అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

Genre :  love &action & message.
Target: all weekend movie lovers 

Story line: అనాధగా పుట్టినవాడు అనాధగా మిగిలిపోకూడదు, అందమైన జీవితాన్ని చూడాలి ఇదే ఆ ముగ్గురు కాన్సెప్ట్. 

Rating :3/4 (ఫరవాలేదు).


Banner   : అన్నా క్రియేషన్స్   
Producer   : నల్లమిల్లి చిన్నారెడ్డి 
Story & screen play & Dailauges & Direction : మండపాక శ్రీనివాస్(చంటి)

 రంజిత్, చంటి, సరయు, పూర్ణిమ  ప్రధాన పాత్రలలో  నటించిన ఆ ముగ్గురు చిత్ర విశేషాలు మీకోసం. 

Release Date : 8th  , July 2016.

AA Mugguru

Telugu Movie Review & Rating


సందేశాత్మక మంచి చిత్రం


​కథలోకి వెళితే :

కొత్త సినిమా, చిన్న సినిమా కాని కథన చాలా బావుంది. చక్కటి సందేశం తో సాగిన ఈ సినిమా తప్పక చూడదగినది.


ఓపెనింగ్ సీన్ రంజిత్ (రంజిత్) కారు ఆక్సిడెంట్ లో చనిపోతాడు. అతను చివరగా పలకరించింది తన ప్రియురాలినే. 

ఆక్సిడెంట్  అయిన కార్ వన్ ఇయర్ నుంచి అక్కడే ఉండటం, అదే నెంబర్ తో సిటీలో వేరే కారు చూడటంతో  ట్రాఫిక్ ఎస్ ఐ కేసుని తిరగతోడి  క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి జంప్ చేద్దామనుకుంటాడు. మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్న సత్యకి తన స్నేహితుడు కూతురు సరయు తో నిశ్చితార్ధం కుదురుస్తాడు తండ్రి. వీళ్ళ పెళ్ళయ్యాకా కథలో ట్విస్ట్ ఏంటంటే ఆక్సిడెంట్ అయిన రంజిత్ ఫోన్ సరయుదగ్గర దొరకడంతో కథ కొత్తమలుపు తిరుగుతుంది. ట్రాఫిక్ ఎస్ ఐ సత్యని ప్రశ్నిస్తాడు.  ఈ రంజిత్  వెయ్యికోట్ల క్రైమ్ లో చిక్కుకున్నాడని,సరయు రంజిత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలీడంతో అపార్ధాలు మొదలవుతాయి ఇద్దరి మధ్య. రంజిత చనిపోయేడు ఆ కథ ఎప్పుడో ముగిసిందని సరయు,  లేదు తను బ్రతికే  ఉన్నాడని సత్య, వెయ్యకోట్ల స్కామ్లో చిక్కుకున్న రంజిత్ ని పట్టుకోవడానికి ట్రాఫిక్ ఎస్ ఐ ఇలా కథ క్రైమ్ సెంటిమెంట్ల మధ్య నలుగుతూ ఆడియన్స్ కి  సస్పెన్స్ బ్రేక్  చేస్తూ ఓ ఇంటర్వల్.

ఫస్ట్ హాఫ్ కథంతా గత సినిమాల మాదిరిగానే సాదాగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ప్రాణం.  రంజిత్ కోసం వెతుకుతూ ఉంటారు పోలీసులు. రంజిత్ కోసం మనల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకు వెళతాడు దర్శకుడు.  తనొక  అనాధ, తన కళ్ళ ముందే చనిపోయిన  తల్లి , జీవితంలో ఎన్నో బాధలతో ఎదుగుతాడు. తనలా ఎవ్వరూ అనాధలు కాకూడదని వున్నోళ్ళ దగ్గర దోచుకున్న డబ్బంతా అనాధలకోసం కర్చుపెడతాడు. టూకీగా ఆడియన్స్ కి  రంజిత్  అనాధాలకి దారిచూపే హీరో అని, స్నేహానికి విలువిచ్చే ఆప్తమిత్రుడని కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తుంది.  మినిస్టర్ హవాలా రూపంలో దారి మళ్ళించాలనుకున్న  వెయ్యికోట్ల డబ్బుని  రంజిత్  దారిమళ్ళించి అనాధాలసేవకోసం ఉపయోగిస్తాడు. ఈ క్రమంలో వైజాగ్ లో సరయుకి రంజిత్ కి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇక్కడే అనుకోని సంఘటనలో రంజిత్ కార్ ఆక్సిడెంట్ అయి చనిపోతాడు. కథ మళ్ళీ వర్తమానంలోకి వస్తుంది. 

ఇప్పుడే మన జబర్దస్తు టీం సుధీర్, అభి లు తన ఫ్రెండ్ కి జరిగిన అన్యాయానికి రంజిత్ మీద పగ తీర్చుకుందామని భీములి బయలుదేరతారు. దారిలో రంజిత్ అనుకోకుండా తగిలి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళతాడు. ఈ విషయం తెలుసుకున్న సత్య, సరయు కూడా అక్కడకి వస్తారు.  అంతవరకూ వున్న సస్పెన్స్ పోయి ప్రేక్షకులకు ఓ కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్ళు సరయు కోసం ఎదురు చూస్తున్నది రంజిత్ ఆత్మ. తను దాచిన వెయ్యికోట్ల డబ్బుని అనాధలకోసం కర్చు పెట్టాలని కోరుతూ ఆత్మ అదృశ్యమవుతుంది. 
ఒక ఆశయంకోసం బ్రతికున్న రంజిత ఆత్మ కోరిక నెరవేరడం కోసం ప్రయత్నిస్తారు సరయు సత్య. ఇదే ఆ ముగ్గురు కథ.

టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :

సత్య కాశ్యప్ సంగీతం ఫరవాలేదు.

ఇక మన దర్శకుడు చంటి గురించి.  దేశాన్ని దోచుకుతినే రాజకీయనాయకుల సొమ్ముని అనాధలకు ఖర్చుపెడితే తప్పేంటి అనే  కాన్సెప్ట్ లో దర్శకుడు కథ, కథనం రెండూ ఆకట్టుకున్నాయి. అనాధల జీవితాల గురించి కథానాయకుడి చుట్టూ తిరిగే సన్నివేశాలు దర్శకుడు బాగా చిత్రీకరించాడు.


ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

రంజిత చాలా బాగా నటించాడు. రఫ్ లుక్ లో హీరోయిజం చూపించడం చాలా బావుంది.

చాలా రోజుల తరువాత పాతతరం నటి పూర్ణిమ ఈ మూవిలో నటించడం చెప్పుకోదగ్గ విషయం.

మిగిలిన నటులందరూ కథకు తగ్గ నటన ప్రదర్శించారు.

బెస్ట్ డైలాగ్స్:

అనాధగా పుట్టిన వాడు అనాధగానే మిగిలిపోకూడదు.


ప్లస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ 
రంజిత్ నటన 

మైనస్ పాయింట్స్ :

చిన్న సినిమా అనే చిన్న చూపు. దర్శకుడి టేకింగ్ అక్కడక్కడా కథని దాటి అవతలకి పోయింది.