అక్షర తోరణం ప్రత్యేక సంచిక

Ardhanaari

Telugu Movie Review & Rating

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

తెలుగు వేదిక రేటింగ్

Genre : సందేశాత్మక దేశభక్తి చిత్రం 
Target: దేశాన్ని అభిమానించే అందరికి.

Story line: బాధ్యతగా లేనివాడికి ఈ దేశంలో వుండే హక్కులేదని వ్యవస్థ మీద ఓ హిజ్రా చేసే పోరాటమే అర్థనారి.

Rating :3/4 (బాగుంది).

Banner         : భరత్ రాజ్  
Producer      : రవికుమార్
Story &Direction  : భాను శంకర్ చౌదరి


 అర్జున్ యజిత్, మౌర్య, జ్యోతి, జూనియర్ రేలంగి తదితరుల నటించిన అర్థనారి చిత్ర విశేషాలు మీకోసం.

Release Date : 1st, July 2016.


తెలుగులో ఓ కొత్త ప్రయోగం..బాగుంది.


కథలోకి వెళితే :

 
బహుసా తెలుగులో మొట్ట మొదట ఓ హిజ్రా ని ముఖ్య పాత్రలో పెట్టి తీసిన సందేశాత్మక దేశభక్తి చిత్రం. 

ఓపెనింగ్ సీన్  పోలీస్ అధికారి మిస్సింగ్ కేసుని చేధించే పనిలో పోలీసుయంత్రాంగం తలమునకలై వుంటుంది. అర్థనారి (అర్జున్ యజిత్) అనే ఒక హిజ్రా కొత్తగా తాండాలో చేరుతుంది. వరసగా పోలీసు, న్యాయ వ్యవస్థలోని ముఖ్యులను హత్య చేస్తూవుంటుంది. నగర ఎసిపి హంతకుడిని పట్టుదలగా వెతికే పనిలో పడతాడు.  ఓ మంత్రి కొడుకుని కూడా చనిపోవడంతో పోలీసు యంత్రాంగం మరింత అలెర్ట్ అవుతుంది. కథలో ఆడియన్స్ కి ఇచ్చే మొదటి ట్విస్ట్ ఈ అర్థనారి సీఎం ని కూడా కిడ్నాప్ చేస్తుంది.

ఈ  వరుస హత్యల కిద్నాపుల వేటలో అటో డ్రైవర్ వేషంలో వున్న క్రైమ్ బ్రాంచ్ అధికారి జ్యోతి ద్వారా అర్థనారి పోలీసులకి దొరుకుతుంది. అప్పటికే ముఖ్యమంత్రిని కూడా అర్థనారి హత్యచేయడంతో జెడ్జ్ ఉరిశిక్ష వేస్తాడు అర్థనారికి. ఉరి తీసేముందు తన చివరి కోరికగా ప్రజలతో మాట్లాడలంటుంది. రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమ మంత్రి  మరియు మీడియా చానెల్స్ ముందు అందరూ చూస్తుండగా తను అర్థనారి కాదు తన పేరు శివకుమార్ అని చెపుతాడు. కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది.

గతంలో చూసిన చాలా దేశభక్తి మరియు సందేశాత్మక సినిమాల మాదిరిగానే శివకుమార్ ఆవేశపరుడు . బాధ్యతలేనితనం, నిర్లక్షంతో ఉండేవాడికి దేశంలో బ్రతికే హక్కులేదనుకుంటూ తప్పు  చేసిన ప్రతి వాడిని శిక్షిస్తాడు. ఈ క్రమంలో సీఎం ని కలుస్తాడు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయమని చెపుతాడు. ఆవేశపరుడైన శివకుమార్ ఓ కాంట్రాక్టు విషయంలో అవినీతి బయటపెట్టడం వల్ల సీఎం అవినీతి బయటపడుతుంది. తనపై జరిగే హత్యా ప్రయత్నంనుంచి తప్పించుకుంటాడు. తన భర్తని ఎక్కడ తనకు దక్కడో అని ఇంట్లోనే బంధిస్తుంది భార్య.  తన కళ్ళ ముందే పనిమనిషి  కూతుర్ని ధర్నాలో భాగంగా సజీవదహనం చేయడంతో, ఆవేశంతో దానికి కారణమయిన వాడిని చంపేస్తాడు. చివరకి గుండా ధర్మ చేతిలో భార్య బిడ్డని కోల్పోయి, పోలీసులనుంచి తప్పించుకుని అర్థనారి వేషం వేస్తాడు.

కథ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకొచ్చి ,పక్కనే వున్న, తన భార్య బిడ్డలని హత్య చేసిన  స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి ధర్మని కూడా కాల్చి చంపుతాడు. నేరము శిక్ష ప్రాతిపదికపై శివకుమార్ అనబడే దేశభక్తి పరుడు ఉరికం ఎక్కుతాడు.  ఇదే టూకీగా అర్థనారి కథ.

​టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


నివాస్ వ్రాసిన డైలాగ్స్ కథకి బలానిచ్చే విధంగా, సెకండ్ హాఫ్ లో దేశభక్తి, భాధ్యతని గుర్తు చేసేవిధంగా వున్నాయి.

సినిమాటోగ్రఫి, సంగీతం ఫరవాలేదు.  రవివర్మ అందించిన RR సెకండ్ హాఫ్ లో బాగా కుదిరింది.

ఇక మన దర్శకుడు భాను శంకర్ గురించి. సాధారణంగా మూస ఫార్ముల మాస్ సినిమాలు తప్ప తెలుగులో ప్రయోగాలకి పోరు. దేశభక్తిని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని బాధ్యత లేనివాడు భారతదేశంలో ఉండడానికి పనికిరాడనే నినాదంతో. ఓ హిజ్రాతో చేసిన ప్రయత్నం చాలా బావుంది. దర్శకుడి ప్రతిభకు మూడు సన్నివేశాలు చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ లో హీరో ని అచ్చు హిజ్రాలా చూపించి ప్రేక్షకులని నమ్మించడం. రెండు, పెళ్ళి చూపులలో దేశ ప్రతిజ్ఞ పెళ్లి కూతురు చేత చెప్పించడం. మూడు, గాంధీ గారి మీద ప్రేమతో పిల్లలని కనడం.  మొత్తాని ఓ మంచి ప్రయత్నం చేసిన దర్శకుడిని అభినందించాలి.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:


అర్జున్ హిజ్రాగా, దేశభక్తి నింపుకున్న శివకుమార్ గా చాలా బాగా నటించాడు.


కొద్దినిముషాలే నిడివి వున్నా హీరోయిన్ మౌర్యని పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.


జూనియర్ రేలంగి హిజ్రా నటనతో నవ్వించి మెప్పించాడు.


మిగతా నటులు వారి పరిధి మేరకు నటించారు.


బెస్ట్ డైలాగ్స్:


భాద్యత లేనివాడు భారతదేశంలో జీవించడానికి పనికిరాడు. 


ప్లస్ పాయింట్స్:


హిజ్రాగా అర్జున్ నటన

హిజ్రాల జీవితంలోని కొన్ని కోణాలని చూపించడం.

పెళ్ళి చూపుల సీన్.

హిజ్రాలకు పూజ చేయడం

క్లైమాక్స్


మైనస్ పాయింట్స్ :


క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ల పాత్రలు కొన్ని పేలవంగా అనిపించి ఫస్ట్ హాఫ్ లో బోరు కొట్టించింది.