అక్షర తోరణం ప్రత్యేక సంచిక

తెలుగు వేదిక రేటింగ్

24

Telugu Movie Review & Rating

Genre :Action & family drama & scintific thriller.
Target: All South Indian Suriya fans.

Story line: టైం మెషిన్ లాంటి వాచ్ తో ఓ కవల సోదరులు ఆడుకునే ఆటే ఈ 24 సినిమా.   

Rating :2/4 (ఫరవాలేదు).

Banner         : 2D Entertainment & Studio Green 
Producer      :   Suriya
Story &Direction : Vikram Kumar

సూరియ, నిత్యామీనన్, సమంతా, గిరీష్ కర్నాడ్, శరణ్య  ముఖ్య తారాగణంగా నటించిన 24 సినిమా సంగతులు మీకోసం.

Release Date : 6th May,2016. 

 బాగాలేదు

ఫరవాలేదు

బావుంది

చాలా బావుంది

NO SCIENTIC WONDER, JUST A FIMILY DRAMA. 


కథలోకి వెళితే :
చాలా రోజులు తరువాత వచ్చిన సూరియ  త్రిపాత్రాభినయం చేసిన 24 కథ ఒక రివెంజ్ ఫ్యామిలీ డ్రామా మరియు సైంటిఫిక్ థ్రిల్లర్ గా సాగుతుంది. గొప్ప కథని చెప్పలేం. అలాని తీసిపారేనులేం. అందరికి తెలిసిన ఫ్యామిలీ డ్రామాకే సైంటిఫిక్ థ్రిల్లర్ అనే మేజిక్ కలిపి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చాడు దర్శకుడు.
ఇక కథలోకి వెళదాం.   
ఓపెనింగ్ సీన్ శివకుమార్, ఆత్రేయ కవలలు ( సూరియ). శివకుమార్  ఎంతో కస్టపడి కనిపెట్టిన సైంటిఫిక్ వాచ్ ను కాజేసే ప్రయత్నంలో తమ్ముడు భార్య ప్రియని( నిత్యామీనన్) చంపేస్తాడు ఆత్రేయ. ఆత్రేయనుంచి తప్పించుకుని, పసివాడైన కొడుకు మణి( సూరియ)ని, వాచ్ ని  ట్రైన్లో  శరణ్యకి అప్పగించి చివరకి ఆత్రేయ చేతిలోనే చనిపోతాడు శివకుమార్. అదే సమయంలో అనుకోని ఆక్సిడెంట్ లో ఆత్రేయ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే 26 ఏళ్ల గడిచిపోతాయి. శరణ్య సొంత తల్లిలా మణిని పెంచుతుంది. మణి ఒక వాచ్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు.అతని దగ్గరే 24 అనే చెక్కపెట్టలో తండ్రి కనిపెట్టిన వాచ్ ఉంటుంది. మణి గతాన్ని, శరణ్య చెప్పకుండా దాచిపెడుతుంది. ఎన్నో సార్లు 24 చెక్కపెట్టెను ఓపెన్ చేద్దామని, దాని కీ దొరకక  మానుకుంటాడు మణి. కథలో ట్విస్ట్ ఏంటంటే ఆత్రేయ కోమాలోంచి బయటపడతాడు. చిత్రంగా ఆత్రేయ పొగుట్టుకున్న కీ మణి దగ్గర చేరుతుంది. ఓపెన్ చేసి చూస్తే ఆ చెక్కపెట్టెలో ఒక వాచ్. ఆ వాచ్ టైం మెషీన్లా పనిచేస్తుంది. కాలంతో ప్రయాణించచ్చు.  టైంని ముందుకీ వెనక్కి తిప్పి, చెక్ చేసుకుని, థ్రిల్ కి గురవుతాడు మణి. ఇక్కడ నుంచే మొదలవుతుంది కథలో సంఘర్షణ. ఆత్రేయ తన తమ్ముడు చివరగా కనిపెట్టిన వాచ్ కోసం ల్యాబ్ లో వెతుకుతుంటాడు. హీరో చాలా సేపు ఒంటరిగా ఉండలేడు కాబట్టి సత్య(సమంతా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన వాచ్ ద్వారా ఎన్నో మాజిక్స్ చేసి సత్య ప్రేమను పొందుతాడు. తన తమ్ముడు చేసిన వాచ్ నమూనాగల పిక్చర్ని  పేపర్లో ప్రకటన ఇచ్చి, అలాంటి వాచ్ ని చేసినవాళ్ళకి 5 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తాడు ఆత్రేయ. చాలా మంది తయారు చేసుకొచ్చిన నమూనాలో అసలయినది మణీ చేసిందేనని గుర్తిస్తాడు ఆత్రేయ. కథలో చిన్న ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఆత్రేయ గదిలో ఉంటాడు మణి. ఇది కనిపెట్టిన ఆత్రేయ మణిని చంపి వాచ్ లాక్కుంటాడు. అర్థంకాని ఆత్రుత రేపే ఈ ట్విస్ట్ కి ఓ బ్రేక్ ఇస్తూ ఇంటర్వల్.

ఇంటర్వల్ తరువాత జరిగే ప్రతీ ట్విస్ట్ లాజికల్ గా ఉంటుంది.వాచ్ సాయంతో 26 ఇయర్స్ బ్యాక్ కి వెళ్లి తనకు జరిగిన ఆక్సిడెంట్ నుంచి బయటపడదామని అనుకుంటాడు ఆత్రేయ. నిరాశే ఎదురవుతుంది. కేవలం వాచ్ 24 గంటలే ముందుకు వెనక్కి వెళుతుంది. మళ్ళీ మణి అవసరం వస్తుంది ఆత్రేయకి. ఆ వాచ్ ని పూర్తిగా ఓ టైం మెషిన్ లా తయారు చేయడం కోసం ఒకరోజు వెనక్కు వెళ్లి మణిని బ్రతికిస్తాడు. వాచ్ ని మణి దగ్గరే వదిలేస్తాడు. ఇకపై నుంచి కథలో ఫ్యామిలీ డ్రామా శాతం పెరుగుతుంది. తన తమ్ముడు కూడా తన పోలికలతో ఉండడంతో అత్రేయ నేనే నీ తండ్రినని నమ్మిస్తాడు. 26 సంవత్సరాలు వెనక్కు వెళితే తనకు జరిగిన ఆక్సిడెంట్ నుంచి బయటపడి ఆరోగ్యవంతుణ్ణి అవ్వచ్చని నమ్మిస్తాడు. మణి వాచ్ ని తండ్రికి తగ్గట్టుగా డిజైన్ చేస్తాడు. కథ ప్రీ క్లైమాక్స్ కి చేరుకునే సమయానికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఆడియన్స్ కి. తన వాచ్ ద్వారా రాత్రే ఫ్యూచర్ లోకి వెళ్లి తన తండ్రిలా నటిస్తున్న పెదనాన్న కుట్రగురించి తెలుసుకుంటాడు మణి. 
క్లైమాక్స్ కాస్త డిఫరెంట్ గా వుంది. ఆత్రేయ, మణి ఒకేసారి గతంలోకి వెళ్ళి, కథ కంచికి చేరే సమయంలో జరిగే మేజిక్స్ అన్నీ చేసి తన తల్లిదండ్రులను కాపాడుకుంటాడు మణి. ఈ క్లైమాక్స్ ఆడియన్స్ ఎవ్వరూ ఊహించంది. మణి చిన్నపిల్లాడిగా కొత్త జీవితం మొదలు పెడతాడు తన తల్లిదండ్రుల దగ్గర. సైంటిఫిక్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, ఊహించని ట్విస్ట్ లతో మొత్తానికి దర్శకుడు ఓకే అనిపించాడు ఈ చిత్రాన్ని.


టెక్నికల్ టీం గురించి నాలుగు మాటలు :


ముందుగా చెప్పుకోవలసింది ఆస్కార్ అవార్డు విన్నర్ రెహ్మాన్ సార్ గురించి. రెహ్మాన్ అన్న పేరే తప్ప ఆ స్థాయి ఎక్కడా కనపడలేదు. ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫరవాలేదు.

సినిమాటోగ్రాఫర్ తిరు గురించి. ఒక్క మాటలో ఈ మూవీని చాల అందమయిన చాయాగ్రహణం అందించారు.  ఈ సినిమా విజయంలో ఈయన పాత్రే కీలకం.

దర్శకుడు విక్రం కుమార్ గురించి. ఓ రివెంజ్ ఫ్యామిలీ డ్రామాకి అందమయిన సైంటిఫిక్ ఫ్లావర్ జతచేసి ప్రేక్షకులపై సంధించాడు. పాత కథే, స్కీన్ ప్లే మాత్రం అలోచింప చేసేది. ఇక ఒక వాచ్ ని టైం మెషిన్ లా ఊహించుకుని థ్రిల్ కి లోనవ్వమంటే మాత్రం ఈ జనరేషన్ యువత ఒప్పుకోరు. కార్టూన్ చానల్స్ లో కూడా టైం మెషిన్ తో ఆడేసుకుంటున్నారు VFX నిపుణులు. కాని అలంటి సాహసమే చేసాడు మన విక్రం. ఇక క్లైమాక్స్ ని కాస్త కొత్తగా చూపించి చివర్లో ఫరవాలేదు అనిపించాడు. మొత్తానికి ఇలాంటి మూవీ తీయడానికి ధైర్యం వుండాలి. ఆ ధైర్యం మన దర్శకుడిలో, కథని ఓకే చేసిన నిర్మాతలో వుండడం మెచ్చుకోవాల్సిన విషయం. ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ వినండి:

త్రిపాత్రాభినయం చేసిన సూరియ నటన అద్భుతః. తనలో ఒక సహజ నటుడిని, ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్స్ ని కలిపి ప్రేక్షకులని తన నటనతో మెప్పించాడు. ఆత్రేయ పాత్రలో నిజంగా సూరియ నటన బావుంది.
ఇక మణి పాత్రలో చాలా స్టైల్ అండ్ యంగ్ గా కనిపించాడు. 


నిత్యామీనన్, సమంతాల నటన బావుంది. సమంతా అభినయం, ఆహార్యం బావున్నాయి.


మిగిలిన పాత్రలో చెప్పుకోతగ్గది తల్లి పాత్ర పోషించిన శరణ్య. చాలా బాగా నటించారు. మిగిలిన పాత్రలు దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టు ముందుకు సాగాయి.


ప్లస్ పాయింట్స్:

సూరియ నటన మరియు క్లైమాక్స్.


మైనస్ పాయింట్స్ :

సైంటిఫిక్ థ్రిల్లర్ పేరు చెప్పుకుని ఓ ఫ్యామిలీ డ్రామా ని చూపించడం.