అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Babu Baga Busy

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది


​కథలోకి వెళితే :

మాధవ్ కి అమ్మాయిలంటే ఓ లెక్కుంది. సంతోషానికి తప్ప బంధాలకు పనికిరారని. స్నేహితులందరికి పెళ్లిళ్లు అయిపోయినా మాధవ్ మాత్రం సరదాల వేట ఆపకుండా సీనియర్ బ్రహ్మచారిలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక్కసారి పెళ్ళి మీద బుద్ది పుడుతుంది. పెళ్ళి సంబంధాల వేటలో పడతాడు. ప్రతి అమ్మాయికి తనగురించి నిజాయితీగా చెప్పడంతో రిజెక్ట్ చేస్తారు. ఇలా కాదని స్నేహితుడు సలహాతో తను వర్జిన్ ఇంతవరకు ఎటువంటి లవ్ అఫైర్స్ లేవని చెప్పి కొత్త కహానీ తేజస్వి, మిస్తీ చక్రవర్తి ఇద్దరితో ఒకేసారి మొదలుపెడతాడు. అంతే కాకుండా ఎదురింటి అంటితో కూడా సరసాలు మొదలుపెడతాడు. వీటన్నింటికి కారణం మాధవ్ చిన్నప్పటి ఉత్తేజ్ అనే ఒక స్నేహితుడు.పెరిగిన వాతావరణం. కథానాయకుడు కథ ఇలా రంజుగా సాగుతూ ఉంటే ఒక్కొక్కటిగా ఎదురుదెబ్బలు తగలడం మొదలుపెడతాయి. కాలనీలో అంటి విషయం తెలిసి బయటకు వచ్చేస్తాడు.


 తేజస్వికి మాధవ్ విషయం తెలిసి బ్రేకప్ చెపుతుంది. ఇక మిగిలింది మిస్తీ. మిస్తీతో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇక్కడనుంచే కథలో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో తెలుస్తుంది. అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడం, పరువుపోగొట్టుకోవటం, మనశ్శాంతి లేకపోవడం. ఈ రోజుల్లో ప్రేమ ఒక టైం పాస్ అయ్యింది.  ఒకరు కాకపోతే ఇంకొకరు అని చెపుతూనే మాధవ్ కథ ఓ ముగింపుకి తెస్తాడు. మిస్తీకి తన గతాన్నంతా చెప్పి ఇష్టముంటేనే పెళ్లి చేసుకొమ్మని చెపుతాడు. ఓకేలాంటి మనసులు ఒకచోట కలుస్తాయి అన్న సామెతగా మిస్తీ కూడా తనగతం చెపుతుంది. వీళ్ళ కథలకు ఓ ముగింపు చెపుతూ పెళ్లి చేసుకుంటారు.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

సంగీతం , సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడుకోవలసింది ఏమీ లేదు.


ఇక మన దర్శకుడి గురించి. ప్రేమ, మనసుకి నచ్చిన వాళ్ళు,   వ్యామోహం అంటూ తిరిగి నలుగురిలో నవ్వులపాలు అయ్యేబదులు పెద్దలు చూసిన  సంబంధాల్లో కాస్త నిలకడ ఉంటుందనేది మాధవ్ కారెక్టర్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది మానసిక చపలత్వ ఉన్న వారికి ఒక సందేశాత్మక చిత్రం.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


అవసరాల శ్రీనివాస్ ఈ కారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు. కొన్ని కొన్ని సందర్భాలలో తాను చేసిన నటన చాలా మంది తమలో తాము చూసుకుంటారు. 


తేజస్వి, మిస్తీ, శ్రీముఖి, సుప్రియలు ఉత్తమ నటన కనబరిచారు.


శ్రీనివాస్ స్నేహితుడుగా కౌశిక్ నటన బాగుంది.తెలుగు వేదిక రేటింగ్

Genre :  ROMEDY Entertainer
Target :
Romantic lovers

Story line:
ప్రేమించండి అదికాదని కామిస్తే కష్టాలు తప్పవు. టూకీగా ఇదే స్టోరీ లైన్.

Rating : 2/4

Banner      :

Producer  :
అభిషేక్ నామా
Director    :
నవీన మేడారం  


శ్రీనివాస్ అవసరాల , తేజస్వి,శ్రీముఖి, మిస్తి చక్రబొర్తి, తనికెళ్ళ భరణి, ఆదర్శ బాలకృష్ణన్, పోసాని, సుధ, అన్నపూర్ణ, రవి ప్రకాష్ తదితరులు ముఖ్య తారాగణంగా నటించిన ఈ  సినిమాలో బాబు ఎంత బిజీ బిజీ, ఎవరితో బిజీయో  తెలుసుకుందాం.
    
Release Date : 5th May, 2017.