అక్షర తోరణం ప్రత్యేక సంచిక

PHOTO GALLERY-2

అనంతరం రవీంద్ర సంగెవేని, గాలి మురళీధర్ సంయుక్తంగా కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కేవలం ప్రతి కవి రహించిన కవితను నామమాత్రంగా పొగడ్తలతో ముంచెత్తకుండా చదివిన కవితాలపై విశ్లేషణ చేయడం, సభలో పాలుప్పంచుకున్న కవులు సైతం చదివిన కవితలు విశ్లేషించడం, కవితలు ఇంకా మెరుగుపరచడానికి ఆయా కవులకు సూచనలు ఇవ్వడం విశేషం. 


ఈ కార్యక్రమం ద్వారా తెలుగువాడైన మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య ప్రకాష్ మంచి కవితలకు, గేయాలకు పాటలకు తానూ మ్యూజిక్ చొంపొసె చేసి మహారాష్ట్ర తెలుగు కవులకు తానూ అవకాశం కల్పించి  ఇంకా ప్రోత్సహిస్తాను అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇద్దరు రచయితలకు టాలీవుడ్ లో మాటల రచయితలుగా అవకాశం రావడం విశేషం. అంతేకాకుండా రెండు కవితలని ఆంగ్లంలోకి అనువదించి తెలుగు భావాలని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇకపై కూడా మంచి కవితలను ఆంగ్లంలోకి అనువదిస్తామని నిర్వాహకులు తెలియజేశారు.  


కవులందరికి అక్షర తోరణం మొమెంటో, శాలువా, రుద్రాక్ష తో సన్మానించారు. ఉత్తమ కవితగా శ్రీ కె వి వి సత్యనారాయణ గారి "అక్షర యజ్ఞం" కవిత ఎంపికయ్యింది. 

కవి సమ్మేళనం