అక్షర తోరణం ప్రత్యేక సంచిక

AWE

Telugu Movie Review & Rating


నాని అంటేనే ప్రత్యేకత. హీరోయిజాన్ని పక్కన పెట్టి కథకి విలువిచ్చే కథానాయకుడు.  నానియే నిర్మాతగా మాట్లాడితే , వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమా తీస్తే, చాలా చిత్రంగా ఉంటుంది. అ!! అనిపించేలా. షార్ట్ ఫిల్మ్ డైలాగ్ ఇన్ ద డార్క్ తో తనలో ఉన్న దర్శకుడి ప్రత్యేకత  చాటుకున్న ప్రశాంత్ వర్మతో నాని చేసిన విభిన్న ప్రయోగం ఎలా వుందో చూద్దాం రండి.


​కథలోకి వెళితే :


 సినిమా ఓపెనింగ్ సీన్ అ!! అనిపించేలా ఉంది. నిత్యా మీనన్(క్రిష్ ) తను పెళ్లి చేసుకోవడానికి మరో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. 


ఇక నల్లా(ప్రియదర్శి) ఓ కుక్. తనను  నమ్మిన వాళ్లనే ముంచేసే రకంలా ఓ చేప కామెడీ పెట్టి తన కారెక్టర్ ఏంటో చెప్పి మరోసారి అ!! అనిపిస్తాడు దర్శకుడు. 


ఇక కాజల్ కారెక్టర్ ఏంటో అర్థంకాక గన్ పట్టుకుని డిప్రెషన్ లో ఉంటుంది. 


ఇక మరో ప్రత్యేక మైన కారెక్టర్ శ్రీనివాస్ అవసరాల ది. ఓ సైంటిస్ట్. టైం మెషీన్ కనిపెట్టి పాస్ట్ కి వెళ్లి తల్లి దండ్రులను కలవాలనే కోరిక. ఇక్కడ అ!! అనిపించే విషయం నేనే నువ్వంటూ ఒక లేడి వస్తుంది


 ఇక యోగి (మురళి శర్మ ) మేజీషియన్. ఈ కారెక్టర్ ఇంకా అ!! అనిపించలేదు. తనకన్నా గొప్ప మేజీషియన్ ఉన్నాడంటే తట్టుకోలేడు.


సినిమాలో మిగిలిన కారెక్టర్ రెజీనా. గాంగ్స్టర్ వుమన్ గా పనిచేస్తూ ఒక కేఫ్ లో పనిచేస్తుంది. రెగ్యులర్ గా వచ్చే ఓ కస్టమర్ ఈ కేఫ్ తనదేనంటూ రెజీనాకి ఓ కథ చెపుతాడు.  ఆడియన్స్ అందరిని అ!! అనిపించే విషయం ..ఇప్పుడు చెప్పిన కారెక్టర్స్ అన్నీ ఒకే కేఫ్ లో ఉండటం. సైలెంట్ గా ఓ ఇంటర్వల్.

 ఈ కన్ఫ్యూజింగ్ థ్రిల్లింగ్ కామెడీలో మళ్లీ కారెక్టర్స్ అన్నీ మొదలుకొస్తాయి. నిత్యా మీనన్ తాను రాధని ఎలా ప్రేమించిందో రాధ తల్లి దండ్రులకి చెపుతుంది. 


ప్రియదర్శి అక్వేరియంలో ఉన్న చేప, బోన్సాయ్ చెట్టు నాని - రవితేజ వాయిస్ ఓవర్ లో  మాట్లాడుకునే మాటలు వినపడుతుంటే అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. సిట్యుయేషల్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తారు. 
కాజల్ సూసైడ్ చేసుకోపోయే ముంది ఆర్గాన్ డొనేషన్ పేపర్ పై సంతకం చేస్తుంది. 

రెజీనాకి కస్టమర్ భార్య దెయ్యం రూపంలో కనపడి భయపెడుతుంది. 


యోగి తనకన్నా గొప్ప కమెడియన్ కోసం వాష్ రూమ్ లో వెతుకుతూ ఉంటాడు. 


ఈ సస్పెన్సు కామెడీలో ఓ దొంగతనానికి ప్లాన్ చేస్తాడు రెజీనా బాయ్ ఫ్రెండ్.


 ఇక శ్రీనావస్ అవసరాల తన టైం మెషీన్ లో వెళ్ళి తల్లి దండ్రులని కాపాడుకోవాలని, 20 ఇయర్స్ ఫ్యూచర్ నుంచి  వచ్చిన ఆంటీ  గొడవపడుతూ బటర్ ఫ్లై థియరీ మాట్లాడుతూ తికమకపెడుతుంది.


థియేటర్ లో ఉన్న ప్రతీ ఆడియెన్స్ ఒక కారెక్టర్ చుట్టూ తిరుగుతాడు ఎవరి కథ ఎలా ముగుస్తుందా... ఈ ట్విస్ట్ లన్నీ వీడి దర్శకుడు కథకి క్లైమాక్స్ ఎలా ఇస్తాడా అని. ఒక్కసారి గన్ పేలిన సౌండ్. కాజల్ షూట్ చేసుకుంటూ కిందపడుతుంది.  కథ సమాప్తం. కట్ చేస్తే కథలో ఉన్న అన్ని కారెక్టర్స్ కాజల్.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


​Cinimatography చాలా బాగుంది. ఈ టిపికల్ స్క్రీన్ ప్లే ని చూసేంతగా. 

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ. Multiple personality disorder అనే కాన్సెప్ట్ తీసుకుని అల్లిన టిపికల్ స్క్రీన్ ప్లే సున్నిత భావోద్వేగాలను పాత్రలుగా చేసి. ఒక చిన్న పాప మానసిక వ్యధని ఎవరితో చెప్పుకోలేక  ఎదిగేకొద్దీ ఎన్నో పాత్రలతో తానే ఊహించుకుంటూ ఓ కేఫ్ లో మలిచిన  స్క్రీన్ ప్లే తీరు చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఇది ఒక పాత్ర తనలో తానే ఎన్నో పాత్రలతో చేసే సంఘర్షణ అని  అని తెలిసి పెదవి విరిచేలా చేసాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

ఈ మూవీలో ప్రధాన తారాగణం కాజల్, నిత్యా మీనన్, రెజీనాలు వున్నా మొత్తం మూవీలో మనల్ని అలరించింది ప్రియదర్శి, మురళీ శర్మల కామెడీ. మిగతా వారంతా దర్శకుడి కోణంలో కథలో పాత్రలు. బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్

Genre : Thrilling entertainer 
 

Actors: కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యా మీనన్ , శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ.


Story line:
Multiple Personality disorder ఉన్న ఓ అమ్మాయి కథే ఈ అ!!!


Rating :
2/4 (ఫరవాలేదు)

Producer    : Natural Star Nani

Director    : Prasanth Varma​

Banner: Wall poster 

Release Date :
16th Feb, 2018. 


లాజికల్ థింకింగ్, డిఫరెంట్ ఐడియాస్ ఉన్న వాళ్ళు అ!! సినిమాని ఆహా!! అనేలా చూడచ్చు​​