు సినీ ప్రేక్షకుడిని ఊరిస్తూనే ఉంది. ఈ కథని మనం ఆకోణంలో ఆలోచిస్తే ...


మాహిష్మతి సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకానికి సిద్దమవుతున్న  బాహుబలిని రాజమాత శివగామి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి దేశాటనకు పంపిస్తుంది. అక్కడే కుంతల దేశపు రాకుమారి శివగామినిని ప్రేమిస్తాడు.వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భల్లాలదేవ రాజ్యం తనకి దక్కలేదన్న  కోపంతో  బాహుబలి కన్నా ముందే దేవసేన తనకు కావాలని తల్లి శివగామిని అడుగుతాడు. కొడుక్కి మాటిస్తుంది. బాహుబలిని ప్రేమిస్తున్న కారణంగా శివగామి పంపిన సందేశాన్ని తిరస్కరిస్తుంది దేవసేన. దేవసేనకు అండగా నిలబడతాడు బాహుబలి. రాజమాత మాటని గౌరవించనందుకు రాజు కావలసిన బాహుబలి సైన్యాధ్యక్షుడుగా, భల్లాలదేవ మాహిష్మతి రాజ్యానికి రాజవుతాడు. శత్రుశేషం మిగిలి ఉండకూడదని తన మీద తనే హత్యాప్రయత్నం చేయించుకుని రాజ్యకాంక్షతో బాహుబలి చేయించాడని నమ్మిస్తాడు. 


కన్న కొడుకు మీదున్న ప్రేమతో బాహుబలిని చంపమని కట్టప్పని ఆదేశిస్తుంది. రాజమాత మాట కాదనలేని కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపేస్తాడు. నిజం తెలుసుకున్న శివగామి  మనమడు శివుడిని తీసుకుని పారిపోతుంది.
ఆ తరువాత ఏం జరిగిందనేది బాహుబలి -1 లో మనం చూసిందే. కట్టప్ప కన్నీళ్లు కార్చుకుంటూ జరిగింది చెప్పేటప్పటికి కోపంతో రగిలిపోయిన శివుడు కట్టప్ప సాయంతో భల్లాలదేవుడిని ఓడించి, తన తల్లి దేవసేనను బంధీ చేసిన చోట ప్రాణాలు తీసి పగతీర్చుకుంటాడు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


సినిమాటోగ్రఫి...సెంధిల్ కుమార్
విజువల్ ఎఫెక్ట్స్ ..కమల్  కణ్ణన్ టీం
ఎడిటింగ్ ..కోటగిరి
సంగీతం ..కీరవాణి
ఆక్షన్ .. కింగ్ సాల్మన్
దర్శకత్వం ..రాజమౌళి


ఒక్క సంగీతం అద్భుత స్థాయిలో లేదు మిగిలిన ప్రతీ క్రాఫ్ట్ అద్భుతః. 
దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడాల్సి వస్తే బాహుబలి అనే ఒక వీరుడి కథని అద్భుత దృశ్య కావ్యంగా, ఆసేతు హిమాచలం ఔరా అనిపించే విధంగా మలచి  భారతీయ చలన చిత్ర చరిత్రలో  ఒక నూతన అధ్యాయాన్ని లిఖించాడనడంలో సందేహం లేదు. 
ఓ కె వి రెడ్డి, ఓ విశ్వనాథ్, ఓ రాజమౌళి. ఇంతే, ఇంతకన్నా చెప్పాల్సింది లేదు.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


ఈ సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్స్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు అద్భుతః. వేరే మాటలేదు.
కొద్దిగా ప్రభాస్ గురించి చెప్పాల్సి వస్తే జన్మతహా రాజు, బాహుబలిలో రాజుగా జీవించాడు. కొన్ని సన్నివేశాలలో తన నటన పరాకాష్ట.