అక్షర తోరణం ప్రత్యేక సంచిక

PHOTO GALLERY-4

అందరు అందరి కవితలు విని, చదివిన ప్రతి కవితకు తమ స్పందన తెలియజేయాలన్న సంకల్పంతో కవులంతా కార్యక్రమం సంపూర్ణమయ్యేంత వరకు వారి మొబైల్స్ ను ముందొస్తుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద డిపాజిట్ చేశారు. అక్షర తోరణం బడ్జీ, బాగ్, పుస్తకం, కలం కిట్ గా విచ్చేసిన అందరికీ ఇచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం తెలుగు ఆత్మీయ భోజనం అమ్ల్లీ తిరిగి సాయంత్రం తేనీరు బిస్కెట్లతో కవులు రోజుమొట్టం ఉల్లాసంగా అక్షర తోరణం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆడపడుచులందరికీ చీర, పండు తాంబూలం, పసుకుంకుమలతో సాగనంపారు. 


వేదిక కల్పించిన తెలుగు కళా సమితి సమస్త కార్యవర్గ సభ్యులకు, జ్యోతి ప్రజ్వలన గావించిన *మాదిరెడ్డి కొండారెడ్డి* గారికి...
కీలకోపన్యాసం చేసిన *డా౹౹ తాటి నరహరి* గారికి, కార్యక్రమం కవర్ చేసిన AKMedia, *కంటె అశోక్* గారికి.. RRMedia, *పిట్ల రాము, గుర్రం రాజ్* గారికి, ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించిన *దాతలందరికీ*, వాయుధ్వని* సభ్యులకు, హాజరైన ప్రముఖులకు, సాహిత్యాభిమానులకు, సోదర సోదరీమణులందరికీ, క్యాటరర్ *నాగేశ్వర్ రావు* గారికి, పాత్రికేయ మిత్రులు, *మల్లేశ్ గౌడ్ (ఈనాడు), గుండారి శ్రీనివాస్ (సాక్షి)* గార్లకు *మహారాష్ట్ర తెలుగు కవుల సమూహం* / *అక్షర తోరణం* తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.

భోజన తాంబూలాలు ...మరి కొన్నిమధుర ఘట్టాలు 

శుభం భూయత్