అక్షర తోరణం ప్రత్యేక సంచిక

AGNAATAVAASI

Telugu Movie Review & Rating

తెలుగు వేదిక రేటింగ్

Genre : Trivikram's Genre(Action-love & sentiment -comedy )
Target : World wide Power Star fans 
Story line: ఓ అజ్ఞాతవాసిని అధిపతిగా చేయడం కోసం తల్లి చేసే పోరాటమే ఈ అజ్ఞాతవాసి.

Rating : 3/4 (బాగుంది)

Banner      : Haarika -Hassine creations
Producer  :  S. Radha krishna
Story &Direction   : Trivikram Srinivas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , కీర్తి సురేష్, అను ఇమాన్యువల్, రావు రమేష్, బొమ్మన్ ఇరానీ, ఖుష్భూ, ఆది పినిశెట్టి, కిషోర్, పరాగ్ త్యాగి, మురళి శర్మ, అజయ్ ముఖ్య పాత్రలలో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న పవర్ స్టార్ 25వ చిత్ర విశేషాలు మీకోసం.

Release Date : 10th Jan, 2018.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కలిసి జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్స్ తరువాత 3 వ చిత్రంగా అజ్ఞాతవాసి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీస్థాయిలో వుండాలనుకోవడంలో సందేహం లేదు. రండి మనమూ కథలోకి వెళ్లి చూసేద్దాం 

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది


​కథలోకి వెళితే :


AB గ్రూప్ ఓనర్ గోవింద భార్గవ్ విందా( బొమ్మన్ ఇరానీ), తన కుమారుడు మోహన్ భార్గవ్ విందా  అనూహ్యంగా హత్యకు గురవడంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్భూ) ఒంటరిదవుతుంది. కంపెనీ CEO సీట్ కోసం పార్టనర్స్ అయిన శర్మ (మురళి శర్మ ), వర్మ ( రావ్ రమేష్ ) లు పోటీపడతారు.  ఒక సస్పెన్సు ట్విస్ట్ ఇస్తూ ఎక్కడో దూరంగా పెరుగుతున్న తన పెద్దకొడుకును తండ్రి, తమ్ముడి హత్యకు కారణమయిన వాళ్ళని కనుక్కోమని కంపెనీకి రప్పిస్తుంది ఇంద్రాణి.  తన తండ్రి హత్యకు కారణమైన వాళ్లకోసం ఓ ఆజ్ఞత  వ్యక్తిలా AB గ్రూప్ లో తన పేరు మార్చుకుని బాలుగా  జాయిన్ అవుతాడు .తండ్రి చనిపోక ముందు వచ్చిన వాయిస్ కాల్స్ డేటా ప్రకారం  కంపెనీ పార్టనర్స్ అయిన శర్మ, వర్మ లని అనుమానిస్తాడు.

వర్మ కూతురు సుక్కు( కీర్తి సురేష్ ), ఆఫీసు కొలీగ్, శర్మకి కూతురు వరసైన అను ఇమాన్యువల్ తోటి ప్రేమలో పడ్డట్టు నటిస్తాడు ఈ హత్య వెనుక రహస్యం చేదిద్దామని. పనిలో పని గాలి వాటుగా ఓ గులాబీ రాలి, బయటకొచ్చి చూస్తే టైమేమో లాంటి  రెండు రొమాంటిక్ సాంగ్స్ తో జాలీగా కథ ముందుకు  సాగుతుంటే తనకు తెలీకుండానే బాలు మీద అటాక్ చేస్తారు ఓ గ్యాంగ్.  ఈ పని శర్మ-వర్మలది కాదు, మరెవరిది ??? ప్రేక్షకులకు ఇంకో ట్విస్ట్ ఇస్తూ సీతారాం( ఆది పినిశెట్టి) కారెక్టర్ ఒకటి తెరమీదకు వస్తుంది.  ఈ హత్యాలన్నీ చేయుస్తున్నది సీతారాం,అసలు ఈ సీతారాం ఎవరు?? బాలుగా పేరు మార్చుకున్న పెద్ద కొడుకు అభిషిక్త నందా ఇన్నాళ్లు ఎందుకు దూరంగా ఉన్నాడు??  అసలు మేనమామ భరణి దగ్గర ఎందుకు పెంచారు అభిని,  ఈ అనుమానాలన్నింటికీ బ్రేక్ ఇస్తూ తల్లి, కొడుకుల మధ్య  ఓ ఇంటర్వల్. 

కథ కాస్త గతంలోకి వెళ్లి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో విందా మొదటి భార్య కృష్ణవేణిపై హత్య ప్రయత్నం జరగడంతో తనకొడుకుని అజ్ఞాతంలోంపెంచుతాడు విందా.మొదటి భార్య చనిపోవడం, తన పార్టనర్స్ లో ఒకరైన అజయ్ తనని మోసం చేయడానికి ప్రయత్నించడంతో డబ్బుకు దూరంగా, ఓ అజ్ఞాతవాసిలా పెంచి, ఇంద్రాణి ణి పెళ్లి చేసుకుంటాడు.  కథ ప్రెజెంట్ లోకి వచ్చి ఆడియన్స్ కి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇంద్రాణి తన సవతి కొడుకు అభిని CEO గా ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు ఎమోషన్, బ్లాక్ మెయిల్స్ తో సాగిన కథ కాస్త సరదాగా మేనేజర్ అయిన కొటేశ్వర్రావు (రఘుబాబు) ని కొడకా కోటేశ్వర్రావు  పాటతో  ఆట పట్టించడం, సుక్కు-అనులు అభి నావాడంటే నావాడని సరదా ప్రేమ కజ్జాలతో ప్రేక్షకులకి త్రివిక్రమ్ తన మార్క్ ఎంటర్టైన్ చూపించడానికి ప్రయత్నం చేస్తాడు.

 కథ ప్రి క్లైమాక్స్ కి చేరుతుంది.  సీతారాం అజయ్ కొడుకని ఆ కాస్త ట్విస్ట్ కూడా వీగిపోవడంతో అసలు విలన్ సీతారాం అని తెలుస్తుంది. ఇంద్రాణి ఆఫీషియల్ గా AB గ్రూప్స్ కి CEO గా అనౌన్స్ చేస్తుంది. సీతారాం పూఫ్స్ చూపించమని అడ్డుపుల్ల వేస్తాడు. మన అభి తండ్రి దాచిన పవర్ పట్టా కోసం వీరోచితంగా ఫైట్ చేసి, సీతారాం కథ ముగించి, ఈ 

ఆజ్ఞాతవాసి విందా పెద్ద కొడుకని నిరూపించడంతో కథ సుఖాంతంమవుతుంది. కంపెనీ CEO గా పెద్దకొడుకుని చూడాలన్న ఆశ తీరుతుంది ఇంద్రాణికి.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


అనిరుధ్ సంగీతం పవర్ అభిమానులను అలరించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టు ఇస్తే ఇంకా బాగుండునేమో.


సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది.మణికందన్ కి నూటికి నూరు మార్కులు వేయచ్చు.


ఇక మాటల మాంత్రికుడు, ఫామిలీ డ్రామాను అద్భుతంగా రక్తి కట్టించగల దర్శకుడు త్రివిక్రమ్ గురించి. అత్తారింటికి దారేది అనే అద్భుతమైన సినిమాకి పూర్తి భిన్నంగా తీసి చివరకు క్లైమాక్స్ ఆ పంథాలొనే ముగించే ప్రయత్నం చేసాడు. వర్మ- శర్మ కాంబినేషన్ ని బాగా తీర్చి దిద్దేడనడంలో  సందేహం లేదు. పవర్ స్టార్ కారెక్టర్ని చాలా హుందాగా, స్టైలిష్ గా అత్తారింటికి దారేదిలా  చూపించడానికి ప్రయత్నం చేసాడు. తనదైన మార్క్ పంచ్ లు అక్కడక్కడా రావురమేష్ చేత చేయించే ప్రయత్నం చేసాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ వినండి..


క్లాస్ అండ్ మాస్ కలిపి స్టైలిష్ ఏక్షన్ చేయడంలో పవన్ దిట్ట. ఈ సినిమాలో మాత్రం చాలా రిచ్ లుక్ తో క్లాసిక్ గా నటించాడు.రొమాంటిక్ లవర్ గా ఆడి పాడి అలరించాడు. కథ, కథనం ఎలా సాగుతున్నా పవర్ నటనకు మాత్రం ఫిదా అవ్వాల్సిందే. కొడకా కోటేశ్వర్రావా పాటకి థియేటర్ లో ప్రతి కుర్సీ కడలాల్సిందే. శర్మ-వర్మ లతో పవన్ నటన అద్భుతః. ఖుష్భూతో నటించిన సీన్స్ లో   పవన్ ఎమోషనల్ యాక్టింగ్ కంటతడి పెట్టిస్తుంది. 

ప్రీతి ఇమాన్యువల్ , కీర్తి సురేష్ లకు నటనకు ఆస్కారం లేకపోయినా పవర్ స్టార్ తో ఉన్న సీన్స్ మాత్రం చక్కటి చిక్కటి కెమిస్ట్రీ పండించారు.
ఇక శర్మ -వర్మ ల కాంబినేషన్ లో వచ్చే ప్రతి సీన్ అదిరింది. రావు రమేష్, మురళి శర్మలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 
విలన్ ఆదిపినిశెట్టి నటన విషయంలో మరో మెట్టు ఎక్కినట్టే. నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ హీరో స్థాయి విలనిజం. 
ఇక చాలా కాలం తరువాత నటించిన ఖుష్భూ తల్లి పాత్రలో ఓవర్ సెంటిమెంట్ కాకుండా కథకి తగ్గట్టు నటించి మెప్పించింది.


తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ లు కథకు ప్లస్ అయ్యారు. 


Plus points 


పవర్ స్టార్ పవర్ఫుల్ టైమింగ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఏక్షన్ 
శర్మ- వర్మ అల్టిమేట్ కామెడీ 
ఖుష్భూ నటన 


Minus points 


Power star  ఓపెనింగ్ సీన్ లో వచ్చే ధగ ధగమనే పాటకి, పిక్చరైజషన్ పొంతన లేదు. పవర్ స్టార్ డైలాగ్స్ కోసం కనీసం 15 నిముషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. 


తండ్రి చనిపోయాడని తెలిసిన తరువాత AB గ్రూప్స్ కి వచ్చి వెన్నెల కిషోర్ తో చేసే సిల్లీ కామెడీ పవర్ స్టామినాకు తగ్గట్టు లేదు. 


ఇద్దరు హీరోయిన్స్ తో పరిచయం పెంచుకునే విధానం తెచ్చిపెట్టుకున్న సీన్స్ లా ఉన్నాయి గాని ఎక్కడా సహజత్వం లేదు. 


మధురాపురి సదన మృదువదనా అనే పాటకి ఆడియన్స్ లో మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు పిక్చరైజషన్ లేదు. 


పవర్ స్టార్ అంటేనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్. గాలి వాటుగా, బయటకొచ్చి చూస్తే పాటల టైమింగ్, లొకేషన్స్ రెండూ పాట స్థాయిని దిగజార్చాయి. ఓ జల్సా, అత్తారింటికి దారేదిల పాటలు చూసిన కళ్ళు ఈ పాటలు చూడలేవు. 
ఇంటర్వల్ వరకు చెప్పుకోతగ్గ ఏక్షన్ ఎపిసోడ్ లేకుండా కామెడీతోనే నెట్టుకురావడం  పవర్ అభిమానులకు నిరాశే. 
కొడకా కొటేశ్వరావా పాటతో మూవీ ఊపందుకుంది అనుకుంటే ఆదితో పవర్ స్టార్ చెప్పే డైలాగ్స్ మళ్లీ అత్తారింటి క్లైమాక్స్ డైలాగ్స్ నే గుర్తు చేస్తాయి.

 
తండ్రి రాసిన వీలునామా తెచ్చే ప్రయత్నం ఓల్డ్ డ్రామాలానే కనపడింది తప్ప ఎక్కడా కొత్తదనం లేదు. 
క్లైమాక్స్ ఏంటా అని ఉత్కంఠతో  ఎదురు చూసిన ప్రేక్షకులకి అమ్మ తీసుకొచ్చి కొడుకుని కంపెనీ కి ceo చేయడం,  అత్తారింటికి దారేది క్లైమాక్స్ అత్త తీసుకొచ్చి కంపెనీ కి అల్లుణ్ణి ceo చేయడం రెండూ పోలికలు ఒకేలా ఉండడంతో సినిమా బావున్నా బావుంది అనే పరిస్థితి కనిపించలేదు. 


అన్నిటికన్నా ముఖ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అనిరుధ్ అన్యాయమే చేసాడు. 

​​